అన్వేషించండి
Advertisement
Ajit Agarkar: కెప్టెన్‌గా సూర్య భాయ్, కథ నడిపింది అంతా అగార్కరేనా ?
Suryakumar Yadav: శ్రీలంకతో జరగనున్నటీ 20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించటంపై వివాదం కొనసాగుతూనే ఉంది. టీమిండియాలో తాజా వివాదం మొదలైంది.
Hardik Pandya as India s T20I captain | శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచుల టీ 20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కాదని.. సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav) ను కెప్టెన్‌గా నియమించడంపై వివాదం చెలరేగుతోంది. టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత బౌలింగ్‌తో హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నా.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై వివాదం చెలరేగుతోంది. భవిష్యత్తు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడన్న అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యను తెరపైకి తేవడంపై కొందరు మాజీలు విమర్శలు చేస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ తర్వాత హార్దిక్‌ను కాదని సూర్యకు కెప్టెన్సీ అప్పగించడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. సూర్యతో పోలిస్తే హార్దిక్‌కే ఎక్కువ సారథ్య అనుభవం ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే కెప్టెన్‌గా సూర్య ఎంపిక వెనక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Agit Agarkar) కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి. అగార్కర్ పట్టుబట్టడం వల్లే పాండ్యాను కాదని సూర్యాకు పగ్గాలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
అంతా అగార్కర్ వల్లేనా..?
కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తొలగింపులో తాజా ట్విస్ట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. శ్రీలంక పర్యటనకు ప్రకటించిన భారత జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్ చేయడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పాండ్యాను రోహిత్(Rohit) రిటైర్మెంట్ తర్వాత కొత్త టీ 20 కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే సూర్యకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అయితే కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్(Gautam Gambhair) రావడంతో కెప్టెన్సీ విషయంలో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీ 20 నాయకత్వ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వైస్ కెప్టెన్సీ శుభమన్ గిల్‌కు అప్పగించారు. అయితే సూర్య భాయ్‌కు కెప్టెన్సీ దక్కడం వెనక కథంతా నడిపింది అగార్కరే అని వార్తలు వస్తున్నాయి.
హార్దిక్‌కు నిలకడలేదని... ఎప్పుడూ ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతుంటాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించాలని కొందరు ప్రధాన కోచ్ గంభీర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా విజయవంతమైన కెప్టెన్ కోసం హార్దిక్‌ను కాదని సూర్యను తీసుకోవాలని అందరినీ ఒప్పించాడని సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కూడా హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా చేసేంత సమర్థుడని పూర్తిగా విశ్వసించలేదని తెలుస్తోంది. ఐపీఎల్‌లో గుజరాత్‌కు కెప్టెన్సీ చేసిన దాని వెనక నెహ్రా, బౌచర్ పాత్ర ఉందని కొందరు గుర్తు చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోని యువకులు పాండ్యా కంటే సూర్యకు మెరుగ్గా స్పందించే అవకాశం ఉందని కూడా కొందరు భావిస్తున్నారు.
భారత క్రికెట్ ఇప్పుడు కీలక దశలో ఉంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాండ్యా వెళ్లాలనుకుంటే దేశవాళీలో సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ డిసెంబర్‌లో బరోడా తరపున విజయ్ హజారే ట్రోఫీలో పాండ్యా ఆడుతారాని అంటున్నారు. ఇందులో సత్తా చాటితే పాండ్యాకు మళ్లీ పగ్గాలు అందించే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
రాజమండ్రి
సినిమా
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement