అన్వేషించండి

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన జగన్నాథుడు - యుద్ధ సూచన కూడా ఇదేనా!

Pahalgam Terror Attack: ఏ క్షణమైనా దాయాది దేశం పాకిస్తాన్ పై భారత్ అటాక్ చేస్తుందని భారతీయులంతా ఫిక్సైపోయారు. అయితే ఈ యుద్ధం గురించి ముందుగానే హింట్ వచ్చిందా? ఆ రోజు జరిగిన ఘటనే ముందస్తు హెచ్చరికా?

 Indo-Pak War 

పహల్గాం ఉగ్రదాడి పూరీ జగన్నాథుడి ఆలయంపై జెండాకి ఏంటి సంబంధం

ఉగ్రదాడి, భారత్-పాక్ యుద్ధం గురించి జగన్నాథుడు ముందే హింట్ ఇచ్చాడా

జగమంతా పాలించే జగన్నాథుడి ఆలయంపై జెండాను గరుడ పక్షి జెండా ఎత్తుకెళ్లడం అశుభానికి సూచనేనా?

ఏదో జరగబోతోందనే సంకేతంగా పూరీ ఆలయంపై జెండాను గరుత్మంతుడు జెండా ఎత్తుకెళ్లాడా?

కురుక్షేత్ర యుద్ధానికి ముందు సంధికోసం శ్రీ కృష్ణుడు కౌరవుల దగ్గరకు వెళతాడు. పాండవులకు ఐదు ఊర్లిస్తే చాలని అడిగినా కౌరవులు అంగీకరించరు. అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే...ఓ గరుడ పక్షి వచ్చి ఓ పతాకాన్ని తీసుకెళ్లిపోతుంది, నక్కలు అరుస్తాయి, భూమి కంపిస్తుంది.  ఈ శకునాలు చూసి ఏదో జరగబోతోందని ధృతరాష్ట్రుడు గమనించాడు. అదే విషయం దుర్యోధనుడికి చెప్పి హెచ్చరించాడు కానీ దుర్యోధనుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిందే కురుక్షేత్ర సంగ్రామం.

ఇప్పుడు కూడా పూరీ జగన్నాథుడి ఆలయంపై జెండాను గరుత్మంతుడు ఎత్తుకెళ్లిన తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు వెళ్లిన పర్యాటకులు వారి కుటుంబాలను పుట్టెడు దుఃఖంలో ముంచెత్తారు. ఆతర్వాత భారత ప్రభుత్వం తీవ్రంగా రియాక్టైంది. దాయాదిదేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఫిక్సైంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. త్రివిద దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రదాని మోదీ. త్వరలోనే ధర్మయుద్ధం జరగబోతోందని భారతీయులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగబోతుందనే సంకేతం ఇస్తూ  జెండాను గరుత్మంతుడు తీసుకెళ్లి ఎగరేసి వదిలేశాడని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.  

2025 ఏప్రిల్ 12 సాయంత్రం పూరీ జగన్నాథ్ ఆలయం గోపురంపై ఓ గరుడ పక్షి ప్రదక్షిణలు చేసింది. ఆలయంపై ఉన్న జెండాను పట్టుకుని మరీ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఓ దగ్గర జెండాను వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనను కొందరు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన క్షణాల్లో వైరల్ అయింది. పూరీ ఆలయం గోపురంపై ఉన్న జెండాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయంలో జెండా గాలిదిశకు రివర్స్ లో ఎగురుతుంది. 45 అంతస్తులున్న ఈ ఆలయంపై జెండాను నిత్యం మారుస్తారు. 1800 ఏళ్లుగా ఈ ఆచారం సాగుతోంది...ఒక్కరోజు ఈ జెండాను ఎగరేయడం మానేసినా 18 ఏళ్లపాటూ ఆలయం మూతపడుతుందని నమ్మకం. ఇంత మహిమాన్విత అయిన జెండాను గరుడపక్షి తీసుకెళ్లడం అంటే అది ఓ హెచ్చరిక అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు
 
ఇది దైవ సందేశమా..ప్రమాద హెచ్చరికా అని అప్పట్లోనే చర్చ జరిగింది. 2020లో ఈ జెండా అగ్నికి ఆహుతైంది..ఆ సమయంలో కరోనా వచ్చి దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. అలానే ఇప్పుడు కూడా ఏమైనా జరగబోతున్నాయా అంటూ సోషల్ మీడియా వేదికలా చాలామంది భక్తులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కూడా ఈ కోవకే చెందుతుంది అంటున్నారు. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధంలా ఇప్పుడు కూడా భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందేమో అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. 

ఇందులో వాస్తవం ఎంత? ఇది ఎంతవరకూ విశ్వశించాలి అన్నది స్పష్టంగా చెప్పలేం..ఇది కేవలం నమ్మకం, మత విశ్వాసాలమీద ఆధారపడి చెప్పిన విషయం మాత్రమే.

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
Divya Shakti: పురాణ అస్త్రాల రహస్య శక్తి! ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!
పురాణ అస్త్రాల రహస్య శక్తి! ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget