News
News
X

మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం ఇవి ఉండకూడదు

పూజ గది అంటే ప్రశాంతతకు నిలయం. దైవం కొలువై ఉండే ఆ ప్రాంతం నిత్యం శుభ్రంగా, అనవసర వస్తువులేవీ లేకుండా ఉండాలి. మరి, ఏయే వస్తువులు ఉండకూడదో చూడండి.

FOLLOW US: 
 
ప్రతీ ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. వాస్తును అనుసరించి ఇంట్లో అన్నింటికంటే పూజగది పవిత్రమైన ప్రదేశం. ఇక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి అది ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే ఈ గదిలో నెగెటివ్ వస్తువులను అస్సలు ఉంచకూడదు.  ఇలాంటి వస్తువులు పూజ గదిలో ఉంటే మనఃశాంతి కరువవుతుంది. అంతేకాదు సంపద, రాబడి మీద కూడా ప్రభావం ఉండొచ్చు. అందుకే పూజ గది నుంచి ఏ వస్తువులను వెంటనే తీసెయ్యాల్సిన అవసరం ఉందో, చిన్నవే అయినా ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉందో  ఒక సారి తెలుసుకుందాం.

పూజ గది ఇంటిలో ఈశాన్య దిక్కున నిర్మించుకోవడం మంచిది. పూజ చేసే వారి ముఖం తూర్పు వైపుకు, లేదా ఉత్తరం వైపుకు ఉండాలి. దక్షిణం లేదా పడమర వైపు ఉండడం అంత మంచిది కాదు. పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు మరునాడు తప్పని సరిగా తీసెయ్యాలి. వీటిని నైర్మల్యం అంటారు. ఈ నైర్మల్యాన్ని చెత్తలో వెయ్య కూడదు. వీటిని అన్నింటిని సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలెయ్యాలి. వత్తి పూర్తిగా కాలిపొయ్యే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించ కూడదు. ప్రతి రోజూ పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చెయ్యని దీపాలతో దీపారాధన చెయ్యకూడదు. దేవుడికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పని సరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మరచిపోకూడదు. అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్టవుతుంది.

  • పూజ గదిలో విరిగిపోయిన లేదా పగుళ్లు చూపిన విగ్రహాలు వస్తువులు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు.
  • ఒకే దేవి లేదా దేవతకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు లేదా చిత్ర పటాలు పెట్ట కూడదు.
  • రౌద్ర రూపంలో ఉండే దేవి లేదా దేవుడికి సంబంధించిన మూర్తులు లేదా చిత్ర పటాలు పూజలో ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంటుంది.
  • చిరిగిన లేదా జీర్ణమయిన పూజ పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసెయ్యడం మంచిది. ఇలాంటి వాటిని ప్రవహించే నీటిలో వదిలెయ్యడం మంచిది.
  • అక్షతలుగా ఎప్పుడూ కూడా విరిగిన బియ్యం గింజలు అంటే నూకలను వాడకూడదు. అటువంటి బియ్యం పూజ గదిలో ఉంటే వాటిని తీసేసి మంచి బియ్యం ఉంచాలి.
  • పూజ గదిలో గతించిన పెద్ద వారి చిత్రాలు కూడా ఉంచరాదు. వీటి వల్ల చాలా అశుభ పరిణామాలు ఉండవచ్చు. అందుకే పెద్ద వారి చిత్రాలు ఇంటిలోని మరో చోట ఎక్కడైనా పెట్టాలి.

ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది.]

Also Read: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే అన్నీ కష్టాలే, ఈ చిట్కాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుంది

News Reels

Published at : 03 Nov 2022 06:00 PM (IST) Tags: Pooja vastu Positive Energy pooja room nagetiv energy

సంబంధిత కథనాలు

Vastu Tips: ఇంటిని ఇలా అలంకరిస్తే అదృష్టం మీ వెంటే!

Vastu Tips: ఇంటిని ఇలా అలంకరిస్తే అదృష్టం మీ వెంటే!

Spirituality: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులివే!

Spirituality: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులివే!

తులసి మొక్క మీ ఇంట్లో ఈ దిక్కున ఉంటే సిరిసంపదలకు లోటుండదు

తులసి మొక్క మీ ఇంట్లో ఈ దిక్కున ఉంటే సిరిసంపదలకు లోటుండదు

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక పరిస్థితి అదుర్స్, వ్యాపారంలోనూ లాభాలు

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక పరిస్థితి అదుర్స్, వ్యాపారంలోనూ లాభాలు

Vastu Tips: నైరుతిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకూడదు, అలా చేస్తే నష్టం తప్పదు

Vastu Tips: నైరుతిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకూడదు, అలా చేస్తే నష్టం తప్పదు

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు