By: ABP Desam | Updated at : 03 May 2022 06:05 PM (IST)
మే 10 నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు
Tirumala News : శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 10 నుండి 12వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు.. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు..
తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీ అష్టోత్తరం
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహా విష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరుని కిచ్చి వివాహం చేశారు.. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఈ రాశివారికి హైబీపీ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం వస్తోంది.. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ రాశివారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధీటుగా కల్యాణోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూంటారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా భక్తులకు పరిణయోత్సవాలకు హాజరయ్యే అవకాశం చిక్కలేదు. ప్రస్తుతం తిరుమలలో భక్తులకు ప్రశాంతంగా దర్శన భాగ్యం లభిస్తోంది. ఐదో తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వచ్చే వారికి టోకెన్లు కూడా ఇవ్వనున్నారు. కోవిడ్ తర్వాత తిరుమలలో పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి.
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా