అన్వేషించండి

BCCI: అంధ క్రికెటర్లను ప్రోత్సహించడానికి BCCI కీలక నిర్ణయం !  

BCCI: దృష్టి లోపం ఉన్న క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు, సౌకర్యాలు కల్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంధుల క్రికెట్ సంఘం (CABI) కోసం BCCI నిర్మాణాత్మక సహాయ పథకాన్ని ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు, నాణ్యమైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

రెండు విదేశీ పోటీలకు అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలు   

ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రెండు విదేశీ టోర్నమెంట్లకు పురుషుల, మహిళల జాతీయ జట్లకు అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే, భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో ఆతిథ్య, సందర్శించే జట్ల వసతికి BCCI బాధ్యత వహిస్తుంది. దీంతోపాటు, దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు BCCI అనుబంధ స్టేడియంలు, మైదానాల వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ప్రపంచ స్థాయిలో దృష్టి లోపం ఉన్న క్రికెటర్లు సాధించిన అద్భుతమైన విజయాలకు గుర్తింపుగా సమ్మిళిత క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI స్పష్టం చేసింది.

పురుషుల, మహిళల ప్రపంచ ఛాంపియన్ జట్లు

గత దశాబ్దంలో భారత అంధ క్రికెటర్లు 2012 నుంచి పురుషుల ప్రపంచ కప్ టైటిళ్లు అనేకం గెలుచుకున్నారు. ఇంతలో, భారత మహిళా జట్టు ఇటీవల చారిత్రాత్మక మహిళల ప్రపంచ కప్ విజయాన్ని సాధించింది. BCCI మద్దతు ఈ విజయాలకు మరింత తోడ్పాటునందించనుంది. BCCI,  CABI మధ్య ఈ భాగస్వామ్యం CSR గ్రాంట్లు లేదా విరాళాల మద్దతుతో మరింత సహాయంగా ఉంటుంది. ముఖ్యంగా టోర్నమెంట్లను నిర్వహించడం ,విదేశీ సిరీస్‌లలో పాల్గొనడానికి మద్దతు ఇస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అంధుల క్రికెట్‌ను మరింత సమర్థవంతంగా ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తుంది. భారత అంధ క్రికెటర్ల ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయడానికి, BCCI పురుషులు, మహిళల జాతీయ జట్లకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది.

ఐసిసి అధ్యక్షుడు జై షా పాత్ర

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడు జై షా అనేక ముఖ్యమైన చర్చలకు అధ్యక్షత వహించారు. అంధుల క్రికెట్‌కు మద్దతు లభించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. డాక్టర్ మహంతేష్ జి. కివదాసన్వర్ (అధ్యక్షుడు)శైలేంద్ర యాదవ్ (జనరల్ సెక్రటరీ) వంటి CABI నాయకత్వంతోపాటు, జై షా అంధుల క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఈ భాగస్వామ్యాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Ram Charan: పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
IPL 2026 Playoff Race Intensifies: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ: పంజాబ్ కింగ్స్ గెలుపుతో మారిన స‌మీక‌ర‌ణాలు
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ: పంజాబ్ కింగ్స్ గెలుపుతో మారిన స‌మీక‌ర‌ణాలు
Jacob Bethell to Leave RCB!: బెథెల్ వెంటనే ఇంగ్లండ్ తిరిగి వెళ్లాలి: ఆర్‌సీబీ క్యాంప్ వీడాలంటూ వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బెథెల్ వెంటనే ఇంగ్లండ్ తిరిగి వెళ్లాలి: ఆర్‌సీబీ క్యాంప్ వీడాలంటూ వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేసుకోండి
Embed widget