అన్వేషించండి

Makar Sankranti Gobbilla Patalu:చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు .. పొన్నమానుపై పెట్టి పంతమాడెనే-సంక్రాంతి గొబ్బిళ్ల పాటలివే!

Makar Sankranthi Gobbilla Songs: భోగి, సంక్రాంతి సందర్భంగా ఇంట్లో గొబ్బిళ్లు పెడుతున్నారా.. అయితే ఇదిగో పాటలు..

 
Makar Sankranti 2025: సంక్రాంతికి నెల రోజుల ముందునుంచే పండుగ సందడి మొదలైపోతుంది. లోగిళ్లన్నీ రంగు ముగ్గులతో నిండిపోతాయ్. మూడు రోజుల పండుగలో భాగంగా భోగి, సంక్రాంతి రోజు గొబ్బిళ్లు పెడతారు. తులసిమొక్క దగ్గర శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. ఆ చుట్టూ గొబ్బిళ్లు పెడతారు. ఆ గొబ్బిళ్లే గోపికలన్నమాట. ఈ సమయంలో గొబ్బిళ్ల పాటలు పాడుతూ ముచ్చటగా ఆడపిల్లలంతా సందడి చేస్తారు. ఆ పాటలు ఇవే... 

పాట-1
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకులస్వామికి గొబ్బిళ్లో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల గొండు గండనికి గొబ్బిళ్ళో  
పాప విధుల శిశుపాలుని దిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
ఏపుని గంసుని నిడముల పెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో  
దండి వైరులను దరమి దనుజుల గుండె గొబ్బిళ్ళో
వెండి పైడియిలు వెంకటగిరి పై కొండలయ్యకును గొబ్బిళ్ళో  

 

పాట-2 
దుక్కు దుక్కు దున్నారంట
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట
రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట
రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట
రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట
రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట  
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 

పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట
రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా 
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట
రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట  
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పండు పండు పండిందంట - ఏమి పండు పండిందంట
రాజా వారి తోటలోన జామ పండు పండిందంట 
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ

పాట-3

అటవీ స్థలములు కడుగుదమా
చెలి వట పత్రమ్ములు కోయుదమా!!2 సార్లు!!
చింత పిక్కాలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా!!అటవీ!!
చెమ్మా చెక్కాలాడుదమా చక్కిలిగింతలు పెట్టుదమా!!అటవీ!!
కోతీ కొమ్మచ్చులాడుదమా  కొమ్మల చాటున దాగుదమా!!అటవీ!!
చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా!!అటవీ!!
పూలదండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుదమా!!అటవీ!!

పాట-4

సుబ్బీ గొబ్బెమ్మా
సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే
బంతి పువ్వంటి బావ నివ్వవే
తాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే 
అరటి పండంటి అత్త నివ్వవే
మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే

పాట-5

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే? 
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే?
కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు!!ఏల!!
కాళింది మడుగులోన దూకినాడమ్మా
బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా!!ఏల!!
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు 
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే!!ఏల!!

పాట -6
చుంచు దువ్వి పింఛం పెట్టెద గోపాలకృష్ణ
పొంచి ఉండి పరుగులేలరా !2!

చుంచు దువ్వి పింఛం చుట్టి పంచదార పాలుపోసి !2!
ఎంచరాని బొజ్జలవేడి బువ్వపెట్టి బజ్జోపెడుదు 
చుంచు దువ్వి పింఛం!2!

కాళ్లకు గజ్జెలు కట్టెదా గోపాల కృష్ణ మెళ్లోనా హారం వేసేదా!2!
కాళ్లకు గజ్జెలు కట్టి మెళ్లోనా హారం వేసి... 
ఒళ్లోను పప్పుల పోసి పిల్లల గ్రోవి చేతికిచ్చెదా
చుంచు దువ్వి పింఛం

చుంచు దువ్వి పింఛం పెట్టెద గోపాలకృష్ణ
బొజ్జకు పసిడి గజ్జెలు కట్టేదా గోపాలకృష్ణ 
బుజ్జి భుజములు తిప్పి ఆడేదా
బంగరు తొట్టె నా మదిలోనా బాలకృష్ణ నిద్దరపోరా
చుంచు దువ్వి పింఛం చుట్టెద గోపాలకృష్ణ
పొంచి ఉండి పరుగులేలరా !4!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget