Religious Texts: ధార్మిక గ్రంథాలపై పెన్నుతో హైలైట్ చేయొచ్చా? దీని గురించి ఏమతంలో ఏముంది?
Spiritual Practice Reading: ధార్మిక గ్రంథాలను చదివే నియమాలు: మత గ్రంథాలు చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయడం సరికాదని చెబుతారు. అందుకు కారణం ఏంటో చెబుతున్నారు శివం సాధక్ మహారాజ్

Rules for reading religious texts: ధార్మిక గ్రంథాలను చదివేటప్పుడు వాటి పట్ల గౌరవం చూపించడం అన్ని మతాలలోనూ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. గ్రంథాలు కేవలం జ్ఞానానికి మూలం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తి , విశ్వాసానికి చిహ్నం కూడా. ధార్మిక గ్రంథాలను చదవడం వల్ల మన అవగాహన , ఏకాగ్రత పెరుగుతుంది. చాలా మంది ధార్మిక గ్రంథాలను చదివేటప్పుడు పెన్ లేదా హైలైటర్లను ఉపయోగిస్తారు, తద్వారా ముఖ్యమైన భాగాలను గుర్తుంచుకోవచ్చు , భవిష్యత్తులో సులభంగా చూడవచ్చు. ఈ పద్ధతి ఆధునిక పద్ధతిలో సరైనదిగా పరిగణిస్తారు కానీ అలా చేయడం సరికాదంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. కథావాచక్ శివం సాధక్ మహారాజ్ ప్రకారం ధార్మిక గ్రంథాలపై పెన్ లేదా పెన్సిల్‌తో హైలైట్ చేయడం సరైనది కాదు.
కథావాచక్ శివం సాధక్ మహారాజ్ ఏమన్నారు?
కథావాచక్ శివం సాధక్ ప్రకారం, 'శాస్త్రాలు లేదా శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేసేటప్పుడు, తరచుగా మంచి శ్లోకాలను హైలైట్ చేస్తారు. కానీ గ్రంథాలపై పెన్ వాడటం అంటే శ్రీ కృష్ణుడిపై పెన్ వాడటం ఒక భక్తుడు పొరపాటున గ్రంథంపై పెన్ వాడితే ఆ భగవంతుడి హృదయం లేదా ముఖంపై పెన్ నడిచినట్లు అర్థమట. కాబట్టి ధార్మిక గ్రంథంపై పెన్ ఉపయోగించకూడదు అన్నారు. ఏదైనా మంచి విషయం అనిపిస్తే, జీవితంలోకి తీసుకోండి. మరచిపోయే భయం ఉంటే వేరే కాగితంపై రాయండి, కాని గ్రంథంపై ఎప్పుడూ పెన్ ఉపయోగించవద్దని సూచించారు.
క్రిస్టియన్ మతంలో అయితే ఈ పద్ధతి తప్పుకాదు. బైబిల్ లో శ్లోకాలు, వాక్యాలు హైలైట్ చేయడం లేదా నోట్స్ రాయడం చాలా సాధారణం. అదే విషయాన్ని ప్రోత్సహిస్తారు కూడా. బైబిల్ అధ్యయనం కోసం ప్రత్యేక హైలైటర్లు కూడా ఉంటారు. దీనిని హృదయంలో నాటేందుకు మార్గంగా భావిస్తారు. క్రిస్టియానిటీలో ఇది ఎంతమాత్రం అగౌరవం కాదు బదులు ఆధ్యాత్మిక పెరుగుదలకు సహకారం.
ఇస్లాం మతం ప్రకారం ఖురాన్ లో మార్క్ చేయడం నిషేధం. పెన్ను కానీ పెన్సిల్ కానీ వినియోగించరు. అయితే ట్రాన్సలేషన్ లేదా తఫ్సీర్ పుస్తకాల్లో పెన్ను లేదా మార్కర్ వినియోగించవచ్చు. దీనిని అధ్యయనానికి ఉపయోగిస్తారు
ఓవరాల్ గా ఆధ్యాత్మిక దృక్ఫథంలో ధార్మిక గ్రంధాలు జ్ఞానాన్ని అందించడానికి ఉన్నాయి. అవి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయకరంగా ఉండాలి. హైలైట్ చేయడం ద్వారా భక్తి పెరిగితే అది మంచిదే కానీ గ్రంధాన్ని శభ్రంగా, గౌరవంగా ఉంచాలి. మీ ఉద్దేశం శుద్ధమైనది అయితే ఆధ్యాత్మికంగా అది సానుకూలమే. ఈ విషయంపై ఏవైనా సందేహాలుంటే పండితులు, మీ మత గురువువ సలహాలు తీసుకోండి .
ఏ మతం అయినా బోధించేది ఒక్కటే... కల్మషం లేని భక్తి ప్రధానం...
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















