అన్వేషించండి

ఏ రాశివారు ఏ దేవుడిని ఆరాధించాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

జన్మించిన రాశిని బట్టి ఏ దేవుడిని ఆరాధిస్తే జీవితంలో పురగతి ఉంటుందో, మోక్షప్రాప్తి ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ పూర్తి విశ్వంతో పాటు మన రాశిచక్రం ప్రభావం మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. హిందుత్వ సంస్కృతి ఈ విశ్వానికి మానవ జీవితానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఎన్నో వివరాలను అందించింది. అందులో ఒకటి జ్యోతిష్యం కూడా. ప్రతీ జాతకుడికి ఒక ప్రత్యేక దైవశక్తి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. మరి ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలమో తెలుసుకుంటే జీవిత పరమార్థాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది.

మేషరాశి

రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి. వీరికి ధైర్య సహాసాలు ఎక్కువ. హనుమంతుడు వీరికి ఉత్తమ దైవంగా చెప్పవచ్చు. హనుమంతుడి అంకిత భావం వీరి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి వీరిని కాపాడతాడు.

వృషభ రాశి

వృషభరాశిలో జన్మించిన వారు సెన్సిబుల్ గా ఉంటారు. వినయవిధేయతలు కలిగిన వారు. సౌందర్యఆరాధకులు కూడా. సంపదకు, సమృద్ధికి ప్రతీక అయిన లక్ష్మీదేవి వీరికి అనువైన దైవశక్తి. లక్ష్మీ ఆరాధన వీరికి ఆర్థిక పరిపుష్టిని, మానసిక తృప్తిని ఇస్తుంది.

మిథున రాశి

మిథున రాశి వారు కృష్ణుడిని ఆరాధిస్తే త్వరగా జీవిత లక్ష్యాలు పూర్తి చెయ్యగలుగుతారు. కృష్ణ తత్వం వీరికి సరైన మార్గదర్శనం చెయ్యగలుగుతుంది. కనుక కృష్ణుని ఆరాధించడం, ఆయన బోధలు పాటించడం వీరికి సన్మార్గంగా చెప్పవచ్చు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు చాలా కేరింగ్ పర్సనాలిటి కలిగి ఉంటారు. మాతృత్వ భావనకు ప్రతీక పార్వతి వీరికి సరైన దైవశక్తి. ఆమె ప్రేమకి, కేరింగ్ కి ప్రతీక.

సింహ రాశి

సకల లోకాలను పాలించే విష్ణుమూర్తి సింహరాశి వారి దైవం. సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. విష్ణుమూర్తి ఈ విశ్వాన్ని రక్షిస్తాడు. సింహరాశి వారు కూడా వారిని నమ్ముకున్న వారి పట్ల అటువంటి బాధ్యతతో ఉంటారు కనుక విష్ణువు ఆరాధన వీరిని మరింత బలంగా తయారు చేస్తుంది.

కన్యారాశి

కన్యారాశి వారు సూక్ష్మబుద్ధి కలిగిన వారు, పర్ఫెక్షనిస్టులు కూడా. వీరికి సరస్వతి ఆరాధన బాగా మేలు చేస్తుంది. వీరిలోని సుగుణాలను మరింత మెరుగు పడేందుకు తోడ్పాటునందిస్తుంది. కళల్లో, ఇతర శాస్త్రపరిజ్ఞాన సముపార్జనకు లక్ష్మీ ఆరాధన చాలా తోడ్పాటును అందిస్తుంది.

తులా రాశి

తులా రాశి వారు ప్రతి విషయంలో సంతులనంగా ఉండే లక్షణం కలిగి ఉంటారు. వీరి దైవం గణపతి. ఆయన విజ్ఞాలను తొలగించి మార్గాన్ని సుగమం చెయ్యగలడు.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారు కాళీమాత ఆరాధన చేసుకుంటే వీరికి ఆత్మ జ్ఞానం త్వరగా అందుతుంది. ఆహంకారం నశించి మోక్షం ప్రాప్తిస్తుంది.

ధనస్సురాశి

వైద్యానికి, శుశ్రూతకు ప్రతీక అయిన ధన్వంతరిని ఆరాధిస్తే ధనస్సు రాశిలో పుట్టిన వారికి మేలు జరుగుతుంది. వీరు సత్యశోధనలో ముందుంటారు. కనుక వీరికి త్వరగా సత్యం బోధపడాలంటే ధన్వంతరి ఆరాధన మంచిది. ఈ దైవారాధన వీరికి ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాల్లో సైతం విజయం చేకూరుస్తుంది.

మకరరాశి

మకరరాశి వారికి నిజాయితి, అంకితభావం చాలా ఎక్కువ. వీరిని నడిపించే దైవం శని. శని క్రమశిక్షణకు, కర్మ కారకుడు కూడా. విజయం కోసం వీరు చేసే కఠోరశ్రమకు మంచి ఫలితాలను శని వీరికి అందించగలడు.

కుంభరాశి

దృక్పథం, పరోపకారం కలిగిన కుంభరాశి వారు రాముడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాముడి అంకితభావం, స్థిరమైన నిజాయితి కుంభరాశి వారి సంఘ సంస్కరణకు ఎంతో ఉపయోగపడతాయి.

మీనరాశి

సహానుభూతి కలిగి గొప్ప కలలు కనే సామర్థ్యం కలిగిన మీన రాశి వారు శివారాధన చేస్తే వీరిలోని సృజనాత్మకత, సున్నితత్వం వీరికి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది.

Also Read : కన్ను అదరడం.. అద్దం పగలడం.. ఇవి నిజంగా మూఢనమ్మకాలేనా? వీటి వెనుక ఉన్న లాజిక్ ఏమిటీ?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 2026 మాసఫలాలు: సింహ, కన్య రాశుల కెరీర్, ఆర్థిక, ప్రేమలో కీలక మలుపులు!
నవంబర్ 2026 మాసఫలాలు: సింహ, కన్య రాశుల కెరీర్, ఆర్థిక, ప్రేమలో కీలక మలుపులు!
మిథున, కర్కాటక రాశుల నవంబర్ 2026 మాసఫలాలు: ఈ నెలలో కీలక మార్పులు!
మిథున, కర్కాటక రాశుల నవంబర్ 2026 మాసఫలాలు: ఈ నెలలో కీలక మార్పులు!
మేషం, వృషభం నవంబర్ 2026 మాసఫలాలు: ఉద్యోగం, ఆర్థికం, ప్రేమలో కీలక మార్పులు!
మేషం, వృషభం నవంబర్ 2026 మాసఫలాలు: ఉద్యోగం, ఆర్థికం, ప్రేమలో కీలక మార్పులు!
అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget