Sumit Nagal Controversy: సుమిత్.. దీసీజ్ టూ బ్యాడ్.. దేశం తరపున ఆడేందుకు సాకులతో నిరాకరణ! డేవిస్ కప్ పోరుకు జట్టు ప్రకటన
ఏ క్రీడ అయినా దేశం తరపున ప్రాతినిథ్యం వహించాలని ఏ క్రీడాకారుడైన కలలు కంటాడు. అయితే సుమిత్ నాగల్ వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఉందని, ఐటా పేర్కొంటోంది.
Tennis News: భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ వ్యవహార శైలి వివాదస్పదమవుతోంది. డేవిస్ కప్ లో దేశం తరపున ఆడేందుకు నిరాకరిస్తూ, వివిధ సాకులతో కాలం వెళ్లదీస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజా డేవిస్ కప్ ఎంపిక సందర్బంగా అతని ధోరణిపై ఆలిండియా టెన్సిస్ సంఘం (ఐటా) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే డేవిస్ కప్ పోరుకు నాగల్ అందుబాటులో లేకపోవడంపై నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యమైన ఈ పోరుకు తను అందుబాటులో లేకపోవడం సరికాదని, గతంలో కూడా తన కోరికల చిట్టాను మన్నించినా చివరికి పోరులో ఆడకుండా హ్యాండిచ్చాడని మండిపడ్డాడు. దేశానికి ఆడటానికి వెనుకాడటం క్షమించరానిదని పేర్కొన్నాడు. 2025 సీజన్ వరకు రాజపాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి ప్లేయర్ల అందుబాటు గురించి మెయిల్ పంపినా, నాగల్ నుంచి రిప్లే లేదని ఆరోపించాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఆడకూడదనే సాకులు..
డేవిస్ కప్ లో బరిలోకి దిగేందుకు దేశంలోనే హయ్యెస్ట్ ర్యాంకు సింగిల్ ప్లేయర్ సుమిత్ నాగల్ అయిష్టత చూపుతున్నాడని, అతని సూచనలను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఇలా హ్యాండివ్వడం సరికాదని ఐటా ప్రతినిధులు పేర్కొంటున్నారు. నిజానికి ఈ పోరుకు సంబంధించి స్లో హార్డ్ కోర్టును నాగల్ సూచించాడని, అతనిష్టం ప్రకారం అంతా సిద్ధమయ్యాక తను ఆడబోనని పేర్కొనడం ఏంటని మండిపడ్డారు. దీంతో పోరు కోసం మళ్లీ గ్రాస్ కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, ఇది కరెక్టు కాదని వ్యాఖ్యానించారు. నిజానికా ప్లేయర్లకు సపోర్టుగా రాజపాల్ ఉంటారని, అయితే ఈసారి మాత్రం ఇలాంటి ఆటగాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో దిగ్గజాలైన లియాండర్ పేసర్, మహేశ్ భూపతి తదితర ఆటగాళ్లు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అంటే ఎంతో గౌరవం ఇచ్చేవారని, వాళ్లు మాటలకు ఎదురు చెప్పేవారు కాదని, నాగల్ లాంటి వాళ్లు ఆ సంప్రదాయాన్ని మంట కలుపుతున్నారని మండిపడ్డారు.
కావాలనే సుమిత్ ఇలా..
ఉద్దేశ పూర్వకంగా పాకిస్థాన్, స్వీడన్ టై ల నుంచి సుమిత వైదొలిగాడని ఐటా సెక్రటరీ జనరల్ అనిల్ ధుపూర్ వ్యాఖ్యానించారు. ఏటీపీ టూర్లలో అంతంతమాత్రం రాణిస్తున్న నాగల్.. గత సెప్టెంబర్ లో స్వీడన్ తో జరిగిన పోరులో వెన్ను నొప్పితో వైదొలిగాడని, ఇక ఫిబ్రవరిలో పాకిస్తాన్ తో జరిగే పోరుకు సిల్లీ కారణాలు చెబుతున్నాడని అన్నారు. గ్రాస్ కోర్టులు తనకు సరిపడవని అనడం సరికాదని పేర్కొన్నారు. ఇక తాజా డేవిస్ కప్ పోరు కోసం ఐదు సభ్యలతో కూడిన టీమ్ ను ఎంపిక చేసింది. రాజపాల్ చొరవతో శశికుమార్ ముకుంద్ పై నిషేధం ఎత్తివేసిన ఐటా.. తనను జట్టులోకి తీసుకుంది. అతనిపాటు ఆర్యన్ షా, మానస్ ధమ్నే, ధక్షినేశ్వర్ సురేశ్, యువన్ నందల్ జట్టులోకి ఎంపిక చేశారు. అలాగే సిద్ధార్థ్ విశ్వకర్మ, నికి పూనాచలను జట్టు నుంచి ఉద్వాసన పలికారు.