Ratna Bhandar: మరోసారి తెరుచుకున్న జగన్నాథుడి రత్న భాండాగారం..తరలించిన ఆభరణాలు తిరిగి అక్కడకు చేరుకునేది ఎప్పుడంటే!
Puri Jagannath Temple Secret Chamber: పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రహస్య గదిని గురువారం ఉదయం అధికారులు మళ్లీ తెరిచారు. రహస్య గదిలో పెట్టెలలో ఉన్న ఆభరణాలను స్ట్రాంగ్ లో భద్రపరచనున్నారు
Ratna Bhandar: పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రత్న భాండార్ ను అధికారులు జూలై 19 గురువారం మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తలుపులు తెరిచారు. రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాతే మరోసారి రత్నభాండాగారాన్ని తెరిచారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి...ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత ఆభరణాలను వేరేచోటుకి తరలించనున్నారు.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
జగన్నాథుడి దర్శనాన్ని భక్తులు రెండు అంచెల్లో చేసుకుంటారు. కొన్నిసార్లు నాట్యమండపం దగ్గరే భక్తులను ఆపేస్తారు. మరికొన్నిసార్లు జగన్మోహనం వరకూ పంపిస్తారు. ఆ పక్కనే రత్నభాండారం ఉంది. ఇక్కడ మూడు చాంబర్లుంటాయి. మొదటి చాంబర్లో...రెగ్యులర్ గా స్వామివారికి వినియోగించే నగలుంటాయి. ఏడాదికి ఐదుసార్లు వీటిని స్వామివారికి అలకరిస్తుంటారు. భాండార్ అధిపతి దగ్గర ఈ తాళం ఉంటుంది. రెండో చాంబర్లో.. తలుపుకి మూడు తాళాలుంటాయి. ఓ తాళం గజపతి మహారాజుల దగ్గర, రెండో తాళం భాండార్ అధికారి దగ్గర, మూడో తాళం కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది..ఈ మూడు తాళాలతో ఒకేసారి తెరవాలి. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలి.. 1978లో ఆఖరిసారిగా తెరిచి లెక్కించారు.. 70 రోజుల పాటూ లెక్కించి ఆ లిస్టు ప్రిపేర్ చేశారు. అప్పటి నుంచి మూడేళ్లకోసారి తెరవాలని అనుకున్నారు కానీ మళ్లీ తెరవలేదు. 2018లో కోర్టు, పురావస్తు శాఖ కూడా తెరవాలని చెప్పడంతో ఓ తాళం పోయిందన్నారు. రీసెంట్ గా జరిగిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రత్న భాండార్ తెరిచారు. 46 సంవత్సరాల తర్వాత తెరిచారు. బయట గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలను అక్కడి నుంచి తీసేసి ఖాళీ చేశారు. లోపల గది తెరిచేందుకు ప్రయత్నించి ప్రయత్నించి చివరకు విరగ్గొట్టి లోనికి ప్రవేశించినట్లు సీఏవో మరోసారి గుర్తు చేశారు. అయితే ఆ రోజు సమయం సరిపోవకపోవడంతో ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టకుండా ఆపేశారు.
Also Read: పూరీ ఆలయంలోని రత్న భాండాగారం మిస్టరీ ఏమిటీ? లోగుట్టు దేవుడికి తప్ప ఎవరికీ తెలియదా?
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం బయట, లోపల గదుల్లో ఉన్న ఆభరణాల తరలింపు పూర్తయ్యాక...మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖకి అప్పగిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత.. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఆభరణాలను తిరిగి రత్నభాండాగారంలోకి చేర్చేస్తారు.జగన్నాథుడి సంపద గురించి ఆలయంలో...జయవిజయుల ద్వారం పక్కన గోడపై ఓ శాసనం ఉంటుంది. 1466లో ఎన్నో దండయాత్రల తర్వాత గజపతి రాజులు అంతులేని సంపద ఆలయానికి తీసుకొచ్చారని ఆ శాసనంలో ఉంది. ఆ తర్వాత ఎందరో మహారాజులు జగన్నాథుడికి భారీ సంపదను సమకూర్చారు. ఇంకా పూరీ ఆలయంలో అనంతమైన సంపద ఉందని చెబుతూ ఎన్నో శాసనాలున్నాయి. ప్రస్తుతానికి ఆభరణాలు వేరేచోటుకి తరలించి...రత్నభాండాగారం మరమ్మతులు పూర్తైన తర్వాత తిరిగి ఆభరణాలను అక్కడే భద్రపరచనున్నారు...