Spirituality: రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుక్కోవడం లేదా, అయితే వాటినుంచి తప్పించుకోలేరు
పట్టించుకుంటే ప్రతీది సెంటిమెంటే..లేదంటే ఏమీ ఉండదంటారు. పట్టించుకోని వర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అసరమే లేదు కానీ పట్టించుకునేవారు మాత్రం ఇవి ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి...
పాదాలు అదృష్టం, దురదృష్టానికి సంకేతమా...
ఇంట్లో, మన జీవితంలో జరిగే మంచి చెడులు పాదాలు కూడా డిసైడ్ చేస్తాయా..
బయటి నుంచి రాగానే, అన్నం తినేముందు, నిద్రకు ఉపక్రమించేముందు వీటితో పాటూ ముఖ్యంగా గుడికి వెళ్లేముందు కాళ్లు కడుక్కోమని ఎందుకు చెబుతారు...
ఇలా కాళ్లు కడుక్కోవడంపై ఎన్నో చర్చలున్నాయి...
చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది, అదే కాళ్ళు కడుక్కోకపోతే మన ఆరోగ్యంతోపాటు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అందుకే ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవడం కూడా మన ఆచారాలలో ఒకటిగా మారిపోయింది.
బయటి నుంచి రాగానే
బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా ముందుగా చెప్పులు లేదా షూస్ తీసేసి కాళ్లు కుడుక్కుంటే శరీరంలో అన్ని రకాల ప్రతికూల శక్తిని నాశనం చేసి మనసుని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే బయట ఎక్కడెక్కడో తిరుగుతూ తెలియకుడానే ఏవేవో తొక్కుతారు. అలాగే ఇంట్లోకి వెళ్లిపోతే కొందరి ఆరోగ్యానికైనా హాని కలుగుతుంది. మరీ ముఖ్యంగా పసి పిల్లలకు మరింత హాని జరుగుతుంది.
నిద్రపోయే ముందు
మంచి నిద్రకావాలంటే నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్లు కడుక్కుంటే..శరీరంపై ప్రతికూల శక్తి ప్రభావం భిన్నంగా ఉంటుందట నిద్రపోయేముందు మాత్రమే కాదు..నిద్ర మధ్యలో ఏవైనా చెడు కలలు వచ్చినా, భయపడినా వెంటనే లేచి పాదాలు కడుక్కుని బాగా తుడుచుకుని నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపడుతుందని చెబుతారు. కొందరైతే బయట తిరిగొచ్చి అలసిపోయామంటూ అలాగే మంచం ఎక్కేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్రదూరం కావడం మాత్రమే కాదు, భయపెట్టే కలలు వెంటాడుతాయట.
Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి
గుడిలోకి వెళ్లేముందు
సాధారణంగా గుడికి అనగానే స్నానం చేసి బయలుదేరుతారు. శుభ్రమైన దుస్తులు వేసుకుంటారు. అయినప్పటికీ గుడి దగ్గరకు వెళ్లగానే బయట కాళ్లు కడుక్కునే లోపలకు దర్శనానికి వెళతారు. కారణం ఏంటంటే ఎక్కడెక్కడో తిరిగొచ్చి బయట విడిచిన చెప్పులు ధరించే గుడికి వెళతాం. అందుకే గుడి బైట పాదరక్షలను వదిలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకం పరిశుభ్రం చేసుకుంటున్నాం అంట కాళ్లు కడుక్కుని తలపై నీళ్లు చల్లుకుంటారు. కొందరైతే నోటిలో నీరు పోసి మూడుసార్లు పుక్కిలించి బయటకు వదులుతారు. శరీరంతో పాటూ వాక్కుకి మూలకారకమైన నాలుక, నోరు కూడా శుభ్రపరుచుకుని నిన్ను ప్రార్థించేందుకు వస్తున్నా అని చెప్పడం.
Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి