అన్వేషించండి

Spiritual Names: దేవుళ్ళ పేర్లు పిల్లలకు ఎందుకు పెడతారు? వాళ్లు పేరుకి తగ్గట్టుగా ప్రవర్తించకపోతే ఏమవుతుంది?

God and Goddess Names: పిల్లలకు దేవుడి పేర్లు పెట్టొచ్చా? అసలెందుకు దేవుడి పేర్లు పెట్టాలని పెద్దలు చెబుతారు? తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని కొనసాగించాలా? ఆపేయాలా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిల్లలకు భగవంతుడి పేర్లు పెట్టడం సంస్కారం, భక్తి, ఆశీర్వాదం.
  • భగవన్నామ స్మరణ పవిత్రమైన జపం, పాపహరణ శక్తినిస్తుంది.
  • దైవనామాలు కేవలం శబ్దం కాదు, గుణాలు, తత్వాలను బోధిస్తాయి.
  • పేరును గౌరవంగా పలకాలి, పిల్లలకు సంస్కారం నేర్పాలి.

Spiritual Names: సనాతన ధర్మంలో పిల్లలకు భగవంతుడి పేర్లు పెట్టడం సంప్రదాయం. కేవలం పేరు బావుందని కాదు దాని వెనుక  భక్తి, సంస్కారం, స్మరణ, ఆశీర్వాదం అనే ముఖ్యమైన నాలుగు గొప్ప భావనలు ఉన్నాయ్. రామ, కృష్ణ, శివ, విష్ణు, నారాయణ, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గమేష్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ ఇలాంటి పేర్లు పెట్టినప్పుడు ఆ బిడ్డను పిలిచిన ప్రతిసారీ అప్రయత్నంగా భవవంతుడిని స్మరించడమే. నిత్యం భగవంతుడి నామాన్ని పలకడం కూడా జపమే. అందుకే పిల్లలకు దేవుడి పేర్లు పెట్టమని ప్రోత్సహిస్తారు పెద్దలు.  

భగవద్గీతలో శ్రీకృష్ణుడు 

“యజ్ఞాలలో నేను జపయజ్ఞం”

అని చెబుతాడు..అంటే.. దేవుడి పేరు జపించడం ఎంతో పవిత్రమైన ఆరాధన అని. యజ్ఞం చేయాలంటే భారీ ఏర్పాట్లు కావాలి కానీ నామస్మరణకు పవిత్రమైన హృదయం చాలు. దేవుడి పేరు పదే పదే ఇంట్లో వినిపించడం అంటే ఆ ఇంట నిత్యం భగవన్నామస్మరణ జరుగుతున్నట్టే.  

పురాణాల్లో భగవన్నామస్మరణ మహిమ

భాగవతంలో అజామిళుని కథ ఇందుకు ఉదాహరణగా చెబుతారు. అజామిళుడు ఎన్నో పాపాలు చేసి..తన కుమారుడిని నారాయణ అని పిలిచినంత మాత్రానే విష్ణులోకం పొందాడు. వాస్తవానికి చివరి నిముషాల్లో కూడా అజామిళుడు భగవంతుడిని ధ్యానించలేదు, పిలవలేదు.. కేవలం తన కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టి పిలిచినంతమాత్రన ఈ భాగ్యం దక్కిందని భాగవతకథ చెబుతోంది. ఇందులో ముఖ్యమైన బోధన ఏంటంటే.. భగవంతుడి నామాన్ని తెలిసి పలికినా, తెలియక పలికినా దానివల్ల మనసు పవిత్రం అవుతుంది. అదే భాగవతంలో.. భగవంతుడి నామాన్ని నిర్లక్ష్యంగా పలికితే అది పాపక్షయానికి కారణం అవుతుందని ఉంది. 
 
పేరుకి తగ్గట్టు ప్రవర్తించకపోతే?

భక్తితో భగవంతుడి పేరు పెట్టడం వరకూ సరే.. మరి ఆ పేరుకి తగ్గట్టుగా ప్రవర్తించకపోతే అపచారం అవుతుందా? 
భగవంతుడిని అవమానించినట్టు అవుతుందా? 
ఆ పేరుని రకరకాలుగా పిలవడం మంచిది కాదా? 
వీటిని సమాధానం ఏంటంటే...దేవుడి పేరు పెట్టడం అంటే పిల్లలకు దేవతా గుణాలు నేర్పించడం, ఆ పేరు గొప్పతనం గురించి తెలియజేయడం.. రాముడి పేరైతే సత్యం ధర్మం, కృష్ణుడి పేరు పెడితే జ్ఞానం ప్రేమ కరుణ, శివుడి పేరు పెడితే శాంతి వైరాగ్యం దయ, దుర్గ అనే పేరు శక్తి ఇలా..వాటి అర్థాలు తెలియజేయాలి.  

నామం అంటే సాధారణ శబ్ధం మాత్రమే కాదు!

నామం అంటే కేవలం సాధారణ శబ్ధం మాత్రమే కాదంటున్నాయ్ ఉపనిషత్తులు. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ ద్వారానే సంసారాన్ని దాటవచ్చనే బోధ ఉంది.  “హరే రామ హరే రామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే” అనే మహా మంత్రం చాలు.. సకల పాపాల నుంచి విముక్తి పొందడానికి అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఇది అత్యంత సులభమైన, శక్తివంతమైన మంత్రం. 

విష్ణు సహస్రనామంలో భగవన్నామ మహిమ

భగవంతుడి నామ మహిమ గురించి విష్ణు సహస్రనామంలోనూ ఎంతో గొప్పగా చెప్పారు. మహాభారతం అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించినట్లు చెబుతుంది. ఇందులో భగవంతుని నామాలు కేవలం పేర్లు కాదు..అవన్నీ దవుడి గుణాలు, శక్తులు, తత్వాలు. అందుకే పిల్లలకు భగవంతుడి పేరు పెట్టడం అంటే ఆ బిడ్డ జీవితానికి మంగళకరమైన దిశను సూచించడమే. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దేవుడి పేరు పెట్టినప్పుడు ఆ పేరును హేళనగా, కోపంతో, తిట్టేందుకు వినియోగించకూడదు. పిల్లలను మందలించాల్సి వచ్చినా అవమానకరంగా కాకుండా ప్రేమగా పలకాలి. దేవుడి పేరు పెడితే ఆ పిల్లలు భక్తులుగా మారిపోతారని కాదు..పేరు అనేది జీవితంలో ఓ మంచి విత్తనం లాంటిది. ఆ విత్తనానికి తల్లిదండ్రులు సంస్కారం, ప్రార్థన అనే నీరుపోస్తే మహావృక్షంగా పెరుగుతుంది. 

పిల్లలకు భగవంతుడి పేర్లు పెట్టడం అనేది మూఢనమ్మకం కాదు..శాస్త్రసమ్మతం అయిన, ఆధ్యాత్మికమైన ఆచారం. 

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

సూపర్‌స్టార్ల ఆకర్షణ ముగిసినట్టేనా? వందలకోట్ల సినిమాలు ఎందుకు ఫెయిలవుతున్నాయ్? రెండేళ్లలో ఇండస్ట్రీలో రాబోయే మార్పులివే!

Frequently Asked Questions

పిల్లలకు భగవంతుడి పేర్లు ఎందుకు పెడతారు?

భక్తి, సంస్కారం, స్మరణ, ఆశీర్వాదం అనే నాలుగు గొప్ప భావనల కోసం పిల్లలకు దేవుడి పేర్లు పెడతారు. ఆ బిడ్డను పిలిచిన ప్రతిసారీ భగవంతుడిని స్మరించినట్టే.

దేవుడి నామస్మరణ చేయడంలో ప్రాముఖ్యత ఏమిటి?

భగవద్గీతలో శ్రీకృష్ణుడు జపయజ్ఞాన్ని గొప్పదని చెప్పాడు. నామస్మరణ అనేది పవిత్రమైన ఆరాధన, దీనికి పవిత్రమైన హృదయం ఉంటే చాలు.

భగవంతుడి పేరు పెట్టిన పిల్లలు దానికి తగ్గట్టు ప్రవర్తించకపోతే అపచారం అవుతుందా?

కాదు, భగవంతుడి పేరు పెట్టడం అంటే పిల్లలకు దేవతా గుణాలు నేర్పించడం. వారికి ఆ పేరు గొప్పతనం, దాని అర్థాలు తెలియజేయాలి.

పిల్లలకు దేవుడి పేర్లు పెట్టడం మూఢనమ్మకమా?

కాదు, పిల్లలకు భగవంతుడి పేర్లు పెట్టడం మూఢనమ్మకం కాదు. ఇది శాస్త్రసమ్మతమైన, ఆధ్యాత్మికమైన ఆచారం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget