అన్వేషించండి

Panchang 7th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ ఆంజనేయ దండకం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

జూన్ 7 ,2022 మంగళవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 07- 06 - 2022
వారం:  మంగళవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం

తిథి  :  అష్టమి మంగళవారం రాత్రి తెల్లవారుజామున 3.30 వరకు తదుపరి నవమి 
వారం : మంగళవారం 
నక్షత్రం:  పుబ్బ రాత్రి 11.38 వరకు తదుపరి ఉత్తర 
వర్జ్యం :  ఉదయం 6.49 నుంచి 8.30 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 8.12 నుంచి8.56 వరకు తిరిగి రాత్రి 10.51 నుంచి 11.35 వరకు
అమృతఘడియలు  :  సాయంత్రం 4.54 నుంచి 6.35 వరకు
సూర్యోదయం: 05:28
సూర్యాస్తమయం : 06:29

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

మంగళవారం ఆంజనేయుడికి ప్రీతికరమైన రోజు..ఈ సందర్భంగా ఈ రోజు చదువుకోవాల్సిన  శ్రీ ఆంజనేయ దండకం 

 శ్రీ ఆంజనేయ దండకం 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం 
భజే వాలగాత్రం భజేఽహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం 
బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి 
నీమీద నే దండకం బొక్కటింజేయ నూహించి నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి 
నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే 
వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ 
నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే 
తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి 
వారిన్విచారించి సర్వేశు పూజించి యబ్బానుజున్ బంటు గావించి యవ్వాలినిన్ జంపి 
కాకుత్స్థతిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ 
లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగ 
యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి 
సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి యాసేతువున్ దాటి 
వానరానీకముల్ పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై 
కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి యా లక్షణున్ మూర్ఛనొందింపగా 
నప్పుడే నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా 
కుంభకర్ణాదులన్వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా 
నంత లోకంబులానందమై యుండ నవ్వేళలందున్ విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి 
పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతోజేర్చి అయ్యోధ్యకున్ వచ్చి
 పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ 
శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామకీర్తనల్ జేసితే పాపముల్బాయునే 
భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే 
వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు 
నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మమంత్రంబు సంధానమున్ జేయుచున్ 
స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమైన 
యెప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండియున్ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై 
రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హా వీరహనుమంత
 ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వగ్రహానీకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ
 గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడన్ గొట్టి నీముష్టి ఘాతంబులన్ 
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబైన 
నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నా ముద్దు నరసింహ యనుచున్ దయాదృష్టి వీక్షించి 
నన్నేలు నాస్వామి యో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ 
నమో వాయుపుత్రా నమస్తే నమస్తే నమః |

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget