By: RAMA | Updated at : 05 Jul 2022 06:31 AM (IST)
Edited By: RamaLakshmibai
Kumar Sashti 2022
జులై 05 మంగళవారం కుమార షష్టి
శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మథుడు ఆటంకం కలిగించాడు. తీవ్రమైన ఆగ్రహందో మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు. అదే సమయంలో శంకరుడి నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన ఆ తేజస్సుని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు. కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని చెబుతారు. అందుకే ఈ రోజుని కుమారషష్టి( జులై 5 మంగళవారం)రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆరు ముఖాలతో అవతరించడం వల్ల కుమారస్వామిని షణ్ముఖుడని పిలుస్తారు.
కుమార షష్టికి ముందొచ్చే రోజుని స్కంద పంచమి(జులై 04 సోమవారం)గా పిలుస్తారు. అంటే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు.
Also Read: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!
సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం (Subramanya Ashtakam)
హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥
దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥
హారాదిరత్నమణియుక్తకిరీటహార,కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాzమరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥
Also Read: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!
janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!
Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం
Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు