అన్వేషించండి
Advertisement
French Open : ఫ్రెంచ్ ఓపెన్ రాజు అల్కరాజ్, ఫైనల్లో జ్వెరెవ్‌పై గెలుపు
French Open 2024: స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్ చేరిన తొలిసారే చాంపియన్‌గా అవతరించాడు.
Alcaraz outlasts Zverev to claim maiden French Open title: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో(French Open 2024) కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇప్పటికే పచ్చిక కోర్టు, హార్డ్ కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ యువతార కార్లోస్ అల్‌కరాజ్(Carlos Alcaraz ) మట్టి కోర్టులపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తన ఆరాధ్య ఆటగాడు నాదల్ బాటలో నడుస్తూ ఎర్రకోటలో జెండా ఎగరేశాడు. ఆదివారం హోరాహోరీ ఫైనల్ పోరులో ఈ మూడోసీడ్ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో నాలుగోసీడ్ జ్వెరెవ్‌ని ఓడించి టైటిల్ కొట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ఫైనల్ చేరిన అల్‌కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు ఇద్దరి మధ్య 4 గంటల 19 నిమిషాలపాటు హౌరాహౌరీగా సాగింది. మెరుపు సర్వీసులు, క్రాస్‌కోర్టు విన్నర్లతో విజృంభించిన స్పెయిన్ స్టార్.. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేశాడు తొలి సెట్ లో నెగ్గిన అల్కరాజ్‌కు జ్వెరెవ్ మాత్రం అసలు తగ్గేదే లేదంటూ వరుస షాక్‌లు ఇచ్చాడు. వరుసగా రెండు, మూడు సెట్లు జ్వెరెవ్ నెగ్గాడు. రెండో సెట్ అయిదో గేమ్‌లో బ్రేక్ సాధించిన అతడు తరువాత సెట్ గెలిచి స్కోరు సమం చేశాడు. అదే జోరుతో మూడో సెట్లోనూ నెగ్గిన జ్వెరెవ్ కష్టపడకుండానే ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. కానీ అల్కరాస్ నాలుగోసెట్లో అసలుతగ్గలేదు. పట్టుదలగా పోరాడాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన అతడు.. నిర్ణయాత్మక అయిదో సెట్‌లో అల్కరాస్ దూకుడు పెంచాడు. రెండుసార్లు జ్వెరెవ్ సర్వ్‌ను బ్రేక్ చేసి చిరస్మరణీయ విజయంతో టైటిల్‌ను సాధించాడు. దీంతో కెరీర్‌లో మొదటి టైటిల్ గెలవాలని తపించిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కలను భగ్నం చేస్తూ అల్కరాస్ రొలాండ్ గారోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. అయిదు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో జ్వెరెవ్‌ను ఓడించి కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
What can I say? 🏆🥹 @rolandgarros
— Carlos Alcaraz (@carlosalcaraz) June 9, 2024
📸 Getty pic.twitter.com/oLeUmdDdJE
అల్కరాజ్ అద్భుతాలు
1968 తర్వాత పిన్న వయసులో మూడు భిన్నమైన కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడుగా 21 ఏళ్ళ వయసున్న అల్కరాస్ రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన 22 ఏళ్ల జిమ్మి కానర్స్ పేరుతో ఉండేది.
నాదల్ తర్వాత రొలాండ్ గారోస్‌లో టైటిల్ గెలిచిన రెండో పిన్న వయస్కుడు అల్కరాస్. నాదెల్ ఈ టైటిల్ ను 19 ఏళ్ల వేయసుల్లో సాధించగా అల్కరాస్ 21 ఏళ్ళకు సాధించాడు.
గత పదేళ్లలో నాదల్, జకోవిచ్, వావ్రింకా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది అల్కరాస్ మాత్రమే.
కెరీర్‌లో ఫైనల్ చేరిన మొదటిసారే గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు.
టెన్నిస్‌లోని ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ (మూడు గ్రాండ్‌స్లామ్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్ ఘనత వహించాడు. గతంలో ఈ ఘనత స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ , స్వీడన్ కు చెందిన మాట్స్ విలాండర్ , అమెరికన్ జిమ్మీ కానర్స్ , రోజర్ ఫెడరర్ , జొకోవిచ్ , ఆండ్రీ అగస్సీ సాధించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion