Asia Cup 2022: సూపర్ -4 ముందు టీమ్‌ఇండియాకు షాక్! జడ్డూ పూర్తిగా దూరం
Asia Cup 2022: ఆసియా కప్-2022లో టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! కీలకమైన సూపర్-4కు ముందు రవీంద్ర జడేజా టోర్నీకి దూరమయ్యాడు.
Asia Cup 2022, Ravindra Jadeja Ruled Out: ఆసియా కప్-2022లో టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! కీలకమైన సూపర్-4కు ముందు రవీంద్ర జడేజా టోర్నీకి దూరమయ్యాడు. అతడి కుడి మోకాలు గాయపడటమే ఇందుకు కారణం. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను (Axar Patel) ఎంపిక చేసినట్టు సెలక్టర్లు తెలిపారు. అతడు ఇప్పటికే దుబాయ్‌లో ఉన్నాడు. స్టాండ్‌బైగా ఎంపిక చేసిన ముగ్గురు ఆటగాళ్లలో అతనొకడు.
టీమ్‌ఇండియాలో అత్యంత చురుకైన, ఫిట్‌నెస్ ఉన్న ఆటగాడు ఎవరంటే తొలుత గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా! అలాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాయపడుతున్నాడు. మైదానంలో చిరుత వేగంతో పరుగెత్తడం, బంతిని అందుకొని వేగంగా వికెట్లకు గురిపెట్టడం అతడి స్పెషాలిటీ. అందుకే అతడి వైపు బంతి వెళ్తే బ్యాటర్లు పరుగు తీసేందుకు జంకుతుంటారు. ఇంక గాల్లో బంతి ఉంటే ఎంత రిస్క్ చేసేందుకైనా వెనుకాడడు. పరుగెత్తుకు వెళ్లి క్యాచ్ అందుకుంటాడు.
అలాంటి జడ్డూ ఐపీఎల్ 15వ సీజన్‌కు ముందు గాయంతో సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. చెన్నైకి ఆడుతుండగానే గాయంతో మధ్యలోనే వెళ్లిపోయాడు. మోకాలి గాయంతోనే జులైలో వెస్టిండీస్ సిరీసుకు దూరమయ్యాడు. మళ్లీ ఫిట్‌నెస్ నిరూపించుకొని ఆసియాకప్‌కు ఎంపికయ్యాడు. పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచులో మెరుగైన ప్రదర్శనే చేశాడు. దాయాదితో పోరులో 148 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో వచ్చిన అతడు 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. చకచకా బౌలింగ్ చేశాడు. ఇక హాంకాంగ్ పోరులో బాబర్ హయత్‌ను ఔట్ చేసి 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు.
ఇంతకు ముందు గాయపడిన మోకాలే మళ్లీ గాయపడిందని తెలిసింది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా బీసీసీఐ అతడిని తప్పించింది. వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. అతడిలాగే ఎడమ చేతితో బౌలింగ్ చేసే స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తీసుకుంది. బ్యాటింగ్‌లోనూ అక్షర్ రాణించే సంగతి తెలిసిందే. మ్యాచ్ పరిస్థితులను బట్టి సింగిల్స్, డబుల్స్‌తో పాటు ఒత్తిడిలో సిక్సర్లు కొట్టగలిగే నేర్పు అతడి సొంతం.
NEWS - Axar Patel replaces injured Ravindra Jadeja in Asia Cup squad.
— BCCI (@BCCI) September 2, 2022
More details here - https://t.co/NvcBjeXOv4 #AsiaCup2022
🚨 JUST IN: Ravindra Jadeja has been ruled out of the remainder of #AsiaCup2022 due to an injury to his right knee
— ESPNcricinfo (@ESPNcricinfo) September 2, 2022
Axar Patel has been called up into the squad as his replacement pic.twitter.com/AB8L4WOQBs