By: ABP Desam | Updated at : 11 Jun 2023 06:32 PM (IST)
ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా ( Image Source : ICC )
ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌పై ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధించి గదను కూడా సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఫైనల్లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా, 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవి చూసింది. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీల ఆకలి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది.
తిరుగులేని ఆధిపత్యం
1987, 1999, 2003, 2007, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకుంది. 2006, 2009 సంవత్సరాల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2021లో అందని ద్రాక్షగా నిలిచిన టీ20 వరల్డ్ కప్‌ను కూడా దక్కించుకుంది. ఇప్పుడు 2023లో భారత్‌పై గెలిచి ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతగా కూడా నిలిచింది.
టీమిండియా ఇలా...
ఇక భారత్ విషయానికి వస్తే... 1983, 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకుంది. కానీ 2013లో విజేతగా నిలిచింది. 2010, 2011, 2017, 2018, 2019 సంవత్సరాల్లో టెస్టు ఛాంపియన్ షిప్ గదను గెలుచుకుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధిస్తే అన్ని ట్రోఫీలూ గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచేది.
మరోవైపు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకొనేందుకు నాలుగో ఇన్నింగ్స్‌లో 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్ స్కోరర్లు. చెతేశ్వర్ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.
ఆదివారం 'నమ్మకం' కాన్సెప్ట్‌తో బరిలోకి దిగింది టీమ్‌ఇండియా! చేతిలో 7 వికెట్లున్నాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (44), అజింక్య రహానె (20) మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. విజయం సాధించాలంటే మరో 280 పరుగులు చేయాలి. ఇది చిన్న టాస్కేమీ కాదు! అలాగని ఆ స్థాయి ఆటగాళ్లు మన దగ్గర లేకపోలేదు! ఆఖరి రోజు ఒక్కటంటే ఒక్క సెషన్ వికెట్ నష్టపోకుండా ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!
ఆఖరి రోజు ఓవర్ నైట్ స్కోరు 164/3తో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 70 పరుగులైనా చేయలేదు. ఆట మొదలైన పావు గంటకే విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. స్కాట్ బొలాండ్ దేహానికి దూరంగా విసిరిన బంతిని ఆడి స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. ఆడాలా వద్దా అన్న డౌట్‌తో ఆడి పెవిలియన్ చేరాడు. అప్పటికి స్కోరు 179/4. ఇదే పెద్ద షాక్ అనుకుంటే బంతి వ్యవధిలోనే రవీంద్ర జడేజా (0) ఔటవ్వడం గమనార్హం. కాస్త ఆఫ్సైడ్ వెళ్లిన బంతి జడ్డూ బ్యాటు అంచుకు తగిలి కీపర్ కేరీ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో జింక్స్, కేఎస్ భరత్ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించారు. అయితే జట్టు స్కోరు 212 వద్ద రహానెను స్టార్క్ ఔట్ చేశాడు. మరో పరుగుకే శార్దూల్ ఠాకూర్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత భరత్, ఉమేశ్ (1), సిరాజ్ (1) ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.
The winning captain 🤩#WTC23 | #AUSvIND pic.twitter.com/1f9c2mxRP2
— ICC (@ICC) June 11, 2023
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ పొడిగింపు
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
/body>