Asia Cup 2025 Ind vs Pak Match: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌కు ఘోర అవమానం- మ్యాచ్ అయిన వెంటనే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ డోర్ క్లోజ్ - నోషేక్ హ్యాండ్
Asia Cup 2025 Ind vs Pak Match: భారత్ పాక్ మ్యాచ్ తరువాత ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. సైనికులకు గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు.

Asia Cup 2025 Ind vs Pak Match: ఆదివారం జరిగిన ఆసియా కప్ 2025లో జరిగిన అతిపెద్ద మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మొత్తం జట్టు 127 పరుగులు మాత్రమే చేయగలిగింది, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (47) అత్యధిక పరుగులు సాధించాడు. భారత్ 7 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించడమే కాకుండా, భారత్ పలు సందర్భాల్లో పాకిస్తాన్‌ను అవమానించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ అనంతరం పహల్గాం దాడిని ప్రస్తావిస్తూ ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సాయుధ బలగాలకు ధన్యవాదాలు తెలిపారు.
టాస్ సమయంలో చేతులు కలపలేదు
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్‌కు ముందు, టాస్ తర్వాత లేదా మైదానాన్ని వీడే ముందు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో కరచాలనం చేయలేదు.
మ్యాచ్ సమయంలో మాట్లాడలేదు
భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒకరి భాషను ఒకరు అర్థం చేసుకుంటారు. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల మధ్య మైదానంలో ఎక్కువ సంభాషణలు జరుగుతాయి. కానీ ఆదివారం అలా జరగలేదు, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో పెద్దగా మాట్లాడలేదు.
సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మైదానంలో ఆగలేదు
16వ ఓవర్ ఐదో బంతికి సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. కానీ గెలిచిన వెంటనే సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మైదానంలో ఆగకుండా నేరుగా వేగంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. పాకిస్తాన్ ఆటగాళ్లు వారిని చూస్తూ ఉండిపోయారు, అయితే ఇతర మ్యాచ్‌లలో రెండు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి. కానీ భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి కుట్రలు పన్నుతున్న, ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న దేశంతో ఎలాంటి స్పోర్ట్స్ స్పిరిట్ చూపించకూడదని భారత ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు.
Well done Team India! After hitting the winning shot, Suryakumar Yadav and Shivam Dube went straight towards the dressing room. No one from the Indian dugout came out to shake hands, while the Pakistan team stood waiting, but the Indian team didn’t shake hands with them.💪🇮🇳 pic.twitter.com/Qld6Kf0KhO
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 14, 2025
భారత ఆటగాళ్ల కోసం ఎదురు చూసిన పాకిస్తాన్ ఆటగాళ్లు
భారత్ విజయం సాధించగానే, డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు, మైదానం నుంచి తిరిగి వస్తున్న సూర్య, శివమ్‌తో చేతులు కలిపారు, కాని మళ్ళీ మైదానంలోకి వెళ్ళలేదు. సాధారణంగా రెండు జట్ల ఆటగాళ్లు చేతులు కలుపుకుంటారు, కాని భారత ఆటగాళ్లు అలా చేయలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో ఎదురు చూస్తూ ఉండగా, భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకున్నారు.
No handshake by Indian team.
— Aman (@dharma_watch) September 14, 2025
Pakistan waited for handshake but India went to the dressing room and closed the doors.
What a humiliation by Indian team 🤣
Belt treatment for Porkis#INDvPAK #IndianCricket #INDvsPAK #indvspak2025 #AsiaCupT20 #AsiaCup #ShubmanGill #ViratKohli𓃵 pic.twitter.com/zXMXZEmiuP
గౌతమ్ గంభీర్ పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు
మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ పహల్గాం దాడిని ప్రస్తావిస్తూ ఆపరేషన్ సింధూర్ కోసం సాయుధ బలగాలకు ధన్యవాదాలు తెలిపారు. మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో ఎందుకు అలా చేశారో వివరించారు. "ఒక జట్టుగా, మేము పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సంఘీభావం తెలపాలనుకున్నాం. మేము సాయుధ బలగాలకు వారి విజయవంతమైన ఆపరేషన్ కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం" అని ఆయన అన్నారు.




















