Ayyappa Online Booking Tickets: అయ్యప్ప మాల వేసిన స్వాములకు బిగ్ అలర్ట్- ఇలా చేస్తే దేవుని దర్శనం మరింత సులభం
Online Darshan Sabarimala : అయ్యప్ప దర్శనం ఈజీగా అయ్యేందుకు భక్తులు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్‌లు బుక్ చేసుకోవాలని ట్రావెన్‌కోర్ బోర్డు సూచిస్తోంది.
Travancore Devaswom Board: అయ్యప్ప మాల వేసి స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు లక్షల్లో ఉంటారు. నిత్యం 80 వేల మంది ఆ కుమారస్వామిని దర్శించుకోవడానికి ఎదురు చూస్తుంటారు. కానీ రోజులో కేవలం పది వేల మందికే అవకాశం లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. దీని వల్ల అనుకోని ఘటనలు జరిగిన చరిత్ర కూడా ఉంది.
ఇలాంటి రిస్క్‌ను గమనించిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు కీలక సూచనలు చేసింది. మండల-మకరవిళక్కు టైంలో స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ముందస్తు స్లాట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చారు. దీని వల్ల ఎలాంటి గందరగోళం లేని దర్శనం లభిస్తుందని దీనిని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.
Also Read: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల వెళ్లే భక్తులు https://sabarimalaonline.org/#/login ద్వారా తమ వివరాలు నమోదు చేసుకొని దర్శనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఈ దర్శన టైమ్ స్లాట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతాయని అన్నారు. అయితే ఇలా ఆన్‌లైన్ బుక్‌చేసుకున్న చేసుకోకపోయినా దర్శనం మాత్రం దొరుకుతుందని బోర్డు తెలిపింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే దర్శన ప్రక్రియ సులభతరం అవుతుందని వెల్లడించింది. టైమ్‌స్లాట్ దర్శనాలు బుక్ చేసుకున్న వాళ్లు తమ వెంట ఆధార్ కార్డు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు. విదేశీయులు మాత్రం పాస్‌పోర్టు కాపీ చూపించాల్సి ఉంటుంది.
పంబా జలాలు కలుషితం కాకుండా ఉండేందుకు కూడా బోర్డు చర్యలు తీసుకుంది. భక్తులు తీసుకొచ్చే ఇరుముడులు ప్లాస్టిక్ కవర్, ఇతర ప్లాస్టిక్ పరికరాల్లో తీసుకురావద్దని సూచించారు. శబరిమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది తమ దీక్షలు పూర్తి అయిన తర్వాత వస్త్రాలను, ఇతర వస్తువులను పంబా నదిలో పడేస్తున్నారని మంచిది కాదని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల నదీ జలాలు కలుషితం అవుతున్నాయని గుర్తు చేశారు.
Also Read: శబరిమల యాత్రకు వెళ్లే వాళ్లకు అద్భుత అవకాశం- ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
శబరిమలకు వచ్చే భక్తులకు కోసం కేరళ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మండలం- మకరవిలక్కు టైంలో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఉచిత బీమా కల్పించాలని నిర్ణయించింది. ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డే ఈ నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది. ప్రమాదవశాత్తు ఎవరైనా మృతి చెందితే ఆ మృతదేహాలను స్వస్థలాలకు చర్చే బాధ్యతను కూడా బోర్డు తీసుకుంది. ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే యాత్రకు ప్రభుత్వం, బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులతో టీమ్‌లను ఏర్పాటు చేసింది. భక్తుల సౌకర్యార్థం 132 సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లతోపాటు 1500 ఎకో గార్డ్స్ భక్తులకు హెల్ప్ చేస్తారు.