అన్వేషించండి

Unique Temples: దేవుడికి నైవేద్యంగా , ధూపంగా సిగరెట్ - ఇదెక్కడి చోద్యం అనుకోకండి..నిజమే!

Unique Temples In India: నైవేద్యం అంటే వివిధ రకాల పిండివంటలు, పండ్లు, స్వీట్లు సమర్పిస్తారు. కానీ ఓ ఆలయంలో సిగరెట్ ని నైవేద్యంగా పెడతారు. మరో ఆలయంలో సిగరెట్ ధూపం వేస్తే సమస్యలు తొలగిపోతాయట.

Unique Temples:  ఈ ఆలయాల్లో ప్రతి భక్తుడు భగవంతుడికి సిగరెట్ సమర్పిస్తాడు..

సిగరెట్లు నైవేద్యం

భగవంతుడిపై భక్తి విశ్వాసాలు ఉండేవారు మొక్కుల చెల్లింపులో భాగంగా నగదు, ఆభరణాలు, అన్నదానాలు చేస్తుంటారు. కానీ గుజరాత్ లో ఉన్న ఓ ప్రత్యేక ఆలయంలో భక్తులు ఆలయంలో సిగరెట్ నివేదిస్తారు. సూరత్ అథ్వాలిన్స్ ప్రాంతంలో ఉన్న భూత్ మామ ఆలయం ఉంది. అక్కడ దేవుడి దగ్గర ఏదైనా కోరిక కోరుకుని సిగరెట్ వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. శతాబ్ధకాలం క్రితం ఏర్పడిన ఈ ఆలయం పరిసరాల్లో అప్పట్లో వంజరులు నివాసం ఉండేవారట. ఆ సమూహ పెద్ద మరణిస్తే ఇక్కడే సమాధి నిర్మించారు..తననే భూత్ మామ అని పిలుస్తారు. అక్కడివారికి ఇది దేవాలయం. ఇక్కడే 130 ఏళ్ల నాటి ఓ చెట్టుకూడా ఉంది. ఈ భూత్ మామ ఆలయంలో సిగరెట్లు వెలిగిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటారు. భూత్​ మామ విగ్రహం దగ్గర సిగరెట్ వెలిగించిన తర్వాత దాన్ని నోటి దగ్గర మూడు సార్లు ఉంచి తీసేస్తారు. కాల్చిన సిగరెట్లు ఆలయంలో పడేయకుండా బయటకు తీసుకొచ్చేస్తారు. అప్పట్లో బీడీలు నివేదించావారట..రాను రాను సిగరెట్లు పెడుతున్నారు. ఆదివారం రోజు ఈ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భూత్ మామ జన్మదినం పేరుతో నిర్వహించే అన్నదానానికి 15వేలకు మందికిపైగా భక్తులు తరలివస్తారు. కేవలం గుజరాత్ నుంచే కాదు.. ముంబై, సౌరాష్ట్ర నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. భూత్ మామ ఆలయంలో సిగరెట్లతో పాటూ మగాస్ అనే మిఠాయిని నైవేద్యంగా పెడతారు. ఇలా స్వీట్ నైవేద్యంగా సమర్పిస్తే చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని నమ్ముతారు. 

Also Read: అక్టోబరు 29, 30 ఈ రెండు రోజులు సాయంత్రం ఈ దీపం వెలిగించడం మర్చిపోవద్దు!

సిగరెట్ పొగతో ధూపం

గుజరాత్ లో ఉన్న భూత్ మామ ఆలయంలో సిగరెట్ ను నివేదిస్తే..తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఆలయంలో వెలుపల సిగరెట్ ధూపంతో పొగ వేస్తారు. సాధారణంగా ధూపం అంటే అగరొత్తులు, సాంబ్రాణితో వేస్తుంటారు..కానీ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కొలువైన శ్రీ రంగం ఆలయం వెలుపల ఉండే క్షేత్రపాలకుడు మునియప్పన్ కి సిగరెట్ పొగతో ధూపం వేస్తారు. ఇక్కడ అగరొత్తులు వెలిగించరు, కేవలం సిగరెట్ పొగతేనే ధూపం వేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ రంగనాథుడి దర్శనానంతరం బయట ఉన్న ఓ మట్టి కుండలో సిగరెట్లు, చుట్టలు వెలిగించి వేస్తారు. ఆ పొగ రూపంలో తమ సమస్యలు తొలగిపోతాని విశ్వాసం. అందుకే మునియప్పన్ స్వామి దగ్గర ఉండే పూజారులు ఎప్పుడూ మాస్కులు ధరించే ఉంటారు.  

Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!

సిగరెట్ వెలిగిస్తే కోరిక తీరిపోతాయ్

మధ్యప్రదేశ్‌లోని సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయంలోనూ సిగరెట్ వెలిగిస్తే చాలు కోర్కెలు తీరిపోతాయని భక్తుల నమ్మకం.  ఇక్కడ సిగరెట్ వెలిగించి భగవంతుడి ముందు కోర్కెలు చెప్పుకున్న తర్వాత ఓ గడియారం సమర్పించుకుంటారు. ఇక్కడ ఆలయం ఉండదు..కేవలం పెద్ద చెట్టు ఉంటుంది. ఇక్కడ భగవంతుడి ప్రతిమ ఉండదు..యక్షులు ఉంటారని విశ్వసిస్తారు. పూజారులెవరూ ఉండరు...భక్తులు నేరుగా మొక్కులు చెల్లించుకుంటారు. చెట్టునిండా గడియారాలు నిండిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం టిక్ టిక్ టిక్ మని శబ్ధం వస్తూనే ఉంటుంది. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హెల్‌ రోడ్డు పక్కన ఉందీ ఆలయం. 

Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
Rains Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
Actress Gautami: పార్టీలో చేరిన నటి గౌతమికి కీలక బాధ్యతలు అప్పగించిన అన్నాడీఎంకే
పార్టీలో చేరిన నటి గౌతమికి కీలక బాధ్యతలు అప్పగించిన అన్నాడీఎంకే
Nara Lokesh: 'ఇతర రాష్ట్రాలతో కాదు దేశాలతోనే మాకు పోటీ' - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌లో కీలక భేటీ
'ఇతర రాష్ట్రాలతో కాదు దేశాలతోనే మాకు పోటీ' - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌లో కీలక భేటీ
Jaishankar: ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
Crime News: కోతులు భయపెట్టడంతో మహిళ మృతి, నిర్మల్ జిల్లాలో విషాదం
కోతులు భయపెట్టడంతో మహిళ మృతి, నిర్మల్ జిల్లాలో విషాదం
Embed widget