Ben Stokes: చెన్నై ఫైనల్‌కు చేరితే మ్యాచ్ ఆడతారా? - బెన్ స్టోక్స్ షాకింగ్ ఆన్సర్!
ఐపీఎల్ ఫైనల్ ఆడతావా? లేదా? అని బెన్ స్టోక్స్‌ను అడిగితే తనేం చెప్పాడు?
IPL or Ashes: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు బదులుగా తన జాతీయ జట్టుకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. బెన్ స్టోక్స్ IPLలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో భాగంగా ఉన్నాడు. అతను ఐపీఎల్ చివరి దశలకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పాడు.
యాషెస్ సిరీస్‌కు సన్నద్ధం కావాలనే ఆలోచనను బెన్ స్టోక్స్ ఇప్పటికే వెల్లడించాడు. ఇటువంటి పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు చేరితే ఆఖరి మ్యాచ్ ఆడతాడా? అని బెన్ స్టోక్స్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి అతను కచ్చితంగా ‘నో’ అని చెప్పాడు.
ఈ ప్రశ్నకు స్టోక్స్ స్పందిస్తూ, 'నేను ఇంగ్లండ్ తరఫున ఆడతాను. ఐర్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కి తగిన సమయం ఇచ్చేలా చూసుకుంటాను.’ అని సమాధానం ఇచ్చాడు. జూన్ 1వ తేదీ నుంచి ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ జట్టు, ఈ టెస్టు మ్యాచ్‌ను యాషెస్‌కు సన్నాహకంగా చూస్తున్నారు.
జూన్‌లోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. గత యాషెస్‌లో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఘోరంగా ఓడించింది. కాబట్టి ఈసారి ఎట్టి ఇంగ్లండ్ యాషెస్‌ను చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది.
ఐపీఎల్ ఫైనల్, యాషెస్ మధ్య విరామం ఎంత?
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 28వ తేదీన జరగనుంది. కాగా జూన్ 16వ తేదీ నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌లో ఆడే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు యాషెస్ ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఉంటుంది.
అయితే ఈ సిరీస్‌కు ఉన్న ప్రాధాన్యతను చూసి, ఇంగ్లిష్ కెప్టెన్ ఐపీఎల్‌ను మధ్యలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోని చాలా మంది ముఖ్యమైన ఆటగాళ్లు యాషెస్‌కు సన్నద్ధం కావడానికి ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవడం గురించి ఇంత వరకు ఏమీ మాట్లాడలేదు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్ల నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఐపీఎల్‌లో ఐదేళ్ల తర్వాత బెన్ స్టోక్స్, అజింక్యా రహానే, మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ఒకే జట్టులో భాగమయ్యారు. IPL 2023లో ఈ ముగ్గురు ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతారు. ఇంతకుముందు 2017 ఐపీఎల్ సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున వీరు కలిసి ఆడారు.
ఈసారి కొత్తగా కనిపించనున్న చెన్నై సూపర్ కింగ్స్
IPL 2022లో చెన్నై చాలా దారుణమైన పరిస్థితిలో కనిపించింది. తొమ్మిదో స్థానంలో IPLను ముగించింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈసారి మినీ వేలం ద్వారానే జట్టు తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు.
ఐపీఎల్ 2022 కోసం జట్టులో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు గొప్ప ఆల్ రౌండర్లు ఉన్నారు. దీంతోపాటు జట్టు బ్యాటింగ్, బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో సీఎస్‌కే ఈసారి మైదానంలోకి దిగనుంది.