Astro Remedies for Bad Dreams: పీడ కలలు నిద్ర పట్టనివ్వట్లేదా.. రాహు దోష ప్రభావం కావచ్చు - ఈ పరిహారాలతో హాయిగా నిద్రపోండి
Astro Remedies for Bad Dreams: జాతకంలోనైనా రాహు దోషం ఉంటే చెడు, పీడ కలలు ఇబ్బంది పెడతాయి. అవి క్రమంగా ఆ వ్యక్తి మానసిక, దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటాడు.

Astro Remedies for Bad Dreams : మనందరికీ అప్పుడప్పుడు పీడకలలు వస్తూంటాయి. అందులో ప్రత్యేకతేముంది.. అది అందరికీ ఏదో ఒకసారి జరిగే సాధారణమైన విషయమే కదా అనుకుంటున్నారా.. కానీ అవి మీకు రోజూ వస్తే.. ఇవి కచ్చితంగా హెచ్చరిక సంకేతాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, మీ జాతకంలో దోషం ఉండటం వల్ల కూడా ఇలా జరగొచ్చు. అయితే పీడకలలు ఎందుకు ఎక్కువగా వస్తాయో, ఈ సమస్యను అధిగమించడానికి పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరి జాతకంలోనైనా రాహు దోషం ఉంటే, ఆ వ్యక్తి తన జీవితంలో ఒకేసారి లెక్కలేనన్ని సమస్యలను ఎదుర్కొంటాడు. అంటే పనిలో అడ్డంకులు, కుటుంబ సభ్యులు వంటివి అతన్ని నిరాశకు గురి చేస్తాయి. ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం అవుతుంది. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ గందరగోళంగా ఉంటారు. ఎప్పుడూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. వారికి తరచూ భయానక కలలు లేదా పీడకలలు కూడా వస్తాయి. అలా భయానక కలలు రావడం వల్ల శారీరక బలహీనత, ఎల్లప్పుడూ సోమరితనం లేదా శక్తిహీనంగా అనిపించడం జరుగుతుంది. ఇది కూడా మీ జాతకంలో రాహు దోషానికి సంకేతాలు. ఆ వ్యక్తి చుట్టూ మురికి, అశుభ్రంగా ఉంటే లేదా వారి శుభ్రమైన బట్టలు చాలా త్వరగా మురికిగా మారుతుంటుంటే ఆ వ్యక్తి రాహువు కోపాన్ని ఎదుర్కొంటున్నాడనడానికి సంకేతాలు.
రాహువు ప్రభావం లక్షణాలు
రాహువు ప్రభావం వల్ల వ్యక్తి గోళ్లు, వెంట్రుకలు రాలడం ప్రారంభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి విడిపోవడం, విడాకులు తీసుకునే స్థాయికి కూడా చేరుకుంటుంది.
రాహు దోష నివారణలు
రాహు దోషం కారణంగా అశుభకరమైన విషయాలు జరగడం ప్రారంభిస్తాయి, జీవితంలో సమస్యలు పెరుగుతాయి. కావున ఈ సమయంలో రాహువును సూచించే దూకుడు లేదా కోపాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. వాటిలో..
- రాహువును శాంతింపజేయడానికి, ప్రతిరోజూ శివలింగానికి నీటిని సమర్పించడంతో పాటు మహామృత్యుంజయ లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా కారణం చేత ప్రతిరోజూ దీన్ని చేయడం సాధ్యం కాకపోతే, కనీసం ప్రతి సోమవారం, శనివారం ఈ పరిహారం చేయండి. రాహువుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి శివుడిని ప్రార్థించాలి.
- బుధవారంతో మొదలుపెట్టి ఏడు రోజులు విరామం లేకుండా నల్ల కుక్కకు తీపి రొట్టె తినిపించడం వలన, రాహువు ప్రభావాలు చాలా త్వరగా తగ్గుతాయి. రాహు దోషంతో బాధపడుతున్న వ్యక్తులు మద్యం, మాంసం, మాదకద్రవ్యాలు మొదలైన వాటిని తీసుకోవడం మానుకోవాలి. ఆదివారం నాడు భైరవ్ బాబాను తప్పకుండా సందర్శించాలి.
- ఈ పరిహారాలన్నింటితో పాటు, మీరు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. అది పరిశుభ్రతను పాటించడం. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండండి, రోజువారీ దినచర్యను అనుసరించండి, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.
చెడు కలలను పోగొట్టే జ్యోతిష పరిహారాలు
- చెడు కలలను వదిలించుకోవడానికి అత్యంత ముఖ్యమైన నివారణలలో ఒకటి ప్రతిరోజూ మీ ఇంటి నేలను ఉప్పు నీటితో శుభ్రం చేయడం. పడుకునే ముందు ఉప్పు నీటితో నేలను తుడుచుకోవడం వల్ల మీకు మంచి నిద్ర వస్తుందని శాస్త్రం చెబుతోంది.
- మీ కలలను క్లియర్ చేసుకోవడానికి మీ పాదాలను గోరువెచ్చని నీటితో కడుక్కోండి.
- నిద్రలో సానుకూల ఫలితాన్ని పొందడానికి మీ నుదిటిపై కొబ్బరి నీళ్ళతో రాయండి.
- పడుకునే ముందు మీ దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బ పెట్టుకోండి.
- మీ దిండు కింద తెల్లటి గుడ్డలో కొన్ని సోంపు గింజలను ఉంచండి.
- పసుపు బియ్యం ప్యాకెట్ ఉంచుకోవడం వల్ల కూడా చెడు కలలు రాకుండా ఉంటాయి.
- ఫిట్కారి అని కూడా పిలువబడే పటిక ప్యాకెట్ మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీరు పీడకలల నుండి బయటపడతారు. ఒక వారం పాటు ఇలా చేసి, ఆపై దాన్ని కాల్చివేయండి.
Also Read : Sri Shyamala Dandakam: ఫిబ్రవరి 07 వరకు మాఘ గుప్త నవరాత్రులు - ఈ దండకం పఠిస్తే సంపద, జ్ఞానం, సానుకూల శక్తి!





















