By: ABP Desam | Updated at : 12 May 2022 07:07 PM (IST)
Edited By: Ramakrishna Paladi
బ్రెండన్ మెక్‌కలమ్
Brendon McCullum appointed as the Head Coach of England's men's Test Cricket team: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ పురుషుల టెస్టు జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్‌ను ఎంపిక చేసింది. నాలుగేళ్ల పాటు అతడితో ఒప్పందం కుదుర్చుకున్నామని ధ్రువీకరించింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీసు నుంచి అతడు అందుబాటులో ఉంటాడు.
ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెక్‌కలమ్ కోచ్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ జట్టుతో చేరతాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్ సమీకరణాలను బట్టి జాయినింగ్ తేదీ నిర్ణయిస్తారు. న్యూజిలాండ్ తరఫున మెక్ కలమ్ 101 టెస్టులు ఆడాడు. 2004 నుంచి 2016 మధ్య 38.64 సగటుతో 6453 పరుగులు చేశాడు. 2014 టీమ్‌ఇండియాపై టెస్టుల్లో అత్యధిక స్కోరు 302 సాధించాడు. ఒక న్యూజిలాండ్ ఆటగాడు చేసిన ఏకైక ట్రిపుల్ సెంచరీ ఇదే కావడం ప్రత్యేకం.
ఇప్పటి వరకు మెక్ కలమ్ ఏ టెస్టు జట్టుకు కోచ్‌గా పనిచేయలేదు. ఇంగ్లాండ్‌కు చేస్తుండటమే మొదటి సారి. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్‌గా అతడు విజయవంతం అయ్యాడు. దూకుడైన క్రికెట్‌తో కరీబియన్ లీగులో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు విజయాలు అందించాడు. 2013 నుంచి రిటైర్మెంట్ వరకు న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. రన్నరప్‌గా నిలిపాడు.
ఇంగ్లాండ్ జట్టు జూన్ 2న బెన్‌స్టోక్స్ సారథ్యంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీసుకు జట్టు ఎంపికలో మెక్‌కలమ్ ఇన్‌పుట్స్ అందించనున్నాడు. ఇంగ్లిష్ క్రికెట్ జట్టును మెక్‌కలమ్ చక్కగా ముందుకు నడిపిస్తాడని, దూకుడుగా మారుస్తాడని ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ అంటున్నాడు.
'ఈ అవకాశం ఇచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టుతో నేను సానుకూలంగా ముందుకు సాగుతా. సరికొత్త యుగానికి తెరతీస్తాను. ఇంగ్లిష్ జట్టు ముందున్న సవాల్లేంటో నాకు తెలుసు. ఆటలో ఒక బలమైన శక్తిగా బెన్‌స్టోక్స్ సేనను మార్చగలనన్న నమ్మకం నాకుంది. రాబ్‌కీతో ఆసక్తికరంగా సంభాషించాను. నా ప్రణాళికలను వివరించాను' అని మెక్‌కలమ్ అన్నాడు.
Say hello to our new boss! 👋@Bazmccullum | #EnglandCricket pic.twitter.com/T6CiX5OgE5
— England Cricket (@englandcricket) May 12, 2022
"I'm no stranger to bringing about change within a team environment, and I can't wait to get started."
— England Cricket (@englandcricket) May 12, 2022
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
LSG vs RCB, Eliminator Highlights: సెంచరీతో రప్ఫాడించిన రజత్ - ఎలిమినేటర్‌లో LSG టార్గెట్ 208
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత