By: ABP Desam | Updated at : 19 Dec 2022 07:04 PM (IST)
Edited By: Bhavani
Representational Image/Pixabay and Pexels
కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఇంకొన్ని మొక్కలను పవిత్రమైనవిగా భావిస్తారు. అలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్, తులసి మొక్కలు ముందుంటాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మొక్కలు ఇంట్లో సరైన దిశలో ఉండాలి. తప్పు దిశలో ఉంటే ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. నియమానుసారం ఈ మొక్కలను పెంచుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి అవేమిటో తెలుసుకుందాం.
ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రసరించే గాలి శుద్ధవుతుంది. గాలిలోని హానికారక రసాయనాలను శోషిస్తుంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తులసి కాపాడుతుంది. ఇంట్లోకి సౌభాగ్యం తెస్తుంది. ధనవృద్ధికి దోహదం చేస్తుంది. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగు పడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి. కుటుంబ సభ్యుల రక్షణకు కూడా తులసి మొక్క పెంచడం మంచి ఉపాయం. ఎందుకంటే తులసి దిష్టి నుంచి కూడా ఇంటిని కాపాడుతుంది. తులసి మొక్క ఉన్న ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంటిలో సరైన స్థానంలో ఉంచాలి. అప్పుడే తులసి వల్ల కలగాల్సిన అన్ని లాభాలు కలుగుతాయి. తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టంగా చెబుతారు. అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంలో బాల్కనీ లేదా కిటికిలో పెట్టుకోవచ్చు. మొక్కకి సరిపడేంత వెలుతురు కూడా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. పూజ గదిలో కుండిలో ఏర్పాటు చేసుకుని వెలుతురు తగిలేలా జాగ్రత్త పడితే సరిసోతుంది. ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఎందుకంటే తులసిని లక్ష్మీ దేవి భౌతిక రూపంగా భావించి కొలుస్తుంటారు.
Also Read: చాణక్యుడి కాలంలో రాజ్యంలో గూఢచారులు ఇలా ఉండేవారు - ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా!
Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి
Buddha Statue Vastu: ఇంట్లో బుద్ద విగ్రహం పెట్టుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శ్రీవారికి మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ?
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్లో సరికొత్త రికార్డ్!
CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్