Ashes Series 2023: బెయిర్ స్టో ఔట్ కరెక్టేనా? - బాల్ ఎప్పుడు డెడ్ అవుతుంది - రూల్స్ ఏం చెబుతున్నాయి?
Johnny Bairstow Run Out: లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదం కొత్త చర్చకు ఆస్కారమిచ్చింది.

Ashes Series 2023: ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో వివాదాస్పద రనౌట్ వివాదం కొత్త చర్చకు దారి తీసింది. నిబంధనల ప్రకారం దానిని ఔట్ అని చెబుతున్నా.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాల్ ‘డెడ్’ కాకముందు రనౌట్ చేయడంలో తప్పులేదని కొంతమంది వాదిస్తున్నారు. దీనిపై ఇరు జట్ల మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే అసలు నిబంధనలు ఎలా ఉన్నాయి..?
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
క్రికెట్ లో చట్టాలు చేసే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చట్టాల ప్రకారం బెయిర్ స్టో ఔట్ కరెక్టేనా..? కాదా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి..? బౌలర్ చేతి నుంచి వచ్చే బంతి ఎప్పుడు ‘డెడ్’ అయినట్టు..?
🤐🤐🤐#EnglandCricket | #Ashes pic.twitter.com/dDGCnj4qNm
— England Cricket (@englandcricket) July 2, 2023
ఎంసీసీ నిబంధనల ప్రకారం.. దీని గురించి ప్రస్తావన 20.1 నిబంధనలో స్పష్టమైన వివరణ ఉంది.
- 20.1.1 : బౌలర్ విసిరిన బంతి వికెట్ కీపర్ చేతిలో గానీ లేదా బౌలర్ చేతిలో గానీ సెటిల్ అయినప్పుడు..
- 20.1.1.2 : బౌండరీ లేదా సిక్సర్ కొట్టినప్పుడు..
- 20.1.1.3 : ఒక బ్యాటర్ ఔట్ అయినప్పుడు..
- 20.1.1.7 : బాల్ వెళ్లి ఫీల్డింగ్ సైడ్ లో హెల్మెట్ కు తాకినప్పుడు..
- 20.1.2 : ఒక బంతి విసిరిన తర్వాత అది తిరిగి అంపైర్ వైపు ఉన్న బౌలర్ చేతిలో చేరి క్రీజులో ఉన్న బ్యాటర్లు, ఫీల్డింగ్ సైడ్ బంతిని పరిగణనలలోకి తీసుకోనప్పుడు..
బెయిర్ స్టో విషయంలో ఏం జరిగింది..?
లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔట్ విషయానికొస్తే.. కామెరూన్ గ్రీన్ వేసిన 53 వ ఓవర్ చివరి బంతిని బౌన్సర్ నుంచి తప్పించుకున్న బెయిర్ స్టో.. బాల్ అలెక్స్ కేరీ చేతిలో పడగానే క్రీజు నుంచి ముందుకు కదిలాడు. సరిగ్గా అదే సమయానికి అవకాశం కోసం వేచి చూస్తున్న కేరీ.. వికెట్ల వైపు బాల్ ను విసిరాడు. టీవీ రిప్లేలో బెయిర్ స్టో ముందుకు వెళ్తుండగా కేరీ బంతిని పట్టుకుని వికెట్ల వైపు కొట్టేందుకు సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అప్పటికీ ఇంకా బాల్ డెడ్ కాలేదు. మరోవైపు బెయిర్ స్టో మాత్రం బెన్ స్టోక్స్ తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లి బెయిల్స్ పడిపోయిన శబ్దం రావడంతో నిశ్చేష్టుటయ్యాడు. బెయిర్ స్టో అప్పటికే క్రీజు వదలడం.. బెయిల్స్ పడిపోవడంతో ఆసీస్ ఫీల్డర్లు.. అది ఔట్ అని అంపైర్ కు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ దానిని ఔట్ అని ప్రకటించాడు. టీవీ అంపైర్ నుంచి కూడా అదే సమాధానం వచ్చింది.
Drama at Lord's as Jonny Bairstow is caught wandering outside the crease by Alex Carey 😯
— ICC (@ICC) July 2, 2023
The England batter is run out by a fair distance ☝#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/kXsko0YuLz
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

