Power Lifter Ramesh: ఏబీపీ 'దేశం' లిఫ్ట్ ఇస్తే 'దేశం'కు పతకాలు ఇచ్చాడు!
రమేశ్‌కు ఆర్థిక సాయం లభించేలా, స్పాన్సర్లు అతడిని ఆదుకొనేలా ABP Desam వీడియో రూపొందించింది. తన కల నిజం చేసుకొనేందుకు సాయం చేసిన 'ఏబీపీ దేశం'కు మెడలో పతకాలు వేసుకొని మరీ ధన్యవాదాలు చెప్పాడు.
టాలెంట్ ఉండి, అవకాశాలు రాక కొంతమంది బాధపడుతుంటారు. కానీ అన్నీ ఉండి వెనుకనుంచి ప్రోత్సాహం లేకపోతే నిత్యం నిరుత్సాహమే. ఆ కోవకే చెందుతాడు పవర్ లిప్టర్ రమేశ్. ఈ క్రీడలో భారతదేశానికి అత్యున్నత పతకం తీసుకురావాలన్న తన కల కోసం ఎంతో తపించాడు. తీరా ఆ అవకాశం వస్తే కాలం కలిసిరాక.. పోటీలకు వెళ్లేందుకు డబ్బుల్లేక ఇబ్బందులెన్నో పడ్డాడు.
దేశానికి పతకాలు తీసుకురావాలన్న అతడిక కలలను నమ్మింది 'ఏబీపీ దేశం'. అతడికి అండగా నిలిచింది. టర్కీలో జరిగే అంతర్జాతీయ టోర్నీకి వెళ్లేందుకు తన వంతు కృషి చేసింది. రమేశ్‌కు ఆర్థిక సాయం లభించేలా, స్పాన్సర్లు అతడిని ఆదుకొనేలా ఓ వీడియో రూపొందించింది. 'దేశం' అతడికి లిఫ్ట్ ఇస్తే 'దేశం'కు అతడు పతకాలు అందించాడు. తన కల నిజం చేసుకొనేందుకు సాయం చేసిన 'ఏబీపీ దేశం'కు మెడలో పతకాలు వేసుకొని మరీ ధన్యవాదాలు చెప్పాడు.
చిన్నప్పటి నుంచీ పేదరికం వెంటాడినా తన సన్నిహితుల అండతోనే పవర్‌లిఫ్టింగ్‌లో మెలకువలు సాధించాడు రమేశ్. సబ్ జూనియర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆల్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. తాజాగా అతడికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. పవర్ లిఫ్టింగ్ ఇండియా నుంచి ఓ లేఖ అందింది.
తను కలలు కంటున్న రోజు రానే వచ్చిందన్న సంతోషం రమేశ్‌కు ఎక్కువసేపు నిలవలేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో పతకం తీసుకురావాలన్న కల నిజం కావాలంటే దాదాపుగా రూ.మూడు లక్షలు అవసరం అవుతాయి. పవర్ లిప్టింగ్ అంటే మాములు విషయం కాదు. స్కాడ్ లిఫ్లింగ్ లో 310కేజీలు, బెంచ్ లిఫ్టింగ్ లో 170 కేజీలు, డెడ్ లిఫ్టింగ్ లో 310 కేజీల బరువును ఎత్తాలి. అంటే రమేష్ మొత్తం 800 కేజీల బరువును ఎత్తి సత్తా చాటాలి.
టర్కిలో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్లాలంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. సాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న రమేశ్‌ను 'ఏబీపీ దేశం' గుర్తించింది. అతడికి మంచి ఆహారంతో పాటు డబ్బులు అందించే దాతల కోసం ఓ వీడియో రూపొందించింది. అందుకు లభించిన స్పందనే అతడికి వచ్చిన పతకాలు.
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని