News
News
X

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా- ఆమోదించిన సెక్రటరీ జే షా

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ ఇండియన్ క్రికెట్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఓ మీడియా హౌస్‌ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి చేసిన ఆరోపణలు క్రిడాలోకం దిగ్భ్రాంతిని కలిగించింది.

FOLLOW US: 
Share:

ఇటీవల ఓ మీడియా హౌస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన కామెంట్స్ చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్‌ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌ క్రికెట్‌ సెలక్షన్‌లపై, ఆటగాళ్ల మధ్య ఉన్న విభేదాలు, ఫిట్‌నెస్‌ చాలా ఆసక్తికరమైన అంశాలను చేతన్ శర్మ బయటపెట్టారు. ఇది భారత్‌ క్రికెట్‌నే ఊపేసింది.

ఇంతకీ చేతన్ చేసిన కామెంట్స్ ఏంటీ?

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ ఇండియన్ క్రికెట్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఓ మీడియా హౌస్‌ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి చేసిన ఆరోపణలు క్రిడాలోకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఫిట్‌నెస్‌ సాధించడానికి క్రికెటర్లు ఇంజెక్షన్‌లు తీసుకుంటారనే సంచలన విషయాలు బయటపెట్టారు. వాళ్లు తీసుకునే ఇంజక్షన్లు డోపింగ్ టెస్టుల్లో కూడా దొరకవని తెలిపారు. చాలా మంది పూర్తిగా ఫిట్‌నెస్‌ లేకపోయినా మ్యాచ్‌కు ముందు ఇంజక్షన్‌లు తీసుకుంటారని తెలిపారు. 80 శాతం ఫిట్‌గా ఉన్నవాళ్లు కూడా ఈ మెడిసిన్ తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తారని వివరించారు. ఇలా చాలా మంది మ్యాచ్‌లు ఆడుతున్నారన్నారు. 

ఇంజక్షన్‌లు తీసుకొని మ్యాచ్‌లు ఆడుతారనే దానికి ఎగ్జాంపుల్స్‌ కూడా చేతన్ శర్మ వివరించారు. ఫేక్‌ఫిట్‌నెస్‌ గేమ్‌లో చాలా బడా క్రికెటర్లు ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కిందకు వంగలేని ఓస్టార్‌ ప్లేయర్‌ కూడా ఇలానే ఫిట్‌నెస్‌ సాదించాడని స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పుకొచ్చాడు. 

జస్ప్రీత్‌ బుమ్రా గాయంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన చేతన్ శర్మ... టీ 20 వరల్డ్ కప్‌కి ముందు బుమ్రా ఫిట్‌గా లేడని...అయినా ఆడించారన్నారు. అయినా మ్యాచ్లు ఆడించారన్నారు. మరో మ్యాచ్ ఆడి ఉంటే మాత్రం బుమ్రా ఏడాది పాటు ఆటకు దూరమయ్యేవారన్నారు. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో ఆడొచ్చన్నారు. 

గంగూలి, కొహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలపై కూడా నోరు విప్పారు చేతన్ శర్మ. గంగూలీ, కోహ్లీకి అసలు పడదని తెలిపారు. తనను కెప్టెన్‌గా తప్పించడంలో ఆయన పాత్ర చాలా ఉందని భావించిన కోహ్లీ... ఆ పేరు వింటేనే మండిపడతారన్నారు. ఓ సెలెక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్‌పై పునరాలోచించాలని గంగూలి చెప్పి ఉంటాడని.. అందుకు కోహ్లీ కుదరదని చెప్పి ఉంటారని చేతన్ తెలిపారు. తనను తప్పించడంపై కోహ్లీ ఓ ప్రెస్‌మీట్‌ పెట్టాలని భావించినప్పటికీ ఎందుకో ఆ పని చేయలేదన్నారు. అయినా... తనను గంటన్నర ముందే కెప్టెన్సీ నుంచి తప్పించారని 2021 దక్షిణాఫ్రికా పర్యటనలో చెప్పిన సంగతి గుర్తు చేశారు. మొదటి నుంచి కోహ్లీ తీరు గంగూలీకి నచ్చదని... సమయం కోసం చూసిన దాదా... రోహిత్ శర్మకు ఓటు వేశారన్నారు.  

రోహిత్‌ శర్మ, కోహ్లీ మధ్య ఇగో క్లాష్‌ ఉందన్నారు చేతన్ శర్మ. ఒకరు రోహిత్‌ అమితాబ్‌, కోహ్లీ ధర్మేంద్రలా ఫీల్ అవుతారన్నారు. జట్టులో విరాట్‌, రోహిత్ వర్గాలు ఉండేవన్నారు. కోహ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం రోహిత్ అండగా ఉన్నాడని వివరించారు. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే విరాట్, రోహిత్ నుంచి టీ 20 ఫార్మాట్‌ నుంచి తప్పించినట్టు తెలిపారు చేతన్‌ శర్మ. ఇక భవిష్యత్‌లో కూడా వీళ్లకు అవకాశాలు రాకపోవచ్చని కూడా కుండబద్దలు కొట్టారు. 

 చేతన్ శర్మ చేసిన కామెంట్స్‌ తీవ్రమైనవి కావడంతో ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీంతో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జే షాకు పంపించారు. లేఖను పరిశీలించిన బీసీసీఐ దిద్దుబాటులో భాగంగా రాజీనామాను ఆమోదించింది. 

Published at : 17 Feb 2023 11:09 AM (IST) Tags: BCCI Rohit Kohli Ganguly Dravid Chetan Sharma BCCI Chief Selector Jha Sha

సంబంధిత కథనాలు

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!

Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!

Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!

Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం