Chris Gayle: ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డు ఇదే - మీకు కచ్చితంగా తెలిసి ఉండదు!
ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డు మీకు తెలుసా?
Chris Gayle IPL Record: ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ జరగనుంది. టోర్నీ ప్రతి ఎడిషన్‌లోనూ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. 16వ సీజన్‌కు ముందు వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట నమోదైన ప్రత్యేకమైన ఐపీఎల్ రికార్డు గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక ఓవర్‌లో 20కి పైగా పరుగులు చేసిన క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
గేల్ దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ 27 ఓవర్లలో 20కి పైగా పరుగులు సాధించాడు. అదే సమయంలో, కీరన్ పొలార్డ్ టోర్నీలో మొత్తం 13 సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (10 సార్లు), ఏబీ డివిలియర్స్ (తొమ్మిది సార్లు), రోహిత్ శర్మ (8 సార్లు), భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (8 సార్లు) కూడా ఉన్నారు.
IPLలో ఒక ఓవర్‌లో అత్యధికంగా 20కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్
క్రిస్ గేల్ - 27 సార్లు.
కీరన్ పొలార్డ్ - 13 సార్లు.
ఆండ్రీ రస్సెల్ - 10 సార్లు.
ఏబీ డివిలియర్స్ - తొమ్మిది సార్లు.
రోహిత్ శర్మ - ఎనిమిది సార్లు.
మహేంద్ర సింగ్ ధోని - ఎనిమిది సార్లు.
క్రిస్ గేల్ ఐపీఎల్ కెరీర్
2008లో జరిగిన మొదటి సీజన్‌లో క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 141 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 39.79 సగటు, 148.96 స్ట్రైక్ రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఇందులో అతను మొత్తం ఆరు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 175 పరుగులుగా ఉంది. ఐపీఎల్‌లో ఒక ఆటగాడు చేసిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇది.
వన్డే క్రికెట్‌లో ఎక్కువ అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరు మీదనే ఉంది. ఇటీవలే రోహిత్ శర్మ ఈ లిస్ట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు సృష్టించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 502 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ. భారత కెప్టెన్ కంటే వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ ముందున్నాడు. క్రిస్ గేల్ 483 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 428 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 502 సిక్సర్లు బాదాడు.
ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మూడో స్థానంలో నిలిచాడు. షాహిద్ అఫ్రిది 508 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు కొట్టాడు. వీరి తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ 474 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 398 సిక్సర్లు కొట్టాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 402 మ్యాచ్‌ల్లో 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.