అన్వేషించండి

Shani Trayodashi 2023: ఈ రోజు శని త్రయోదశి, పాటించాల్సిన కొన్ని నియమాలివే!

జూలై 1 శనివారం త్రయోదశి వచ్చింది. ఈరోజు శనికి అత్యంత ప్రీతికరమైన రోజు. కొన్ని నియమాలు పాటించడం ద్వారా శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చంటారు..ఆ నియమాలేంటో చూద్దాం.

Shani Dev: నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి చేసే  పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. బతికి ఉండగా చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే మరణానంతరం ఆ పాపపుణ్యాల ఆధారంగా శిక్షలు అమలు చేస్తారు శని సోదరుడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇద్దరూ న్యాయాధికారులే. వాస్తవానికి శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని విశ్వాసం. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాటినుంచి పూర్తిగా తప్పించుకోలేరు కానీ కొన్ని నియమాలు పాటించడం వలన శని ప్రభావం తగ్గుతుందంటారు పండితులు. 

Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది

శని శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం!!

శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు

  • సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి
  • ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అనంతరం భోజనం చేయాలి
  • శని త్రయోదశి రోజు మద్యమాంసాలు ముట్టుకోరాదు
  • శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తగ్గుతుంది
  •  "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా మంచిదే
  • ఆకలితో అలమటించేవారికి భోజనం పెట్టాలి, మూగజీవాలకు కూడా
  • ఎవరి వద్ద నుంచి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోవద్దు
  • శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయం లో ప్రసాదం పంచండి
  •  రోజుకో నువ్వుల ఉండను కాకికి తినిపించడం మంచిది
  • శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది
  • ముఖ్యంగా ఆంజనేయుడి ఆరాధన వలన శనిప్రభావం తగ్గుతుంది, సుందరకాండ పారాయణం చేయండి
  • కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు ,నల్ల నువ్వులు, మేకు శనికి నమస్కరించి వేయండి
  • బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శనిప్రభావం తగ్గుతుంది
  • ప్రతి శని వారం రాగి చెట్టుకు ప్రదిక్షణం చేయాలి
  • శనివారం రోజు శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి, నల్లటి దుప్పటి దానం చేస్తే మంచిది
  • అయ్యప్ప మాల ధరించడం,  శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇవ్వడం,  కాలభైరవ దర్శనం వల్ల కూడా శనిప్రభావం తగ్గుతుందిట

Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది

శని షోడశ నామాలు | Shani Shodasa Namalu
కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః 
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః 
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః 
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః 
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే 
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget