అన్వేషించండి

Weekly Horoscope June 6 to June 12: ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం, ఈ వారం మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Weekly Horoscope :ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

జూన్  6 నుంచి  12 వరకు  వార ఫలాలు

మేషం
ఈ వారం మీకు ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఓ శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు  విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  ఎప్పటి నుంచో వెంటాడుతోన్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  వ్యాపారులకు అంతా అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, విద్యార్థులు మరింత కష్టపడాలి.   వారం ప్రారంభంలో మాత్రం ఇంటా-బయటా కొంత చికాకుగా ఉంటుంది. 

వృషభం
పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. ఉద్యోగులకు అంతా శుభసమయం. వారం మధ్యలో వృధా ఖర్చులు, కొంత ఒత్తిడి, స్వల్ప అనారోగ్యం ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు సాగితే సక్సెస్ అవుతారు.

మిథునం
ఈ వారం మిథునరాశివారి శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆత్మీయుల నుంచి విన్న సమచారం కొంత ఇబ్బందిపెడుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. తలపెట్టిన పనుల్లో అవాంతరాలుంటాయి. మిత్రులతో వేబేధాలు ఉండొచ్చు. ఆలోచనలు కలసిరావు. కష్టపడినా ఫలితం అంతగా దక్కదు. వ్యాపారులు కొత్త ప్రయోగాల చేయొద్దు.  ఉధ్యోగులు విధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. 

Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట

కర్కాటకం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి..కొత్త పనులు మొదలెడతారు. శుభకార్యాలకోసం ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం.విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగలకు విధినిర్వహణలో ఎదురైన అవాంతరాలు తొలగిపోతాయి. పారిశ్రామిక వేత్తలకు శుభసమయం.  వారం చివర్లో బంధువులతో తగాదాలుంటాయి. 

సింహం
ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే యోచనలో ఉంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులకు ఒత్తడి తొలగిపోతుంది. ఆలయాలను సందర్శఇస్తారు. ప్రముఖులతో పరిచయాలవుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయనాయకులకు అంతా శుభసమయం. 

కన్య
ఈ వారం కన్యారాశివారి ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో చెల్లించాల్సిన అప్పులు కొంతవరకూ క్లియర్ చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో వేధిస్తోన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది.  స్థిరాస్తులు కొనుగోలు దిశగా అడుగేస్తారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వ్యాపారులు సంతోషకరమైన వార్త వింటారు.  వారం చివరిలో బంధువిరోధాలు, ఒత్తిడి ఉంటుంది. 

తుల
పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కొత్త  పనులు  చేపడతారు. ఓ కీలక సమచారం తెలుసుకుంటారు.కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.  స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. కళారంగం వారికి అనుకూల సమయం. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి. 

వృశ్చికం
ఆదాయం బావుంటుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి.  ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. 

Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా

ధనుస్సు 
 ఈ వారం ధనస్సు రాశివారు  పరిస్థితులను మరింత అనుకూలంగా మలచుకుంటారు.  ఇంతకాలం పడిన కష్టానికి ప్రతిఫలం పొందుతారు.  కొన్ని వివాదాలు  పరిష్కరించుకుంటారు. ఉన్నత చదువులకోసం విద్యార్థుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు జోరందుకుంటాయి.  వ్యాపారాలు లాభం పొందుతారు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారి ఆశ నెరవేరుతుంది.  వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు.

మకరం
మకర రాశివారికి ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.  ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు మంచి సమయం.  ఉద్యోగస్తులకు అంతా ప్రశాంతం.  వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. 

కుంభం
కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్నిస్తుంది. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. రాబడి  కొంత పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి.  ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం వింటారు.  వారం చివరిలో అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు. 

మీనం..
ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.  కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదా లభిస్తుంది. రాజకీయ నాయకులకు కలిసొచ్చే సమయం ఇది.  వారం ప్రారంభంలో అనుకోని  ఖర్చులు. మానసిక అశాంతి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read:  సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget