అన్వేషించండి

Mangala Gauri Vrat in 2025: శ్రావణ మంగళగౌరీ వ్రతం - కావాల్సిన సామగ్రి, పూజ చేసుకునే విధానం!

Sravana Mangala Gowri Vratham: శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీ పూజ చేస్తారు వివాహితులు. శ్రావణ మంగళవారాల నోములు చేసుకునేది కూడా ఇప్పుడే. ఇదో పూర్తి పూజా విధానం...

Sravana Masam Mangala Gowri Pooja : ముందుగా పసుపు గణపతి పూజ పూర్తిచేసి..మంగళగౌరి పూజ ప్రారంభించాలి. పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పునః సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ యావజ్జీవ సౌమాంగళ్య సిద్ధ్యర్థం పుత్రపౌత్రసంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమవర్ష పర్యంతం శ్రీ మంగళగౌరీ దేవతాముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవతా నియమేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన శ్రీ మంగళగౌరీ వ్రతం కరిష్యే |

ప్రాణప్రతిష్టా 
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త
మనుమతే మృడయా నః స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
అస్మిన్ బింబే శ్రీమంగళగౌరీ దేవతాం ఆవాహయామిస్థాపయామిపూజయామి |
స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ |
శ్రీమంగళగౌరీదేవతా ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోఅస్తు |

ధ్యానం 
సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

దేవీం షోడశవర్షీయాం శశ్వత్సుస్థిరయౌవనాం
బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననామ్ |
శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం
జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం
సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః ధ్యాయామి |

ఆసనం 
కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-
-ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే |
రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే
చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి |

ఆవాహనం 
ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యేస్థితాం
బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ |
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే ||
ఆగచ్ఛ సర్వదేవేశీ సర్వకార్యార్థసిద్ధయే |
సర్వసిద్ధిప్రదే దేవీ సర్వపాపప్రణాశినీ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః ఆవాహనం సమర్పయామి |

ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః |
శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ||

పాద్యం 
గంగాది సలిలైర్యుక్తం సుగంధేన సువాసితం |
పాద్యం గృహాణ సుశ్రోణి రుద్రపత్ని నమోఽస్తు తే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః పాదయోః పాద్యం సమర్పయామి ||

అర్ఘ్యం 
భాగీరథ్యాది సలిలం నానాతీర్థసమన్వితం |
కర్పూరగంధసంయుక్తం అర్ఘ్యం తుభ్యం దదామ్యహమ్ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ||

ఆచమనీయం 
రత్నపాత్రే స్థితం తోయం సర్వతీర్థసమన్వితం |
ఆచమ్య తాం మహాదేవి రుద్రకాంతే నమోఽస్తు తే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమఃముఖే ఆచమనీయం సమర్పయామి ||

మధుపర్కం 
స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధుప్లుతం |
మధుపర్కం గృహాణేదం మయా దత్తం సురేశ్వరీ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః మధుపర్కం సమర్పయామి ||

పంచామృత స్నానం 
క్షీరం దధ్యాజ్య మధురా శర్కరా ఫలసంయుతం |
స్నానం స్వీకురు దేవేశి సర్గస్థిత్యంతరూపిణీ |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః పంచామృతస్నానం సమర్పయామి ||

శుద్ధోదక స్నానం 
లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః |
గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ||
గంగాదిసలిలైః పుణ్యైః ఆనీతైః స్వర్ణపాత్రకైః |
స్నానార్థం తే మయా దత్తం సర్వాభరణభూషితే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః శుద్ధోదకేన స్నపయామి ||

వస్త్రం 
హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితైః
రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకమ్ |
ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం
దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ||
సర్వదే సర్వదా గౌరి సర్వాభరణభూషితే
పీతాంబరద్వయమిదం గృహాణ పరమేశ్వరీ |
గ్రైవేయహారకేయూర కటకాద్యైః విభూషితం
ధార్యం స్వర్ణమయం శుభ్రం ఉత్తరీయం చ పార్వతీ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమఃకంచుక సహిత కౌసుంభ వస్త్రయుగ్మం సమర్పయామి ||

యజ్ఞోపవీతం 
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి |

ఆభరణం 
హంసైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం
హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే |
మంజీరౌ మణికుండలే మకుటమప్యర్ధేందుచూడామణిం
నాసామౌక్తికమంగులీయకటకౌ కాంచీమపి స్వీకురు ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమఃనవరత్నమయ ఆభరణాని సమర్పయామి ||

గంధం 
సర్వాంగే ఘనసారకుంకుమఘనశ్రీగంధపంకాంకితం
కస్తూరీతిలకం చ ఫాలఫలకే గోరోచనాపత్రకమ్ |
గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేఽర్పితం
కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ||
గంధం మనోహరం దివ్యం ఘనసారసమన్వితం |
తుభ్యం భవాని దాస్యామి చోత్తమం చానులేపనం ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ||

అక్షతాన్ 
అక్షతాన్ శుభవర్ణాభాన్ హరిద్రాద్యైస్సుసంయుతాన్ |
కాత్యాయని గృహాణ త్వం సర్వదేవనమస్కృతే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పమాలికా 
కల్హారోత్పలమల్లికామరువకైః సౌవర్ణపంకేరుహైః
జాతీచంపకమాలతీవకులకైః మందారకుందాదిభిః |
కేతక్యా కరవీరకైర్బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః పుష్పామాలికా సమర్పయామి |

చంపకాశోక కల్హార కుముదోత్పల జాతిభిః |
కరవీరాది కుసుమైః పూజయామి సురేశ్వరీ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః నానావిధ పరిమళ పత్రైః పుష్పైశ్చ పూజయామి ||

అథ అంగపూజా 
ఉమాయై నమః  పాదౌ పూజయామి |
గౌర్యై నమః  జంఘే పూజయామి |
పార్వత్యై నమః – జానునీ పూజయామి |
జగన్మాత్రే నమః – ఊరూ పూజయామి |
జగత్ప్రతిష్ఠాయై నమః – కటిం పూజయామి |
మూలప్రకృత్యై నమః – నాభిం పూజయామి |
అంబికాయై నమః – ఉదరం పూజయామి |
అన్నపూర్ణాయై నమః – స్తనౌ పూజయామి |
శివసుందర్యై నమః – వక్షస్థలం పూజయామి |
మహాబలాయై నమః – బాహూన్ పూజయామి |
వరప్రదాయై నమః – హస్తాన్ పూజయామి |
కంబుకంఠ్యై నమః – కంఠం పూజయామి |
బ్రహ్మవిద్యాయై నమః – జిహ్వాం పూజయామి |
శాంకర్యై నమః – ముఖం పూజయామి |
శివాయై నమః – నేత్రే పూజయామి |
రుద్రాణ్యై నమః – కర్ణౌ పూజయామి |
సర్వమంగళాయై నమః – లలాటం పూజయామి |
సర్వేశ్వర్యై నమః – శిరః పూజయామి |
మంగళగౌర్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తరశతనామావళీ 
 మంగళగౌరీ దేవతాయైనమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి 

ధూపం 
హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్జ్వలై-
-ర్యైర్భృంగావలినీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయమ్ |
తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలాగృహా-
-ణ్యామోదాయ దశాంగగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః  ధూపమాఘ్రాపయామి |

దీపం
లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే
మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః | [రత్న]
చిత్రైర్హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితై-
-ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతామ్ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః దీపం దర్శయామి ||

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం 
హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం
దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా |
దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే ||

ఓంభూర్భువస్సువః  తత్సవితుర్వరేణ్యమ్  భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్ || సత్యంత్వాఋతేన పరిషించామి  అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓంప్రాణాయ స్వాహా  ఓంఅపానాయ స్వాహా  ఓంవ్యానాయ స్వాహా  ఓంఉదానాయ స్వాహా ఓంసమానాయ స్వాహా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి  ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌప్రక్షాళయామి పాదౌప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి .... ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః మహానైవేద్యం సమర్పయామి 

తాంబూలం 
సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తాంబూలవల్లీదలైః
పూగైర్భూరిగుణైః సుగంధిమధురైః కర్పూరఖండోజ్జ్వలైః |
ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే ||
పూగీఫలైస్స కర్పూరైః నాగవల్లీదళైర్యుతమ్ |
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః తాంబూలం సమర్పయామి ||

నీరాజనం 
కన్యాభిః కమనీయకాంతిభిరలంకారామలారార్తికా
పాత్రే మౌక్తికచిత్రపంక్తివిలసత్కర్పూరదీపాలిభిః |
తత్తత్తాలమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం
మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం 
వరాంకుశౌ పాశమభీతిముద్రాం
కరైర్వహన్తీం కమలాసనస్థామ్ |
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం
భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

సర్వోపచారాః 
లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్త్రం తు ధత్తే రసా-
-దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ |
వీణామేణవిలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
-ద్భావైరాంగికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతామ్ ||

ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః  ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః చామరైర్వీజయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః నృత్యం దర్శయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః  గీతం శ్రావయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః ఆందోళికాన్నారోహయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః అశ్వానారోహయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీదేవతాయైనమః  గజానారోహయామి |
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీ దేవతాయైనమః నానావిధ రాజ్ఞోపచార భక్త్యోపచారాన్ శక్త్యోపచారాన్ సమర్పయామి 

నమస్కారాన్ 
హ్రీంకారత్రయసంపుటేన మనునోపాస్యే త్రయీమౌలిభి-
-ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతాంబికే |
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ||
ఓంహ్రీంశ్రీంమంగళగౌరీ దేవతాయైనమః  నమస్కారాన్ సమర్పయామి ||

తోరబంధన మంత్రం 
బధ్నామిదక్షిణేహస్తే పంచసూత్రంశుభప్రదం |
పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహిమేరమే ||

అనంతరం శ్రావణ మంగళగౌరి వ్రతకథ చదువుకోవాలి.. కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget