అన్వేషించండి
Advertisement
Archery World Cup 2024: ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు
Archery World Cup 2024: ఆర్చరీ వరల్డ్ స్టేజ్-1 టోర్నీలో భారత్ మహిళల, పురుషుల జట్టు, కౌంపౌండ్ మిక్స్ డ్ టీంలో భారత్ పతకాలు సాధించింది.
India Won 3 Gold Medals In Archery World Cup 2024: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో.. బంగారు పతకాలతో మెరిసింది. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లోతెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసిపట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ లో జ్యోతిసురేఖహోరాహోరీ పోరాడి పసిడిని సాధించింది.
ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ లతో కలిసి మహిళల టీమ్ ఈవెంట్ లో 236-225 పాయింట్ల తేడాతో పసిడి పతకం కైవసం చేసుకుంది. మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో. అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి 158-157పాయింట్ల తేడాతో గెలిచి పసిడి పతకం సాధించింది. ఇక పురుషుల టీం ఈవెంట్ లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్ , ప్రీతమేష్ లతో కూడిన బృందం... నెదర్లాండ్స్ జట్టుపై 238-231తేడాతో గెలిచి బంగారు పతకం గెలిచింది.
తొలిసారి ఆరుబయట
మరి కొన్ని రోజుల్లో పారిస్‌లో విశ్వ క్రీడా సంరంభానికి తెరలేవనున్న వేళ సంప్రదాయం ప్రకారం ఒలింపిక్స్ పుట్టిన ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన జరిగింది. అయితే ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవాన్ని స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమైంది. ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్ నది ఈ వేడుకలకు వేదిక కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నదిలో 6 కిలోమీటర్ల దూరం పాటు సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలని అనుకున్నారు.
సరికొత్త సాంప్రదాయం
వరల్డ్ అథ్లెటిక్స్(World Athletics) సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్(Olympic) అథ్లెటిక్స్(Athletes)లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో పసిడి పతకాలు గెలిచే వారికి ప్రైజ్‌మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. 2024 ఒలింపిక్స్‌లో భాగంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో పోటీపడి స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమానం కింద 50 వేల యూఎస్ డాలర్లు భారత కరెన్సీలో రూ.41.60 లక్షలు అందించేందుకు సిద్ధమైంది. ఇలా నగదు బహుమానాన్ని ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ(WA) నిలిచింది.
ఒలింపిక్స్‌లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. వరల్డ్ అథ్లెటిక్స్ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రోత్సాహకాలు అందించేందుకు గాను 2.4 మిలియన్ల యూఎస్ డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద డిపాజిట్ చేసినట్టు తెలిపింది. 2028 లాస్ ఎంజేల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement