అన్వేషించండి

శివ భక్తులపై శని ప్రభావం ఉండదా? శిష్యుడైన శని బారి నుంచి శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు కదా!

Shani Dev: శని దేవుని గురువు ఎవరో మీకు తెలుసా? సూర్యుని కుమారుడు శివుడిని పూజించే వారిపై ఎందుకు ప్రభావం చూపించడు? శివుడు కూడా శని నుంచి తప్పించుకోలేదు కదా మరి..ఇదెలా సాధ్యం?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శనిదేవుడు తండ్రి తిరస్కరణతో శివుని కోసం కఠోర తపస్సు చేశాడు.
  • శివుడు శనిని 'కర్మ ప్రదాత'గా, 'న్యాయాధికారి'గా నియమించాడు.
  • శని ప్రభావంతో శివుడు కూడా ఏనుగు రూపంలో దాక్కున్నాడు.
  • గురు-శిష్య సంబంధంతో, శివ భక్తులపై శని ప్రభావం తక్కువ.

Shiva Shani Dev Guru Story: మహాదేవుడు - శని దేవుడికి సంబంధించిన కథ పురాణాల్లో ఉంది. శివుడు స్వయంగా శనికి గురువు. పరమేశ్వరుడిని పూజించేవారిపై శని ప్రభావం ఉండదని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.

సనాతన ధర్మంలో, మహాదేవుడు  న్యాయానికి కర్మఫలాలకు అధిపతిగా పరిగణిస్తారు. శని దేవుడి పేరు వినగానే అంతా భయపడతారు కానీ విశ్వంలోనే అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణించే శని... సాక్షాత్తు మహాదేవునికే గొప్ప భక్తుడు , శిష్యుడు అని మీకు తెలుసా? పురాణాల ప్రకారం, శని దేవుడికి 'న్యాయాధికారి' అనే బిరుదును సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. మహాదేవుడు-  శని దేవుని మధ్య ఉన్న ఈ విశిష్టమైన సంబంధం   కథను, అలాగే శివుడిని పూజించే వారి పట్ల శని దేవుడు ఎందుకు ఎల్లప్పుడూ దయతో ఉంటాడో తెలుసుకుందాం.

జూలై 14 భౌమవతి అమావాస్య! వివాహం, పిల్లలు, ఉద్యోగ సమస్యలు తగ్గేందుకు రాశి ప్రకారం ఈ దానం చేయండి!

శని దేవుడు మహాదేవునికి ఎలా , ఎందుకు శిష్యుడయ్యాడు?

పురాణాల ప్రకారం, శని దేవుడు సూర్యదేవుడు , ఛాయాదేవిల కుమారుడు. పుట్టినప్పుడు శని అత్యంత నల్లని రంగులో ఉండటంతో, సూర్యదేవుడు  తన కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించి, అవమానించాడు. తండ్రి ప్రవర్తనతో మనస్తాపం చెందిన శని దేవుడు శివుని కోసం కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. మండుటెండ, చలి, వానలను సైతం లెక్కచేయకుండా, ఆకలిదప్పికలతో సంవత్సరాల తరబడి శివుడిని పూజించాడు. అతని కఠోర తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై, ఒక వరం కోరుకోమని అతడిని అడిగాడు.

రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం ఎందుకు? అద్భుత ఫలితాలు & రహస్యం!

కర్మఫల దాత స్థానం

శని దేవుడు తన తండ్రి అయిన సూర్య దేవుని కంటే ఎక్కువ శక్తిమంతుడిగా, గౌరవనీయుడిగా నిలిచే ఒక పదవిని, అధికారాన్ని ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు. అప్పుడు మహాదేవుడు శని దేవుడిని నవలోకాలలో అత్యున్నత స్థానానికి హెచ్చించి,  "కర్మ ప్రదాత"  "న్యాయ ప్రదాత "గా నియమించాడు. శని దేవుడు కేవలం మానవులనే కాకుండా, దేవతలను కూడా వారి కర్మల ఆధారంగా శిక్షిస్తాడని లేదా బహుమతి ఇస్తాడని శివుడు ప్రకటించాడు.

సాక్షాత్తు శివుడే శని దేవుని దుష్ట దృష్టి నుంచి తప్పించుకోలేకపోయిన సందర్భం ఇదే
 
మహాదేవుడు -  శని దేవుడికి సంబంధించిన ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది, శని దేవుడు తన గురువైన శివుడిని చూడాలని వెళ్లాడు.  "ఓ గురుదేవా, రేపు నేను మీ రాశిలోకి ప్రవేశించబోతున్నాను, అందువల్ల నా దృష్టి  మీపై కూడా పడుతుంది" అని అన్నాడు. దానికి మహాదేవుడు చిరునవ్వుతో, "ఎంతసేపు నాపై నీ దృష్టిని ఉంచుతావు?" అని అడిగాడు. దానికి శని దేవుడు, "ఒక పావు ప్రహరం (సుమారు మూడున్నర గంటలు)" అని బదులిచ్చాడు.  శని దేవుని ఆగ్రహం నుంటి తప్పించుకోవడానికి, మహాదేవుడు ... ఏనుగు వేషంలో భూలోకానికి వచ్చి అడవిలో దాక్కున్నాడు. కాసేపటి తర్వాత మహాదేవుడు తన దైవ స్వరూపానికి తిరిగి వచ్చి.. "చూడు శనీ, నీ దుష్ట దృష్టి నాకు హాని చేయలేకపోయింది." అందుకు బదులుగా శనిదేవుడు చేతులు జోడించి.. "ఓ ప్రభూ! నా చూపు ప్రభావం కారణంగా.. విశ్వనాథుడు తన దైవ రూపాన్ని విడిచిపెట్టి, పావుగంట సేపు జంతు రూపంలో (ఏనుగు) మారి అజ్ఞాతంలో జీవించవలసి వచ్చింది." అని వియనంగా చెప్పాడు. శని... ఈ నిష్పాక్షిక న్యాయానికి మహాదేవుడు అత్యంత సంతోషించి, శనిదేవుడిని ఆలింగనం చేసుకున్నాడు. 

వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

శివ భక్తులపై శని ప్రభావం తక్కువ
 
జ్యోతిష్యం , పురాణాలు స్పష్టంగా చెబుతున్నదేమిటంటే, శివుని నిజమైన భక్తునికి శని దేవుని వలన ఎన్నడూ ఇబ్బంది కలగదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి

గురు-శిష్య సంబంధం: శని దేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు. సనాతన సంప్రదాయంలో, శిష్యుడు తన గురువుకు గానీ, ఆయన ప్రియ భక్తులకు గానీ ఎన్నడూ హాని చేయడు. ఎవరైనా శివుడిని పూజిస్తే, శని దేవుడు వారిపై తన దుష్ట దృష్టిని ప్రసరింపజేయడు.

కర్మ ప్రక్షాళన: శివభక్తి ఒక వ్యక్తిలో సానుకూల శక్తిని నింపుతుంది  వారిని చెడు పనులకు దూరంగా ఉంచుతుంది. శని దేవుడు చెడు పనులను మాత్రమే శిక్షిస్తాడు కాబట్టి, ఆయన శివ భక్తుల పుణ్యకార్యాలకు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు.

పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?

శని దోషాన్ని వదిలించుకోవడానికి సులభమైన నివారణలు

మీరు శని ప్రభావంతో బాధపడుతుంటే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివారాధన చేయడం ఉత్తమ మార్గం
 
శివలింగానికి అభిషేకం చేయండి.. నల్లటి నువ్వులు కలిపిన నీటిని ప్రతి శనివారం సమర్పించి  'ఓం నమః శివాయ' అని జపించండి.

మహా మృత్యుంజయ మంత్రం: ప్రతిరోజూ లేదా ముఖ్యంగా శనివారాల్లో మహా మృత్యుంజయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల అన్ని రకాల శని దోషాలు శాంతిస్తాయి.

శని చాలీసా  శివ చాలీసా: శనివారం నాడు శివ , శని ఇద్దరి చాలీసాలను పఠించడం చాలా ఫలప్రదం 

పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

 

Frequently Asked Questions

శని దేవుడు శివునికి ఏమవుతాడు?

పురాణాల ప్రకారం, శని దేవుడు మహాదేవుని శిష్యుడు. స్వయంగా శివుడే శనికి 'న్యాయాధికారి' అనే బిరుదును ఇచ్చారు.

శివుని పూజించేవారిపై శని ప్రభావం ఎందుకు తక్కువగా ఉంటుంది?

శని దేవుడు శివుడిని తన గురువుగా భావిస్తాడు కాబట్టి, ఆయన భక్తులపై దుష్ట దృష్టి ప్రసరింపజేయడు. శివభక్తి మంచి కర్మలకు దారితీస్తుంది, శని చెడు కర్మలనే శిక్షిస్తాడు.

శని దేవుడు న్యాయ ప్రదాత స్థానం ఎలా పొందాడు?

తండ్రి సూర్యుని అవమానంతో మనస్తాపం చెందిన శని, శివుని కోసం కఠోర తపస్సు చేశాడు. సంతోషించిన శివుడు శనిని కర్మఫల దాతగా, న్యాయ ప్రదాతగా నియమించాడు.

శని దోష నివారణకు శివుని ఎలా పూజించాలి?

శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేసి 'ఓం నమః శివాయ' జపించాలి. మహా మృత్యుంజయ మంత్రం, శని చాలీసా పఠించడం కూడా శుభప్రదం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
అక్టోబర్ 27 రాశిఫలాలు: తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి అదృష్టం, శుభవార్తలు
అక్టోబర్ 27 రాశిఫలాలు: తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి అదృష్టం, శుభవార్తలు
అక్టోబర్ 27 మంగళవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా అదృష్టం ఎలా ఉండబోతుంది?
అక్టోబర్ 27 మంగళవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా అదృష్టం ఎలా ఉండబోతుంది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget