అన్వేషించండి

కుమారస్వామికి నార్త్ ఇండియాలో ఆలయాలు ఉండవు ఎందుకు..? NTR-Trivikram సినిమాతో మొదలైన చర్చ!

NTR-Trivikram Movie: కుమారస్వామి ఉత్తర భారతదేశానికి చెందినవాడా? అయితే సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ ఆలయాలు ఎందుకు ఉండవు? త్రివికమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీతో ఈ చర్చ మొదలైంది..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తారక్-త్రివిక్రమ్ సినిమాతో కుమారస్వామి జన్మస్థలం, ఆలయాలపై చర్చ.
  • మొఘల్ దాడుల వల్ల ఉత్తరాదిన ఆలయాలు ధ్వంసం; దక్షిణాదిన రక్షణ.
  • దక్షిణాదిలో ప్రత్యేక భక్తి, ఉత్తరాన ఇతర దేవతలకు ప్రాధాన్యం.
  • ఉత్తరాదిన కొన్ని ఆలయాలున్నా, దక్షిణాదిలా పెద్దగా పూజలు లేవు.

Karthikeya Temples: కుమారస్వామి కథతో సినిమా రాబోతోంది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నో సందేహాలు.. అందులో ఒకటి కుమారస్వామి ఆలయాల గురించి.

కుమారస్వామి ఉత్తరాదికి చెందినవాడు అని నాగవంశీ ట్వీట్ చేశారు. కానీ మురుగన్ కి ఆలయాలు ఎక్కువగా ఉన్నది దక్షిణాదినే. స్వామి అక్కడ జన్మించినప్పుడు అక్కడ ఆలయాలు ఎందుకు లేవు? అందుకు చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ కారణాలున్నాయా? NTR-త్రివిక్రమ్ మూవీ God Of War తో ఇది హాట్ టాపిక్ అవుతోంది.  

NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?

ఆక్రమణలు - ఆలయాల ధ్వంసం

ఉత్తర భారతదేశం దిల్లీ సుల్తానులు, మొఘలుల పాలనలో ఎక్కువగా ఉండడంతో ఆలయాలు, విగ్రహాలు, సంస్కృతిపై ప్రభావం పడింది. ఉత్తరాదిన ఉన్న చాలా ఆలయాలు ఆ కాలంలో ధ్వంసమయ్యాయి. దక్షిణాదిన విజయనగర సామ్రాజ్యం వంటి బలమైన హిందూ రాజ్యం ఉండడంతో ఇక్కడ ఆలయాలు రక్షణ పొందాయి. కార్తికేయుడికి దక్షిణాదిన ఎక్కువ ఆలయాలు ఉండడం కూడా ఇందులో భాగమే.  

కుమారస్వామికి నార్త్ ఇండియాలో ఆలయాలు ఉండవు ఎందుకు..? NTR-Trivikram సినిమాతో మొదలైన చర్చ!

సాంస్కృతిక వ్యత్యాసాలు

దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో కుమారస్వామిని ప్రాంతీయ దేవుడిగా (కురుంజి నేల దేవుడు) భావిస్తారు. ఇక్కడ అరుపడైవీడు వంటి సంప్రదాయం ఉంది. భక్తి, కావడి, తైపూసం వంటి ఉత్సవాలు బలంగా ఉన్నాయ్. 

ఉత్తర భారతదేశంలో కార్తికేయుడిని పూజిస్తారు కానీ ఆలయాలు తక్కువ. శివుడు, శ్రీ మహావిష్ణువు, గణేషుడు, దుర్గమ్మపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. 

గుప్తుల కాలంలో కుమార గుప్త, స్కందగుప్త పూజల ప్రాచుర్యం ఉండేది కానీ ఆ తర్వాత కాలంలో తగ్గింది

ఆస్తి సమస్యలా? గృహ నిర్మాణం ఆలస్యమవుతోందా? ఈ ఆలయం పరిష్కార మార్గం చూపిస్తుందట!

సంప్రదాయాల ప్రకారం

ఉత్తరభారత దేశంలో సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మచారిగా చూస్తారు. దక్షిణంలో వల్లీదేవసేనను భార్యలుగా చూపిస్తారు. కొన్ని పురాణాల్లో కుమారస్వామి తన తల్లిదండ్రులపై అసంతృప్తితో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చేశాడనే కథలున్నాయి. 

ఉత్తర భారతంలో కుమారస్వామికి ఆలయాలు లేవా?

ఉత్తరాదిన సుబ్రహ్మణ్యస్వామికి ఆలయాలు లేవా అంటే..పూర్తిగా లేవని కాదు.. హర్యానాలో పహోవా కార్తికేయ ఆలయం ప్రాచీనమైనది. ఇది మహాభారత కాలానికి సంబంధం ఉందని నమ్మకం
 
హిమాలయాల్లో... ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ లో కార్తిక స్వామి ఆలయం ఉంది 
 
ఇంకా ఉత్తరాదిన పలుచోట్ల స్కందుడి విగ్రహాలున్నాయి కానీ ఉపదేవతగా పూజిస్తారంతే..దక్షిణాదిలా భారీ ఆలయాలు, భక్తి ఉద్యమాలు లేవు.  

ఇది కేవలం భక్తి సంప్రదాయంలో వ్యత్యాసం మాత్రమే. దక్షిణ హిందూ సంస్కృతి సుబ్రహ్మణ్యస్వామిని ఎక్కువగా స్వీకరించింది. NTR త్రివిక్రమ్ సినిమా వల్ల మళ్లీ ఈ చర్చ జరుగుతూ...ఉత్తర-దక్షిణ సాంస్కృతిక వైభవాన్ని హైలైట్ చేస్తోంది. 

ఉత్తరాదిన - దక్షిణాదిన ఆలయాల్లో మాత్రమే కాదు... కార్తికేయుడు అంతటా ఉన్నాడు.. 

కుమారస్వామికి నార్త్ ఇండియాలో ఆలయాలు ఉండవు ఎందుకు..? NTR-Trivikram సినిమాతో మొదలైన చర్చ!

దిష్టి నుంచి రక్షించే దెయ్యం రహస్య కథ! దాని మూలం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

కుమారస్వామి ఆలయాలు దక్షిణాదిన ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?

ఉత్తరాదిలో దిల్లీ సుల్తానులు, మొఘలులు ఆలయాలను ధ్వంసం చేయగా, దక్షిణాదిన విజయనగర సామ్రాజ్యం వంటివి వాటిని రక్షించాయి. అలాగే సాంస్కృతిక, సంప్రదాయ వ్యత్యాసాలు కూడా దీనికి కారణం.

ఉత్తర భారతదేశంలో కుమారస్వామి ఆలయాలు ఉన్నాయా?

అవును, ఉత్తరాదిన కొన్ని ఆలయాలు ఉన్నాయి. హర్యానాలోని పహోవా కార్తికేయ ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కార్తిక స్వామి ఆలయం వాటిలో కొన్ని. కానీ దక్షిణాదిలా పెద్ద ఆలయాలు, భక్తి ఉద్యమాలు లేవు.

కుమారస్వామి ఆరాధనలో ఉత్తర, దక్షిణ భారతదేశ సంప్రదాయాల మధ్య వ్యత్యాసం ఏమిటి?

దక్షిణాదిన ఆయన ప్రాంతీయ దేవుడిగా, వల్లీదేవసేనతో పాటు పూజిస్తారు. ఉత్తరాదిన బ్రహ్మచారిగా చూస్తారు, ఇంకా శివుడు, విష్ణువు వంటి ఇతర దేవతలపై ఎక్కువ దృష్టి ఉంటుంది.

గుప్తుల కాలం తర్వాత ఉత్తరాదిలో కార్తికేయుడి ఆరాధన ఎందుకు తగ్గింది?

గుప్తుల కాలంలో ప్రాచుర్యం పొందిన కుమారస్వామి పూజలు ఆ తర్వాత కాలంలో తగ్గుముఖం పట్టాయి. దిల్లీ సుల్తానులు, మొఘలుల పాలనలో అనేక ఆలయాలు ధ్వంసం కావడం కూడా ఒక కారణం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget