అన్వేషించండి

Navratri Day 6 Mahalakshmi Devi Alankaram: దేవీ నవరాత్రి ఆరో రోజు మహాలక్ష్మీ దేవిగా విజయవాడ కనక దుర్గమ్మ .. ఈ అలంకారం పరమార్ధం ఏంటంటే!

Sri Mahalakshmi Devi Alankaram: శరన్నవరాత్రుల్లో ఆరో రోజైన మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ అవతారం విశిష్టత ఇదే...

 Navratri 2024 Day 6  Sri Mahalakshmi Devi Alankaram: విజయవాడ  ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది.  

'త్రిశక్తి'లలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ దేవి ఐశ్వర్యానికి,  ధైర్యానికి ప్రసిద్ధి.  మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమలం, వరదహస్తంతో దర్శనమిస్తోంది. 

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం 

మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవడం అత్యంత శుభకరం. క్షీరసాగర మధనం నుంచి జన్మించిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం, సౌబాగ్యం, అష్టసిద్ధిలు ప్రసాదిస్తుంది.  
 
ధనం,ధాన్యం,ధైర్యం,విజయం,విద్య,సౌభాగ్యం,సంతానం,గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయని చెబుతారు. 

Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!
 
"యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" 

అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీస్తుతిలో ఉంది. అందుకే దసరాల్లో మహలక్ష్మిని పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయంటారుయ 
 
సంపదకు ప్రతిరూపం అయిన లక్ష్మీదేవిని పూజిస్తే సకల దారిద్ర్యాలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు మహాలక్ష్మిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా కలువలతో కానీ తెల్లటి పూలు ఏవైనా కానీ పూజకు వినియోగించవచ్చు. క్షీరసముద్రరాజతనయకి క్షీరాన్నాన్ని నివేదించాలి. పరమాన్నం కాకుంటే అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదం నివేదించవద్దు.   

Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

 ఈ రోజు శ్రీ మహాలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తరం, శ్రీసూక్తం, కనకధారాస్తవం   చదువుకోవాలి.  

 శ్రీ లక్ష్మాష్టక స్తోత్రం

ఇంద్ర ఉవాచ 
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || 

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||  

సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని|
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ||  

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే ||  

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget