అన్వేషించండి

Story behind No. 3 : మన పెద్దవాళ్లు ఎక్కడికీ ముగ్గురిని వెళ్లనివ్వరు, ఎందుకు - అసలు 3 అనే సంఖ్య శుభమా, అశుభమా - ఇందులో ఉన్న నిజమెంత ?

Story behind Number 3 : చాలా మంది 9 అనే సంఖ్యను అదృష్టంగా భావిస్తారు. అలాగే 3 అనే నంబర్ ను మాత్రం కొందరు అశుభంగా భావిస్తారు. మరి ఇంతకీ ఈ సంఖ్య నిజంగానే అశుభాన్ని సూచిస్తుందా..?

Story behind Number 3 : కాలం మారుతున్నా, జనరేషన్స్ ఛేంజ్ అవుతున్నా, టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతున్నా, అంతరిక్షంలో కొత్త కొత్త శాస్త్ర విధానాలు పుట్టుకొస్తున్నా ఇప్పటికీ కొన్ని ఆచారాలు, నియమాలు, నమ్మకాలు మాత్రం మారడం లేదు. వాటిని నమ్మితే ఎలాంటి ఆటంకాలు ఉండవని, చేసే పనుల్లో అడ్డంకులు రావని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నపుడు పిల్లి ఎదురుగా వస్తే అశుభం అని, నక్క తోక తొక్కితే శుభం అని మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం వినే ఉంటారు. గుడికి వెళ్తే 3, 5, 11, 21, 108 ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచిదని కూడా అనడం వింటుంటాం. వినడం కాదు ఈ తరహా నమ్మకాలను ఇప్పటికీ పాటిస్తున్నారు కూడా. అలాగే ఏదైనా శుభకార్యానికి లేదా చోటుకు వెళ్లేటప్పుడు ముగ్గురు కలిసి వెళ్లకూడదని మన పెద్దలు చెప్పడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా శుభకార్యాలలో 5, 7, 11, 21 ఇలా మొదలైన బేసి సంఖ్యలను శుభప్రదంగా భావిస్తారు. కానీ ఒక్క 3 అనే సంఖ్యను మాత్రం అశుభంగా పరిగణిస్తారు.

ఈ 3 నంబర్ వెనుక ఉన్న కథేంటీ..

వాస్తవంగా చెప్పాలంటే 'తీన్‌ తిగ్రా కామ్‌ బాధ' అంటే ముగ్గురు వ్యక్తులు కలిసే చోట పని చెడిపోవడం ఖాయం అని విశ్వసిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ మాట చాలా సార్లు వినే ఉంటారు. కానీ చాలా మందికి దాని అర్థం తెలియకపోవచ్చు. మన పెద్ద వాళ్లు ఇప్పటికీ ఈ సామెతను నమ్ముతారు. అందుకే ముగ్గురు వ్యక్తులు ఎక్కడికైనా శుభకార్యాల కోసం వెళ్తున్నారంటే ఒప్పుకోరు. పెద్దల నమ్మకం ప్రకారం, ఏ ముగ్గురూ ఓ పని కోసం కలిసి వెళ్లకూడదు. 3 అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు హిందూ మతంలో ఓ అశుభంగా కూడా పరిగణిస్తారు. కొందరైతే పళ్లెంలో 3 చపాతీలు వడ్డించేందుకు కూడా ఇష్టపడరు, పూజా సమయంలో ముగ్గరు వ్యక్తులు కూర్చోవడాన్నీ తప్పుపడతారు. అంటే అక్కడ 3 అనే నంబర్ వచ్చే సరికి అశుభంగా మారుతుందని వారి నమ్మకం.

3 నంబర్ నిజంగానే అశుభమా..?

నిజానికి 3 సంఖ్యను అశుభంగా భావించడం సబబేనా అన్న విషయంపై స్పందించిన జ్యోతిష్యుడు అనిష్ వ్యాస్ పలు విషయాలు వివరించారు. మత విశ్వాసాల ప్రకారం 3 సంఖ్య అశుభం కాదు. ఎందుకంటే సృష్టి అనేది 3 ప్రాథమిక స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. 3కు అర్థం వచ్చేలా ఉన్న త్రిమూర్తులు (సరస్వతి, లక్ష్మి, పార్వతి) కూడా విశ్వాన్ని నడిపిస్తారు. పరిక్రమ ప్రధాన సంఖ్య కూడా 3. ముల్లోకాలను ఏలే శివుడి త్రిశూలం కూడా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. జాతకంలోనూ 3 గ్రహాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అని వ్యాస్ చెప్పుకొచ్చారు. కానీ కొందరు మాత్రం నమ్మకాల పేరుతో 3 అనే సంఖ్యను శుభమైనదిగా పరిగణించరన్నారు. అంతెందుకు హిందూ వివాహంలో వధువు మెళ్లో వరుడు వేసే 3 ముళ్లు ఎంత శుభంగా పరిగణిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన పవిత్ర ప్రదేశం త్రివేణి సంగమంలో స్నానం చేయడం కూడా ఎన్నో కోట్ల మంది శుభంగా భావిస్తారు.

న్యూమరాలజీలో 9కి ప్రత్యేక స్థానం

న్యూమరాలజీ ప్రకారం, 9 అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నంబర్ కు సంబంధించిన వారిలోనూ ప్రత్యేకమైన లక్షణాలుంటాయని నమ్ముతారు. సృజనాత్మకత, స్వీయ వ్యక్తీకరణ, నాయకత్వం, ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యం, మానవతావాదం, ఇతరులకు సహాయం చేయాలనే కోరిక, నిస్వార్థత, స్వతంత్రత అనే లక్షణాలు వీరిలో ఉంటాయని చెబుతారు. ఈ వ్యక్తులకు ఎక్కువ కోపం ఉంటుందట. ఇతరుల మాట వినకుండా వారు ఆ కోపాన్ని వ్యక్తం చేస్తారట.

Also Read : Diet Changes to Reduce Gas : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే

టాప్ హెడ్ లైన్స్

దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
కుంభం, మీన రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.
కుంభం, మీన రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.
ధనస్సు, మకర రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : మీ జీవితంలో కీలక మార్పులు!
ధనస్సు, మకర రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : మీ జీవితంలో కీలక మార్పులు!
తులా, వృశ్చిక రాశుల వారఫలాలు అక్టోబర్ 18-24: ఈ వారం మీ జీవితంలో ఏం జరగబోతోంది?
తులా, వృశ్చిక రాశుల వారఫలాలు అక్టోబర్ 18-24: ఈ వారం మీ జీవితంలో ఏం జరగబోతోంది?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Embed widget