అన్వేషించండి

Margasira Lakshmi Vara Vratham: మార్గశిర గురువారాలు చదువుకోవాల్సిన వ్రత కథ! పేదరికం నుంచి సిరిసంపదకు అధిపతిగా మారిన సుశీల!

Margasira Lakshmi Vara Vratham: మార్గశిర మాసం నవంబర్ 21న ప్రారంభమైంది.. డిసెంబర్ 19తో పూర్తవుతుంది. ఈ నెలలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో పూజ అనంతరం చదువుకోవాల్సిన వ్రత కథ ఇదిగో...!

మార్గశిర గురువారం పూజ పూర్తిచేసిన తర్వాత ఈ వ్రతకథ చదువుకోవాలి.. వ్రత విధానం, నైవేద్యం గురించి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Margasira Lakshmi Vara Vratham Vrata Katha :   పూర్వకాలం సుశీల అనే ఓ బాలిక ఉండేది. ఆమె చిన్నప్పుడే తల్లి మరణించింది. తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు. వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయిస్తూ విశ్రాంతి తీసుకునేది. కాలక్రమంలో సవతి తల్లి సుశీలకు ఓ బాబు పుట్టాడు. అప్పటి నుంచి ఇంటి పనులతో పాటూ తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా సుశీలపైనే పడింది. బాబుని ఆడిస్తున్నందుకు బదులుగా రోజూ ఓ చిన్న  బెల్లం ముక్క ఇచ్చేది సవతి తల్లి. సుశీల పరిస్థితి చూసి ఇరుగుపొరుగువారు చలించిపోయారు. అన్నిటికీ ఆ అమ్మవారే ఉంది..శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకో అని చెప్పేవారు. ఆ మాటలు విని సుశీల.. మట్టితో శ్రీ మహాలక్ష్మి బొమ్మను తయారు చేసి ...ఆ బొమ్మనే అమ్మగా భావించి నిత్యం పూజచేసేది. సవతి తల్లి ఇచ్చిన బెల్లంముక్కను అమ్మవారిని నైవేద్యంగా పెట్టేది. కొంతకాలానికి యుక్తవయసుకి వచ్చిన సుశీలకు పెళ్లిచేసి పంపించేశారు. వెళుతూ వెళుతూ..మట్టితో తాను తయారుచేసుకున్న మహాలక్ష్మి బొమ్మను కూడా తనతో పాటూ తీసుకెళ్లింది. అప్పటి నుంచి అత్తవారింట్లో సిరిసంపదలు పెరిగాయ్..పుట్టింట్లో సంపద తుడిచిపెట్టుకుపోయి తల్లిదండ్రులు పూర్తి పేదరికంలో మునిగిపోయారు. కోడలు అడుగుపెట్టడంతోనే పొంగిపొర్లిన సిరిసంపదలు చూసి అత్తింటివారు సుశీలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. 

కొంతకాలానికి...
తన పుట్టింటివారు అనుభవిస్తున్న దారిద్ర్యం గురించి తెలుసుకుని బాధపడింది సుశీల. వారికి ఎలాగైనా సహాయం చేయాలని భావించి తన భర్తకు చెప్పింది. భర్త అనుమతి తీసుకున్న తర్వాత సోదరుడికి కబురుపెట్టి ఇంటికి రమ్మని చెప్పింది. ఓ కర్రకు జోలె కట్టి అందులో బంగారునాణేలు పోసి ఇచ్చింది. అక్క ఇంటి నుంచి బయలుదేరిన తమ్ముడు..మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ జోలెను పక్కనే ఉంచి చెరువు వద్దకు వెళ్లి వచ్చాడు. అప్పటికి ఆ బంగారు నాణేలు కనిపించకపోవడంతో ఎవరో దొంగతనం చేశారని భావించి బాధగా ఇంటికి వెళ్లిపోయాడు. 
 
మరికొంత కాలానికి
గతంలో ఇచ్చిన బంగారు నాణేల జోలెను పొగొట్టుకున్నానని సోదరుడు చెప్పాడు. దిగులు చెందవద్దు అని చెప్పిన సుశీల ఈ సారి ఓ చెప్పుల జోడు తెప్పించి వాటి నిండా వరహాలు పోసి ఇచ్చింది. అప్పుడు కూడా ఇంటికి వెళుతుండగా.. మార్గమధ్యలో ఆ చెప్పుల జోడుని కుక్క ఎత్తుకెళ్లిపోయింది.

ఇంకొంత కాలానికి..
మళ్లీ వరహాలు పోగొట్టుకున్నాడని తెలుసుకున్న సుశీల ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి సవతి తల్లికి పంపించింది. తిరుగు ప్రయాణంలో ఓ చోట చద్ది తింటుండగా..ఓ దొంగ వచ్చి గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాడు. తన దురదృష్టానికి తనను తానే తిట్టుకుని ఇంటికి చేరుకున్నాడు..
 
ఓసారి...
తన పుట్టింటివారిని చూడాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లింది సుశీల. తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు మొత్తం తెలుసుకుని బాధపడింది. పుట్టింటి దారిద్ర్యం తొలగిపోవాలంటే...శ్రీ మహాలక్ష్మిని పూజించేలా చేయాలని నిర్ణయించుకుంది. తాను పూజ చేసినట్టే మార్గశిరమాసం గురువారాల్లో తల్లితో వ్రతం చేయిస్తే పుట్టింటి పరిస్థితి మారుతుందని గ్రహించి..తనతో పాటూ తల్లిని తీసుకెళ్లింది 

మార్గశిర మాసం ప్రారంభమైంది...

మొదటి గురువారం తల్లితో నియమ నిష్ఠలతో పూజ చేయిద్దాం అనుకుంది. ఈ రోజు ఏమీ తినవద్దని చెప్పింది. కానీ ఆ తల్లి పిల్లలకు తినిపిస్తూ చటుక్కున నోట్లో వేసుకుంది. ఆ రోజు పూజ పనికిరాదని తర్వాత వారం చేయిద్దాం అనుకుంది సుశీల. రెండో గురువారం పిల్లలకు జడ వేస్తూ చేతికి ఉన్న ఆ జిడ్డును తలకు రాసేసుకుంది...ఇక రెండోవారం కూడా పూజ చేసేందుకు పనికిరాకుండా పోయింది. మూడోవారం అనుకోకుండా తల దువ్వుకుని చిక్కులు తీసుకుని జడ వేసుకుంది...ఇక మూడో వారం కూడా పోయింది. మరోవారం పూజ చేయించాల్సిందే అని తల్లిని ఓ గదిలో పెట్టి గడియ పెట్టేసింది. పిల్లలు అరటిపండ్లు తిని తొక్కలు అటుగా విసిరేశారు. ఆకలికి ఆగలేని ఆ తల్లి ఆ తొక్కలు తినేసింది. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇలాంటి ఆలోచనలే వస్తాయని భావించి బాధపడింది. ఇక ఆఖరివారం అవకాశం వదులుకోకూడదని భావించి.. తల్లి కొంగుని తన కొంగుకి ముడివేసుకుని చిన్న పిల్లలా దగ్గరే ఉంచి పట్టుదలగా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది. వ్రతభంగం కాకుండా పూజ చేసుకుని తల్లితోనూ పూజ చేయించింది. పూజ పూర్తైన తర్వాత సుశీల పెట్టిన నైవేద్యం స్వీకరించిన శ్రీ మహాలక్ష్మి..ఆమె సవతి తల్లి పెట్టిన నైవేద్యం తిరస్కరించింది. ఇదేమని అడగగా..నువ్వు చిన్నప్పుడు నా పూజ చేసినప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది.. ఆ దోషం వల్ల ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరించను అని చెప్పింది అమ్మవారు. తన సవతి తల్లి చేసిన పనిని మన్నించమని ప్రార్థించింది సుశీల. అప్పుడు అమ్మవారు శాంతించి సుశీల పుట్టినింటికి కూడా సిరిసంపదలు ప్రసాదించింది.  

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్గశిరమాంలో గురువారాలు నియమ నిష్టలతో పూజ పూర్తిచేసి.. తమ శక్తి కొలది పరమాన్నం, పులగం, బూరెలు, అప్పాలు, పులిహోర నైవేద్యంగా సమర్పించి..కుటుంబం అంతా ఆనందంగా ఉండేవారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
2026లో హరియాళి తీజ్, ఆగస్టు 15 సేల్స్: డబుల్ షాపింగ్ ధమాకా! వివాహిత మహిళలు ఏం కొనాలి?
2026లో హరియాళి తీజ్, ఆగస్టు 15 సేల్స్: డబుల్ షాపింగ్ ధమాకా! వివాహిత మహిళలు ఏం కొనాలి?
Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget