అన్వేషించండి

All England Badminton Semi Finals: ముగిసిన లక్ష్యసేన్‌ పోరాటం, సెమీస్‌లో పోరాడి ఓడిన స్టార్‌ షట్లర్‌

Lakshya Sen: ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ పోరాటం ముగిసింది. అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్‌ చేరిన లక్ష్యసేన్‌.. సెమీస్‌ గండం దాటలేకపోయాడు.

Lakshya Sen ousted by Jonatan Christie: ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌(All England Badminton Semi Finals)లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌( Lakshya Sen) పోరాటం ముగిసింది. అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్‌ చేరిన లక్ష్యసేన్‌.. సెమీస్‌ గండం దాటలేకపోయాడు. మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ 12-21, 21-10, 15-21 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ జోనాటన్ క్రిస్టీ చేతిలో పోరాడి ఓడాడు. గంటా 8 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన అతను రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశాలు ఇవ్వని లక్ష్యసేన్ ఏకపక్షంగా ఆ గేమ్‌ను దక్కించుకుని పోటీలోకి వచ్చాడు. ఇండోనేషియా ప్లేయర్ పుంజుకోవడంతో ఒత్తిడిలో పలు తప్పిదాలు చేసిన లక్ష్యసేన్ వెనుకబడి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయాడు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ గెలవాలన్న అతని ఆశలు సెమీస్‌లో ఆవిరయ్యాయి. 2022లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్యసేన్‌..మరోమారు ఫైనల్లోకి దూసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. గత వారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరుకున్న లక్ష్యసేన్‌ 11 రోజులుగా విరామం లేకుండా ఆడుతున్నాడు.

క్వార్టర్స్‌ దాటాడిలా
శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 20-22, 21-16, 21-19 తేడాతో సింగపూర్ షట్లర్ లీ జి జియా‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్‌.. మిగిలిన గేమ్‌లు గెలిచి సెమీస్‌ చేరాడు. గంటా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌... జియా లీపై అద్భుత విజయం సాధించాడు. కానీ సెమీస్‌లో ఆ అద్భుతం పునరావృతం కాలేదు. 

అన్నీ ప్రతికూల ఫలితాలే
ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌( All England Open Badminton Championships ) లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండో రౌండ్లోనే ఒలింపిక్‌ పతక విజేత, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు(PV Sindhu) పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సింధు 19-21, 11-21తో టాప్‌సీడ్‌, ప్రపంచ ఛాంపియన్‌, కొరియాకు చెందిన అన్‌ సె యంగ్‌ చేతిలో వరుస గేముల్లో ఓడింది . అంతకుముందు డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి తమ పోరాటాన్ని ముగించారు. జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ ద్వయం 16-21, 15-21తో మహమ్మద్‌ షోహిబుల్‌, బాగాస్‌ మౌలానా జోడీ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌ ఆరంభం నుంచే ఇరు జోడీలు హోరాహోరీగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. 16-19 స్కోరు వద్ద తప్పిదాలు చేసిన సాత్విక్‌ జోడీ తొలి గేమ్‌ను చేజార్చుకొంది. ఇక, రెండో గేమ్‌లోనూ భారత జంట తడబడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇండోనేసియా జోడీ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 21-11, 11-21, 11-21తో చైనాకు చెందిన జాంగ్‌ షు జియాన్‌-జంగ్‌ యు చేతిలో పరాజయం పాలైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Casts his Vote At Mangalagiri | భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్Balakrishna Casts His Vote At Hindupur | హిందూపురంలో ఓటేసిన బాలకృష్ణ | ABP DesamChandrababu naidu Casted Vote | ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు | ABP DesamChiranjeevi Casted Vote With Family | కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
IPL 2024: కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
Amazon: అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
Relationship Tips : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
Embed widget