అన్వేషించండి

Saddula Bathukamma 2025 Date: సద్దుల బతుకమ్మ సెప్టెంబర్ 29 or 30? ఎప్పుడు జరుపుకోవాలి? గందరగోళం వద్దు.. ఇదిగో క్లారిటీ!

Saddula Bathukamma: ఒకే తిథి రెండు రోజులు వచ్చినప్పుడు ఇలాంటి పంచాయితీలు జరుగుతుంటాయ్...ఇంతకీ సద్దుల బతుకమ్మ సోమవారమా? మంగళవారమా? ఎప్పుడు జరుపుకోవాలి? ఎవరి వాదన ఎలా ఉంది?

Saddula Bathukamma 2025 Date: సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలి? రోజుల లెక్కనా? తిథులను పరిగణలోకి తీసుకోవాలా? నిమజ్జనం సమయానికి అష్టమి తిథిని పరిగణలోకి తీసుకోవాలా? 

రోజుల ప్రకారం అయితే

తొమ్మిది రోజు పూల పండుగలో భాగంగా రోజుకో బతుకమ్మను ఆరాధిస్తారు.. ఈలెక్కన సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్యతో బతుకమ్మ ప్రారంభమైంది. 

సెప్టెంబర్ 21 ఎంగిలిపూల బతుకమ్మ, సెప్టెంబర్ 22 అటుకుల బతుకమ్మ, సెప్టెంబర్ 23 ముద్దపప్పు బతుకమ్మ, సెప్టెంబర్ 24 నానబియ్యం బతుకమ్మ, సెప్టెంబర్ 25 అట్ల బతుకమ్మ, సెప్టెంబర్ 26 అలిగిన బతుకమ్మ, సెప్టెంబర్ 27 వేపకాయల బతుకమ్మ, సెప్టెంబర్ 28 వెన్నముద్దల బతుకమ్మ, సెప్టెంబర్ 29న తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. రోజులను పరిగణలోకి తీసుకుంటే సద్దులబతుకమ్మ సెప్టెంబర్ 29 సోమవారం జరుపుకోవాలి

తిథుల ప్రకారం అయితే

మహాలయ అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ.. భాద్రపద అమావాస్య, ఆశ్వయుజ పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి....తొమ్మిది రోజులు సాగుతుంది. అంటే తిథుల ప్రకారం అమావాస్య తో ప్రారంభమై.. అష్టమితో ముగుస్తుంది. 

కన్ఫ్యూజన్ ఎందుకు మరి?

అష్టమి తిథి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 06 నిముషాల నుంచి ప్రారంభమైంది

మంగళవారం మధ్యాహ్నం ఒంటింగట 16 నిముషాల వరకూ ఉంది.

సాధారణంగా పండుగలన్నీ సూర్యోదయానికి తిథి ఉన్నవే పరిగణలోకి తీసుకుంటారు (దీపావళి అమావాస్య, కార్తీక పౌర్ణమి మినహా). అందుకే అష్టమి తిథి   సెప్టెంబర్ 30 మంగళవారం ఉదయానికి ఉందికాబట్టి ఈ రోజే సద్దుల బతుకమ్మ అని కొందరు.. కాదు కాదు బతుకమ్మను నిమజ్జనం చేసేది  సంధ్యాసమయం తర్వాతే కాబట్టి..రాత్రికి తిథి ఉన్న సెప్టెంబర్ 29 సోమవారమే సద్దుల బతుకమ్మ అని మరికొందరు. 
 
వరంగల్ భద్రకాళి ఆలయం అర్చకులు, తెలంగాణ విద్వత్ సభ.. సెప్టెంబర్ 30 మంగళవారం సద్దులబతుకమ్మ జరుపుకోవాలంటారు ( సూర్యోదయానికి ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలన్నది వీరి వాదన)

మహాలయ అమావాస్య రోజు ప్రారంభమైన పండుగ తొమ్మిది రోజుల లెక్కన సెప్టెంబర్ 29న సోమవారంతో ముగుస్తుందని వరంగల్ వేయిస్తంభాల ఆలయ అర్చకులు చెబుతున్నారు

ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 30 మంగళవారం సద్దుల బతుకమ్మ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది

మరి 9 రోజులు ప్రామాణికమా? 

సూర్యోదయానికి అష్టమి తిథి ప్రధానమా?

సద్దుల బతుకమ్మ ఎప్పుడు?

తెలంగాణ పురోహితులు చెప్పేమాటేంటంటే... శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు మాత్రమే సూర్యోదయానికి అష్టమితిథి లెక్క.. బతుకమ్మకు 9 రోజులే ప్రామాణికం అందుకే సెప్టెంబర్ 29 సోమవారమే సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం శ్రేష్ఠం అంటున్నారు. పైగా బతుకమ్మను నిమజ్జం చేసే సమయానికి అష్టమి తిథి ఉంటుంది.. అమావాస్య to అష్టమి.. 9 రోజులు పూర్తవుతుందంటున్నారు. 

పెద్దలు చెప్పే మాట..

సాధారణంగా మంగళవారం, శుక్రవారం రోజున గౌరమ్మను సాగనంపరు. ఈ లెక్కన తీసుకున్నా సద్దులబతుకమ్మ నిర్వహించుకోవాల్సింది సెప్టెంబర్ 29 సోమవారమే...

తెలంగాణ స్థానికుల మాట..

ఇంటి గౌరమ్మను మంగళవారంతో పంపించం కదా..అందుకే సోమవారమే సద్దుల బతుకమ్మ అంటున్నారు హైదరాబాద్ వాసులు.  పైగా బతుకమ్మను నిమజ్జనం చేసే సమయానికి అష్టమి తిథి ఉంటుంది. 

తెల్లారితే పండుగ పెట్టుకుని ఇలాంటి గందరగోళంలో పడొద్దు.  మీ ఇంటి పూజారి లేదంటే ఇంట్లో పెద్దలు చెప్పిన పద్ధతిని అనుసరించి గౌరమ్మను సంబురంగా సాగనంపండి.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Embed widget