News
News
వీడియోలు ఆటలు
X

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌ను ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చుకున్నారు.

FOLLOW US: 
Share:

RCB Tweet On Chris Gayle: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు, యూనివర్స్ బాస్ అని అందరూ పిలుచుకునే క్రిస్ గేల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరాడు. వాస్తవానికి, క్రిస్ గేల్ ఈసారి ఆటగాడిగా ఆర్సీబీలో భాగం కాలేడు. కానీ RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో అతని మాజీ ఆటగాడిని చేర్చుకుంటున్నారు. క్రిస్ గేల్ 2011 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా RCBలో భాగమయ్యాడు. అతను 2017 సంవత్సరంలో బెంగళూరు తరఫున చివరి సీజన్‌ ఆడాడు. దీని తర్వాత కూడా క్రిస్ గేల్ IPLలో ఆడినప్పటికీ, పంజాబ్ కింగ్స్‌లో భాగమయ్యాడు.

RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో క్రిస్ గేల్ ఫోటోను షేర్ చేస్తూ యూనివర్స్ బాస్ తనకు ఇష్టమైన ఇంటికి చేరుకున్నాడు అనే క్యాప్షన్‌ను రాశారు. ఆర్సీబీ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అభిమానులకు బాగా నచ్చింది. వాస్తవానికి RCB తన మాజీ ఆటగాళ్ళు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లను హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చుతోంది. ఇది కాకుండా ఇద్దరు మాజీ ఆటగాళ్ల గౌరవార్థం జెర్సీ నంబర్‌ను రిటైర్ చేయాలని నిర్ణయించారు. అంటే భవిష్యత్తులో వీరి జెర్సీ నంబర్లు ఎవరికీ ఇవ్వరన్న మాట.

క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌పై విరాట్ కోహ్లీ ఏం చెప్పాడు?
అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దీనిపై స్పందించాడు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆడడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ తీరు, క్రికెట్ ఆడే విధానాన్ని మార్చేశాడని విరాట్ కోహ్లీ అన్నాడు. క్రిస్ గేల్‌పై కూడా విరాట్ కోహ్లీ స్పందించాడు. క్రిస్ గేల్‌తో కలిసి ఏడు ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఈ ప్రయాణం తనకు అద్భుతంగా ఉందన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ 27 ఓవర్లలో 20కి పైగా పరుగులు సాధించాడు. అదే సమయంలో, కీరన్ పొలార్డ్ టోర్నీలో మొత్తం 13 సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (10 సార్లు), ఏబీ డివిలియర్స్ (తొమ్మిది సార్లు), రోహిత్ శర్మ (8 సార్లు), భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (8 సార్లు) కూడా ఉన్నారు.

IPLలో ఒక ఓవర్‌లో అత్యధికంగా 20కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్
క్రిస్ గేల్ - 27 సార్లు.
కీరన్ పొలార్డ్ - 13 సార్లు.
ఆండ్రీ రస్సెల్ - 10 సార్లు.
ఏబీ డివిలియర్స్ - తొమ్మిది సార్లు.
రోహిత్ శర్మ - ఎనిమిది సార్లు.
మహేంద్ర సింగ్ ధోని - ఎనిమిది సార్లు.

2008లో జరిగిన మొదటి సీజన్‌లో క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 141 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 39.79 సగటు, 148.96 స్ట్రైక్ రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఇందులో అతను మొత్తం ఆరు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 175 పరుగులుగా ఉంది. ఐపీఎల్‌లో ఒక ఆటగాడు చేసిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇది.

Published at : 25 Mar 2023 10:56 PM (IST) Tags: Virat Kohli AB de Villiers IPL 2023 Chris Gayle

సంబంధిత కథనాలు

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! -  పోనీ డ్రా అయితే గద ఎవరికి?

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?