స్మిత్, ఖవాజా సెంచరీలు- దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భారీస్కోరు దిశగా ఆసీస్
AUS vs RSA 3RD Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (195 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (104) లు సెంచరీలతో కదం తొక్కారు.
AUS vs RSA 3RD Test: తొలి రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఇప్పటికే సిరీస్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులోనూ పైచేయి సాధించే దిశగా సాగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు స్మిత్ (104), ఉస్మాన్ ఖవాజా (195 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగటంతో మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరుపై కన్నేసింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (195 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (104) లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పలు వ్యక్తిగత రికార్డులను అందుకున్నారు. టెస్టుల్లో ఖవాజా తన వ్యక్తిగత అత్యధిక స్కోరును అందుకున్నాడు. ఇక స్టీవ్ స్మిత్ టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆసీస్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. స్మిత్ కన్నా ముందు పాంటింగ్ (13,378), అలెన్ బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927) ఉన్నారు. అలాగే సుదీర్ఘ ఫార్మాట్ లో 30వ సెంచరీ బాదిన స్మిత్, మాథ్యూ హేడెన్ శతకాల రికార్డును సమం చేశాడు.
2 వికెట్లకు 147 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 475 పరుగులు సాధించింది. స్మిత్, ఖవాజాలు మూడో వికెట్ కు 209 పరుగులు జోడించారు. స్మిత్ శతకం చేయగా.. ఖవాజా డబుల్ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఉన్నాడు. మార్నస్ లబూషేన్ (79), ట్రావెస్ హెడ్ (70) పరుగులతో రాణించారు. ప్రస్తుతం ఖవాజాకు తోడుగా మాట్ రెన్ షా (5) పరుగులతో క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోకియా 2 వికెట్లు తీశాడు.
150 for Usman Khawaja 👏
— ICC (@ICC) January 5, 2023
Watch #AUSvSA LIVE on https://t.co/MHHfZPyHf9 (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/yJR6DiH5jX pic.twitter.com/VVboTOWtsU
కరోనాతో బ్యాటింగ్ చేసిన రెన్ షా
ఆస్ట్రేలియా బ్యాటర్ రెన్ షా కరోనా వచ్చినప్పటికీ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చేసిన పరీక్షల్లో రెన్ షాకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. అతడిని జట్టు సభ్యులకు దూరంగా వేరే గదిలో ఉంచారు. కరోనాగా తేలినప్పటికీ రెన్ ను మ్యాచ్ ఆడడానికి అనుమతించారు. రెండో రోజు ట్రావెస్ హెడ్ ఔటయ్యాక రెన్ షా బ్యాటింగ్ కు వచ్చాడు. 11 బంతులు ఎదుర్కొని 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
కొవిడ్ తో మ్యాచ్.. నిబంధనలు ఏంటి?
రెన్ షా కొవిడ్ వచ్చినప్పటికీ మ్యాచ్ ఆడడంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం, ఆటగాడు తాను బాగున్నట్లు భావిస్తే మ్యాచ్ లో ఆడవచ్చు. ఒకవేళ అతను ఆడలేని పరిస్థితుల్లో ఉంటే అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవచ్చు.
Australia batters dominated day two in Sydney.
— ICC (@ICC) January 5, 2023
Watch #AUSvSA LIVE on https://t.co/MHHfZPyHf9 (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/yJR6DiH5jX pic.twitter.com/accvpwPaPq
Steve Smith passes Sir Donald Bradman on Australia's all-time list for most Test centuries 👏#WTC23 | #AUSvSA pic.twitter.com/fwHvZDmo18
— ICC (@ICC) January 5, 2023