అన్వేషించండి

Powerful Bath Rituals : స్నానం ఇలా చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి!

స్నానం శరీరానికి మాత్రమే కాదు ఆత్మ శుద్ధికి కూడా. ఆధ్యాత్మిక దృక్పథంతో చెప్పాలంటే స్నానం ఓ పవిత్ర క్రియ. అయితే ఏ రోజు స్నానం ఎలా చేస్తే గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్నానం శరీరం, మనస్సును శుద్ధి చేసి, ఆధ్యాత్మిక సన్నద్ధతను పెంచుతుంది.
  • బ్రహ్మ ముహూర్త స్నానం సత్వ గుణాలను పెంచి, పూజకు బలం.
  • ప్రతిరోజూ గ్రహ దోష నివారణకు ప్రత్యేక పదార్థాలతో స్నానం.

స్నానం..శరీరంపై అంటుకున్న దుమ్ము, ధూళి, చెమట, రజో తమో గుణాలను కడిగేస్తుంది. తద్వారా మనసు సాత్వికంగా మారి ధ్యానానికి సిద్ధమవుతుంది. నీటి స్పర్శ ద్వారా చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, మానసకి కల్మషం తొలగిపోతాయి. ఆరా శుభ్రం అయి ప్రాణశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మూలాధార చక్రం నుంచి నీరు ప్రవహించడం వల్ల శక్తి కేంద్రాలు శుభ్రమవుతాయి. ఇది కుండలిని శక్తి జాగృతికి ముందస్తు సన్నాహపరుస్తుంది. బాహ్యంగా కడుక్కోవడం ద్వారా అంతర్గత శుద్ధిడిని అనే భావన కలుగుతుంది. 

హిందూ సంప్రదాయంలో స్నానం ఆచరించకుండా పూజ చేయరు. శుద్ధ శరీరంతో భగవంతుడిని పూజిస్తే పూజా ఫలం రెట్టింపవుతుందని నమ్మకం. చల్లటి నీరు శరీరంపై పడితే మనసులో ఉన్న అలజడి, కోపం, ఆందోళన తగ్గుతాయి. స్నానం చేసిన తర్వాత మనసు స్వచ్ఛంగా మారుతుంది.  గంగ, యమున, కృష్ణా, గోదావరి, నర్మద, కావేదీ, సింధి సహా పుణ్యనదుల్లో స్నానమాచరిస్తే సంచిత కర్మలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

స్నానం ఆచరించే సమయం కూడా ముఖ్యమే..బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే సాత్విక శక్తులు ఎక్కువ ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనకు బలం లభిస్తుంది. స్నానం చేసేటప్పుడు గంగమ్మకు నమస్కరించాలి, అనంతరం ప్రత్యక్షనారాయణుడు అయిన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.  

అయితే.. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఏ రోజు స్నానం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే..

ఆదివారం  - సూర్య గ్రహ దోషం తొలగిపోయేందుకు 
 
ఆదివారం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు కానీ ఎర్రటి పూలు కానీ నీటిలో కలిపి స్నానం ఆచరిస్తే సూర్య గ్రహ దోషం తగ్గిపోతుంది. 
 
సోమవారం - చంద్ర దోషం తొలగిపోయేందుకు

జాతకంలో చంద్ర గ్రహ దోషం ఉంటే స్నానం చేసి నీటిలో ఓ చుక్క పాలు లేదా పెరుగు వేసుకుని స్నానమాచరించాలి

మంగళవారం - కుజ గ్రహ దోషం తొలగిపోయేందుకు

మంగళవారం స్నానం ఆచరించే నీటిలో బిల్వ ఆకు పొడి వేసుకుని స్నానం చేయాలి

బుధవారం - బుధ గ్రహ దోషం తొలగిపోయేందుకు

స్నానమాచరించే నీటిలో సముద్రపు నీరు కానీ గంగానది నీరు కానీ రాళ్ల ఉప్పు కానీ వేసి స్నానమాచరిస్తే బుధగ్రహ దోషం తగ్గుతుంది
 
గురువారం - గురుగ్రహ దోషం తొలగిపోయేందుకు

గురువారం రోజు నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానమాచరిస్తే గురు గ్రహ దోషం తొలగిపోతుంది
 
శుక్రవారం - శుక్రగ్రహ దోషం తొలగిపోయేందుకు
 
ఈ రోజు కూడా యాలకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకుని చేస్తే శుక్ర గ్రహ దోషం తగ్గుతుంది
 
శనివారం - శనిగ్రహ దోషం తొలగిపోయేందుకు

నీటిలో నల్లటి నువ్వులు వేసుకుని స్నానం చేయాలి
 
రాహు గహ్ర దోషం తొలగిపోయేందుకు శనివారం మహి షాసిని పొడిచేసి నీటిలో మరిగించి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి
  
కేతు గ్రహ దోషనివారణ కోసం మంగళవారం గరికను నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి
 
ఈ నియమాలను అనుసరిస్తూ ఆయా రోజుల్లో స్నానం ఆచరించి భగవంతుడికి నమస్కరిస్తే గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని సనాతన హిందూ ధర్మం చెబుతోంది

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

 

Frequently Asked Questions

స్నానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

స్నానం శరీరాన్ని, మనస్సును శుభ్రపరుస్తుంది. దుమ్ము, చెమటను తొలగించి, రజో తమో గుణాలను తగ్గిస్తుంది. ఇది ప్రాణశక్తిని పెంచి, మనసును ధ్యానానికి సిద్ధం చేస్తుంది.

హిందూ సంప్రదాయంలో స్నానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?

హిందూ సంప్రదాయంలో పూజకు ముందు స్నానం తప్పనిసరి. శుద్ధ శరీరంతో భగవంతుడిని పూజిస్తే పూజా ఫలం రెట్టింపవుతుందని నమ్మకం. ఇది అంతర్గత శుద్ధి భావనను కలిగిస్తుంది.

గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఏ రోజు స్నానం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?

గ్రహ దోషాలు తొలగిపోవడానికి వారంలోని ఒక్కో రోజు ఒక్కో నియమాన్ని పాటించాలి. ఉదాహరణకు, ఆదివారం కుంకుమపువ్వు లేదా ఎర్రటి పూలు కలిపిన నీటితో స్నానం చేయాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget