(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Tips : ఈ లోహపు విగ్రహాలను పూజిస్తే, నట్టింట్లో కనకవర్షమే!
Vastu Tips : ఎవరి స్తోమతను బట్టి వారు ఈ విగ్రహాలను పూజిస్తుంటారు. పూజాగదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పూజ గదిలో వివిధ రకాల లోహాలతో చేసిన దేవుని విగ్రహాలను పూజిస్తాం. సాధారణంగా పంచలోహాలు,వెండి విగ్రహాలతో చేసిన దేవుళ్లను పూజిస్తాం. అయితే శాస్త్ర ప్రకారం బంగారంతో చేసిన దేవుడి విగ్రహాలను కూడా పూజ చేయవచ్చని పండితులు చెబుతున్నారు. ఎవరి స్తోమతను బట్టి వారు ఈ విగ్రహాలను పూజిస్తుంటారు. పూజాగదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
దేవుని విగ్రహాలు మతవిశ్వాసం, భక్తికి చిహ్నాలు. సాధారణంగా చాలా మంది తమ పూజాగదిలో దేవుడి చిత్రపటాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే మరికొందరు నియమ నిష్టలు పాటించేవారు దేవుడి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. కాగా ఇంట్లో ప్రతిష్టించే విగ్రహాలు..శాంతి, ప్రశాంతతను కలిగిస్తాయి. సనాతన మత గ్రంథాల ప్రకారం పూజ గదిలో ఏర్పాటు చేసుకునే లోహపు విగ్రహం మీ పూజ ఫలం మరింత పెంచుతుంది.
పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి:
పూజ గదిలో బంగారంతో చేసిన దేవుడి విగ్రహాన్ని పూజించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. పూజ గదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం అనేది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే బంగారు విగ్రహం నుంచి వెలువడే పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ను నిలువరిస్తాయి.
బంగారు విగ్రహం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం:
బంగారంతో చేసినటువంటి విగ్రహాలను పూజించడం ద్వారా, సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. బంగారానికి మరో పేరు సిరి. సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. కావున ఆ మహాలక్ష్మి దేవి కృపాకటాక్షాలు దక్కాలంటే బంగారాన్ని పూజించాలి.
శక్తికి మూలం:
బంగారంతో చేసిన విగ్రహాలు శక్తికి మూలమని సనాతన ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరైతే శక్తి ఆరాధన చేయాలనుకుంటారో వారు బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా తమ కోరికలను నెరవేర్చుకోవచ్చు.
పూజలో ఆత్మీయత:
బంగారంతో చేసిన విగ్రహాలు ఆరాధనలో ఆత్మీయతను, గౌరవాన్ని పెంపొందిస్తాయి. ఇది భక్తులు, దేవుళ్ల మధ్య బంధాన్ని సృష్టిస్తుంది. అలాంటి విగ్రహాలను పూజించే వ్యక్తి మనసులో గౌరవ భావం ఏర్పడుతుంది. ఇది సమాజంలో మీ గౌరవం పెంచేందుకు సహాయపడుతుంది.
అదృష్టం, శ్రేయస్సు:
ఇంట్లో బంగారంతో చేసిన విగ్రహాలను ఉంచడం, ఇంట్లో వాటిని పూజించడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఏ ఇంట్లో అయితే బంగారు లోహంతో తయారు చేసిన విగ్రహాన్ని పూజిస్తారో.. ఇంటిపై లక్ష్మీదేవి దీవెనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే బంగారు విగ్రహాన్ని పూజించే ముందు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సాధారణంగా పూజ గదిలో విగ్రహాలను పెట్టి పూజించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిత్య పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే బంగారు వెండి విగ్రహాలు ప్రతిష్టించినప్పుడు పవిత్రంగా ప్రతిరోజు స్నానం చేసి దీపం వెలిగించి నిత్య పూజ చేయాలి. అలా చేయలేని వారు దేవుని చిత్రపటాలు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే బంగారు విగ్రహం ప్రతిష్టించాలి అనుకున్నప్పుడు ఏ దేవతల విగ్రహాలను ప్రతిష్టించాలి అనే అనుమానం మీకు కలగవచ్చు.
- బంగారం రూపంలో లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడు, వంటి విగ్రహాలను మాత్రమే పూజించాలి.
- బంగారు శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు.
- శివుడు కోరికలకు దూరంగా ఉండే యోగి. కావున ఆయనకు బంగారం వంటి ఆడంబరాలు చేయకూడదు.
- ఇక బంగారు విగ్రహాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. పూజ గదిలో ప్రవేశించేది ముందు కాళ్లు చేతులు కడుక్కొని వెళ్లాలి.
- బంగారు విగ్రహాలను అతిగా అభిషేకాలు చేయకూడదు.
- పలుచటి వస్త్రంతో తుడవవచ్చు. నిత్య పూజలు చేయలేని వారు బంగారు విగ్రహాలను భద్రంగా అలమారలో దాచుకొని.. పర్వదినాల్లో మాత్రమే పూజ గదిలో ప్రతిష్టించి పూజ చేసుకుంటే మంచిది.
Also Read : లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.