![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Maha Shivaratri 2024: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఇదే!
Largest Statue of Lord Shiva:ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్ లో ఉంది. ఆ విగ్రహం ప్రత్యేకతలేంటో చూద్దాం...
![Maha Shivaratri 2024: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఇదే! Maha Shivaratri 2024 Vishwas Swaroopam Statue of Belief largest statue of lord shiva in front of which even the eiffel tower appear small Maha Shivaratri 2024: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/20266461ae2ffb8058736ce61ad55f3a1709889134206217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Statue of Belief Largest Statue of Lord Shiva: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ బిలీవ్'. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో నిర్మించిన ఈ విగ్రహం ప్రత్యేకతలివే..
- 'స్టాట్యూ ఆఫ్ బిలీవ్' విగ్రహం ఎత్తు 369 అడుగులు
- 2 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మించిన ఈ విగ్రహం 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది
- ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు 50 వేల మందికి పదేళ్లు సమయం పట్టింది
- ఈ ఆకర్షణీయమైన విగ్రహం కోసం 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుక ఉపయోగించారు
- విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి
- వర్షం, సూర్యకాంతి నుండి రక్షించడానికి, విగ్రహానికి జింక్ పూత, రాగి పెయింట్ చేశారు
- విగ్రహం క్రిందిభాగం లోపల నిర్మించిన హాలులో 10 వేల మంది భక్తులకు ప్రవేశం ఉంటుంది
- ఈ విగ్రహం ముందు 25 అడుగుల ఎత్తు, 37 అడుగుల వెడల్పుతో నందిని కూడా తయారు చేశారు
Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా
2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గహ్లోత్, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. కొండపైన ప్రతిష్టించిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో రూపొందించారు. ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగే ఈ విగ్రహం రాత్రిపూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 250 కి.మీ వేగంతో వీచే గాలులు కూడా విగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపకుండా నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఈ విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతంలో బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటి వాటిని ఏర్పాటు చేశారు.
Also Read: పాలు, నీళ్లు, పంచామృతాలు - శివుడికే అభిషేకం ఎందుకు చేస్తారు!
శ్రీ శివ పంచాక్షరి స్తోత్రమ్
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||
యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
Also Read: 'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
Also Read: అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)