By: ABP Desam | Updated at : 03 Mar 2023 07:59 PM (IST)
బ్యాట్‌కు తగిలిన రివ్యూ కోరుతున్న తమీమ్ ఇక్బాల్ (Image: Twitter)
ENG vs BAN Viral Video: బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లో రెండో వన్డే మిర్పూర్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 326 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ తరఫున ఓపెనర్ జాసన్ రాయ్ సెంచరీ చేశాడు. జాసన్ రాయ్ 124 బంతుల్లో 132 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఇది కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.
బంతి బ్యాట్‌కి తగిలినా కెప్టెన్ రివ్యూ
అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో ఆదిల్ రషీద్ స్ట్రైక్‌లో ఉన్నాడు. తస్కిన్ అహ్మద్ ఈ సందర్భంగా ఒక అద్భుతమైన యార్కర్ బౌల్ చేశాడు. బంతి అదిల్ రషీద్ బ్యాట్ మధ్యలో తాకింది. అయితే ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ దానికి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్యాట్ మధ్యలో బంతి తగిలింది. ప్యాడ్‌కు ఎక్కడా తగల్లేదు. కానీ బంగ్లాదేశ్ కెప్టెన్ రివ్యూ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ రివ్యూ ఇదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ 2017లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ముష్పికర్ రహీమ్ కూడా ఇటువంటి రివ్యూనే తీసుకున్నాడు. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ చక్కగా డిఫెన్స్ ఆడాడు. కానీ దాన్ని ముష్ఫికర్ రహీమ్ రివ్యూ తీసుకున్నాడు. ముష్ఫికర్ రివ్యూకి వెళ్లగానే విరాట్ కోహ్లీ గట్టిగా నవ్వేశాడు. అప్పట్లో ఆ రివ్యూపై బాగా ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే స్థాయి రివ్యూని తమీమ్ తీసుకున్నాడు. దీనిపై కూడా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc
— Jon Reeve (@jon_reeve) March 3, 2023
Bangladesh went for a review! 😭 pic.twitter.com/bF8sHDTQ8e
— Faiz Fazel (@theFaizFazel) March 3, 2023
bangladesh walon ki nazar buhut ziada kamzor hai pehly bhi aisi reviews li hai en logo ne 😀😂 https://t.co/1yFdYcDVyQ
— Sunny (@Sanaulllaah) March 3, 2023
— Out Of Context Cricket (@GemsOfCricket) March 3, 2023
Worst DRS review for LBW ever by Bangladesh! #ecb #BANvsENG pic.twitter.com/kBdX5bvPBs
— Ralph Rimmer (@razorr69) March 3, 2023
Can't believe Taskin just took a review of which came from the middle of the bat.
— Arshil Haque (@ArshilHaque) March 3, 2023
Oh my eyes. 🫣#Bangladesh #BanEng
ఈసారి సఫారీ సవారి సాగలేదు- కరేబియన్ కుర్రాళ్లదే టీ20 సిరీస్
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్