అన్వేషించండి

Spirituality: భర్త దీర్ఘాయుష్షు కోసం భార్య పఠించాల్సిన శ్లోకం ఇది

సౌభాగ్యం అంటే చాలా మంది "భర్త ఉండి మంగళసూత్రం ధరించే యోగ్యత ఉండడం " అనుకుంటారు.అయితే దాన్ని సుమంగళత్వం అంటారు. మరి సౌభాగ్యంతో కూడిన సుమంగళి యోగం కావాలంటే...

సౌభాగ్యం అంటే "భర్త తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం". అందుకే 14 సంవత్సరాలు అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం అనే రెండు వరాలు కావాలని పట్టుపట్టిన కైకేయిని చూసి దశరథుడు " ఈ రోజు వరకు నువ్వు గొప్ప సౌభాగ్యవతివి కానీ  ఇవాల్టి నుంచి నువ్వు సౌభాగ్యాన్ని కోల్పోయావు పో అంటాడు. 

అలాగే హరివంశంలో... నారదుడు స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీదేవి అంత:పురంలో కృష్ణుడు ఉన్న సమయంలో ఆ పువ్వు గొప్పదనాన్ని వివరించి బహూకరిస్తాడు.అప్పుడు కృష్ణుడు తన ప్రక్కనే ఉన్న రుక్మిణికి ఇస్తాడు. నీ భార్యలందరిలో ఎవరు గొప్ప సౌభాగ్యవతి అని ఆలోచించేవాడిని..రుక్మిణి అని ఇప్పుడు తెలిసిందని నారదుడు అంటాడు. ఈ విషయం తెలిసి సత్యభామ అలుగుతుంది. నిజానికి ఆ పువ్వు తనకి ఇవ్వనందుకు కాదు..ఏకాంతంలో ఉన్నప్పుడు "భామా  అందరిలోకి నువ్వే గొప్ప సౌభాగ్యవతివి, అని చెప్పేవారు కదా స్వామీ ఆ మాట అబద్ధం అని తెలిసిపోయింది కదా.. నేను సౌభాగ్య హీనురాలనని అందరి ముందు బుుజువైందంటుంది". సత్యభామ కన్నీళ్లకు కరిగిపోయిన కృష్ణుడు ఏకంగా పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి నాటుతాడు.

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

సౌభాగ్యం అంటే భర్త మనసులో తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం. అలాంటి సౌభాగ్యంతో పాటూ సుమంగళియోగం ఉండేందుకు నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే మంచిదని చెబుతారు పండితులు.  

సౌభాగ్యం, సుమంగళీ యోగం కోసం పఠించాల్సిన శ్లోకం

1.నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే  
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ  

2.నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ 
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః 

3.పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ  
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే  

4.పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః  
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతే  

5.క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్  
పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమే  

6.ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ

7.సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ

బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ దేవి, సరస్వతి దేవి, గంగా దేవి, భూదేవి, సావిత్రి, పార్వతి సహా ఎందరో దేవతా మూర్తులు ఈ శ్లోకం పఠించారు.

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget