News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Spirituality: శుభకార్యాల్లో ''కలశ'' ఎందుకు వినియోగిస్తారు, అసలు విషయం మీకు తెలుసా

హిందూ సంప్రదాయంలో పాటించే పద్ధతులన్నింటి వెనుకా ఓ కారణం ఉంటుంది. అంతకుమించిన ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటేనే ఎందుకు పాటిస్తున్నామో అర్థమవుతుంది.

FOLLOW US: 
Share:

నీటితో నిండిన ఇత్తడి లేదా రాగి పాత్రకు పసుపు రాసి బొట్టు పెట్టి, తెలుగు లేదా ఎరుపు రంగు దారం చుట్టి ఆ పాత్రలో నీళ్లు నింపితే అది కలశ అవుతుంది. ఆ తర్వాత దానిపై మామిడి ఆకులు, కొబ్బరి కాయ, నూతన వస్త్రం ఉంచుతారు. కొందరు కలశలో బియ్యం కూడా వేస్తారు. అదే కలశ, అదే పూర్ణకుంభం అని కూడా అంటారు.సంప్రదాయ బద్ధమైన కార్యక్రమాల్లో గృహ ప్రవేశం, వివాహం, నిత్య పూజ సహా పలు శుభ సందర్భాల్లో కలశ ఏర్పాటు చేస్తారు. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉంచుతారు. ఆలయాలకు కొందరు ప్రముఖులు వచ్చినప్పుడు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు అనే మాట వింటుంటాం.

Also Read: రెండేళ్లకోసారి మేడారం జాతర, ఏటా ఎందుకు చేయరు
కలశాన్ని ఎందుకు పూజిస్తారు

  • కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రతీకగా చెబుతారు. ఇది అన్నింటికీ జీవన దాత. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది.
  • ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక
  • కలశ చుట్టూ చుట్టిన దారం సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది
  • అన్ని పుణ్య నదుల్లో నీరు, అన్ని వేదాల్లో జ్ఞానం తో పాటూ దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించిన తర్వాత అందులోని నీరుఅన్ని వైదికక్రియలకి వినియోగిస్తారు. 

కలసస్య ముఖే విష్ణుః కంటే రుద్రసమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః 
కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర
ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః 
అన్గైస్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః

Also Read: రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుక్కోవడం లేదా, అయితే వాటినుంచి తప్పించుకోలేరు
కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే పరమ శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో మాత్రుకలు, కలశం గర్భంలో అంటే కలశంలోని జలంలో సమస్త సముద్రాలు, ఏడు ద్వీపాలతో కూడిన భూమి, నాలుగు వేదాలు, సకల దేవతలు కొలువై ఉంటారని అర్థం.  అందుకే కలశలో నీటితో సంప్రోక్షణ చేస్తారు. 

దేవాలయ కుంభాభిషేకాలు సహా ఎన్నో రకాల పూజలు కలశజలం అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా, వారిపట్ల  గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నామని అర్థం

కలశారాధన వల్ల పాపాలు హరించి పవిత్రులం అవుతాయని విశ్వాసం. అందుకే ప్రతి శుభకార్యంలో కలశారాధన ఉంటుంది.

Published at : 18 Feb 2022 03:38 PM (IST) Tags: varalakshmi kalasam decoration importance of kalasam lakshmi kalasam decoration kalasam coconut after pooja varalakshmi vratham kalasam kalasam pooja kubera kalasam poojai kalasam

ఇవి కూడా చూడండి

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today September 23:  ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

టాప్ స్టోరీస్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు