అన్వేషించండి

Ravichandran Ashwin: ఆ ఫీలింగ్‌ చెప్పలేను బ్రదర్‌, అశ్విన్‌ మనసులో మాట

R Ashwin : కొత్త ప్రయోగాలు చేయడం, నిరంతరం నేర్చుకోవడం తనకు ఎంతో ఉపయోగపడిందని అశ్విన్‌ అన్నాడు.

 Ravichandran Ashwin wrote history in his milestone 100th Test: ధర్మశాల(Dharmashala) వేదికగా జరిగిన వందో టెస్ట్‌ను భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌(R Ashwin) చిరస్మరణీయం చేసుకున్నాడు. వందో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటాడు. చివరి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్‌ 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్‌.. అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 36 సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. 35 సార్లు అయిదు వికెట్లు తీసి అనిల్‌ కుంబ్లే నెలకొల్పిన రికార్డును అశ్విన్‌ ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు. అత్యధిక సార్లు అయిదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 67 సార్లు ఈ ఘనత సాధించి శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ మురళీధరన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్‌ వార్న్‌ 37 సార్లు... అశ్విన్‌ 36 సార్లు ఈ ఘనత సాధించారు. తన వందో టెస్టులో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అశ్విన్‌ అన్నాడు. తాను ఎలా ఫీల్ అవుతున్నానో ఇప్పుడు చెప్పలేనని అన్నాడు. 

చెప్పలేను బ్రదర్‌
వందో మ్యాచ్‌ ఆరంభానికి ముందు తనకు ఎంతోమంది శుభాకాంక్షలు తెలిపారని అశ్విన్‌ అన్నాడు. ఈ అయిదు టెస్ట్‌ల సిరీస్‌ మొత్తం తన బౌలింగ్‌ యాక్షన్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నానని అశ్విన్‌ తెలిపాడు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించినందుకు సంతోషంగా ఉందన్నాడు. కొత్త ప్రయోగాలు చేయడం, నిరంతరం నేర్చుకోవడం తనకు ఎంతో ఉపయోగపడిందని అశ్విన్‌ అన్నాడు. కుల్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని... అతని చేతుల్లోంచి బంతి వస్తున్న తీరు నమ్మశక్యంగా లేదని అశ్విన్‌ అన్నాడు.

క్రికెట్‌ మేధావి అశ్విన్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఓ క్రికెట్‌ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్‌ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు. జట్టు కోసం ఏ త్యాగానికైనా.. ఎంతటి కష్టానికైనా అశ్విన్‌ సిద్ధంగా ఉంటాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్లను కకావికలం చేసి టీమిండియాకు విజయం సాధించిపెట్టగల ధీరుడు. జట్టుకు వికెట్‌ అవసరమైన ప్రతీసారి కెప్టెన్‌ చూపు అశ్విన్‌ వైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానంలోనూ అశ్విన్‌ అగ్రెసివ్‌గానే ఉంటాడు. మన్కడింగ్‌ ద్వారా బ్యాటర్‌ను అవుట్‌ చేసి... అది తప్పైతే నిబంధనల పుస్తకంలో ఎందుకు ఉందంటూ ధైర్యంగా అడిగే క్రికెటర్‌ అశ్విన్‌. అందుకే అంతర్జాకీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 12 ఏళ్లు దాటినా ఈ స్పిన్ మాంత్రికుడు.. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను వణికిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రికెట్‌ జీనియస్‌ వందో టెస్ట్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘనతను తలుచుకుని అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget