అన్వేషించండి
Advertisement
Spirituality: దిండుపై కూర్చోవడం, లేవగానే అద్దం చూసుకోవడం లాంటివి చేస్తున్నారా!
ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి తిష్టవేసుకుని ఉంటుందట.
పూర్వం పెద్దలంతా నిత్యం కొన్ని నియమాలు పాటించేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న తరం అప్పుడప్పుడు దేవుడుని తలుస్తున్నారు. అయితే క్రమం తప్పకుండ కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఇంటి ఇల్లాలి ప్రవర్తనే ఆ ఇంట్లో వారి ఆరోగ్యం, సంపాదన, ఆనందాన్ని నిర్ణయిస్తుందంటారు.
- సూర్యోదయానికి ముందే ఇల్లు శుభ్రం చేయాలి. పొద్దెక్కిన తర్వాత లేచి ఇల్లు శుభ్రం చేస్తే ఈ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.
- కొత్తగా తలపెట్టే పనులేవైనా శుక్లపక్షంలోనే చేయాలి..బహుళ పక్షంలో చేయరాదు. అందుకే అమావాస్య ముందు ఏమీ చేయరాదంటారు
- ఎవ్వరూ దిండుపై కూర్చోరాదు..ముఖ్యంగా ఆడవారు అస్సలే కూర్చోరాదు. దిండుపై కూర్చునే వారిని కష్టాలు వెంటాడతాయి
- మగవారు మంగళవారం క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడము చేయరాదు.
- పెళ్లైన మహిళలు రాత్రివేళ గాజులు కమ్మలు తీస్తుంటారు.. కానీ అలా తీయరాదు.
- ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినపుడు పలకిరించేందుకు వచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించ కూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు.
- స్త్రీలు ఎప్పుడు కూడా వేరొకరి తల్లో పూలు పెట్టుకోకూడదు
- నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు
- ఉప్పు, మిరప కాయలు, చింతపండు, ధాన్యాలు, నూనె వంటి వాటిని ఎవరికి ఇచ్చిన, చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి..
- నిత్యం భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి.. ఇలా చేయటం పితృ దేవతలకు సంతృప్తిని ఇస్తుంది. భోజనానికి ముందు కాకికి, భోజనం తర్వాత కుక్కకి పెట్టాలి
- టెంకాయ ముక్క తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్లు వుండే భాగాన్ని ఉంచుకుని మిగతా భాగం ఇవ్వాలి
- స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసకుని ఉండకూడదు.. ఇలా ఉంటే జలగాల్సిన మంచి వాయిదా పడుతూనే ఉంటుంది
- శుక్రవారమునాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి.. ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుంది
- ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కుర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులు మాత్రమే కాదు శరీరంలోని ఎముకలు బలహీనతకు కారణం అవుతాయి.
- ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా కుడిచేతితో ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
- సుమంగళి స్త్రీలు రాత్రి వేళ అలిగి భోజనం చేయకుండా నిద్రపోరాదు
- స్త్రీలు బహిష్టు సమయమందు పూలు పెట్టుకోరాదు
- ఇంటి ఇల్లాలి నోటినుంచి పీడ ,దరిద్రం, శని, పీనుగా, కష్టము, అనే పదములను వినిపించకూడదు..
- ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూళ్లు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
- ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి
- ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.
- ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.
చిన్న చిన్నవి పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసమే అంటారు పండితులు. వీటిని ఎంత వరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.....
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
సినిమా
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion