Weekly Horoscope: ఈ రాశులవారికి ఓర్పే శ్రీరామరక్ష, 18 జూలై నుంచి 24 జూలై 2022 వరకు వార ఫలాలు
Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
![Weekly Horoscope: ఈ రాశులవారికి ఓర్పే శ్రీరామరక్ష, 18 జూలై నుంచి 24 జూలై 2022 వరకు వార ఫలాలు Weekly Rasi Phalalu july 18th to 24th 2022 astrological prediction for Gemini, aries and Other Zodiac Signs check weekly horoscope Weekly Horoscope: ఈ రాశులవారికి ఓర్పే శ్రీరామరక్ష, 18 జూలై నుంచి 24 జూలై 2022 వరకు వార ఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/c7c9a8b70622c45de42e03be15ba25e21658123649_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వారఫలాలు జులై 18 సోమవారం నుంచి 24 ఆదివారం వరకు( Weekly Rasi Phalalu)
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదం)
ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలవారికి ఉత్సాహవంతమైన సమయం. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం, ఖర్చులు ఉంటాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎవ్వరితోనూ వివాదం వద్దు.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పాదం)
ఈ వారం మీకు ఓ శుభవార్త ఆనందాన్నిస్తుంది. అప్పుల బాధనుంచి విముక్తి పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇల్లు తీసుకోవాలి అనుకున్నవారికి అనుకూల సమయం ఇది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి మంచి గుర్తింపు వస్తుంది. అనుభనజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదం)
మీలో ఓర్పే మీకు మంచి చేస్తుంది. బుద్ధిబలంతో ఎంతటి పనినైనా పూర్తిచేయగలుగుతారు. మీరంటే గిట్టినివారు మిమ్మల్ని తప్పుతోవ పట్టిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా టార్గెట్ రీచ్ అవుతారు. కళారంగం వారికి అనుకూల ప్రయోజనాలున్నాయి.ఆవేశం, కోపం తగ్గించుకోండి.
కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈవారం కర్కాటక రాశివారు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఓసారి ఆలోచించండి. స్థిరాస్తి పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇల్లు, వాహనం కొనాలి అనుకున్నవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ వారం అన్నీ అనుకూల ఫలితాలే. ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఈ వారం ఏ పని మొదలెట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారులు , ఉద్యోగులకు కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. అనవసర ప్రయోగాలు చేయకండి.అపోహలు తొలగిపోతాయి. వారం మధ్యలో ధనవ్యయం, సన్నిహితులతో విభేదాలు ఉంటాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పాదం)
ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసొస్తాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు గౌరవం పొందుతారు. పారిశ్రామిక వర్గాలవారు విదేశీ పర్యటనలు చేస్తారు. వారం చివర్లో కుటుంబలో చికాకులుంటాయి
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదం)
తులా రాశివారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో మరింత మెరుగుదల కనిపిస్తోంది. దీర్ఘకాలిక బాధల నుంచి ఉపశమం లభిస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా మనోధైర్యంతో ఒడ్డున పడతారు. కీలక విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శత్రువులు మిత్రులవుతారు. అన్ని రంగాలవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి. కళారంగం వారికి అనుకూలసమయం. వారం ప్రారంభంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కొంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
కొన్ని రోజులుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కీలక విషయాల్లో శ్రద్ధగా వ్యవహరించాలి. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదం)
ఈ వారంలో మకరరాశివారిని ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఇబ్బందికర సమయం.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తారు.భూములు,వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మ వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం.
మీనం (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.వ్యాపారాలు బాగా సాగుతాయి. చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)